


Best Web Hosting Provider In India 2024

తెలంగాణ బర్త్ సర్టిఫికెట్ క్యూఆర్ కోడ్ సమస్యలు, బాల ఆధార్ జారీకి బాలారిష్టాలు
పిల్లల ఆధార్ నమోదు గత మూడు నెలలుగా తెలంగాణలో రిజెక్టు అవ్వడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ అవుతుండడంతో….పిల్లలను కొత్త కార్డుల్లో చేర్చేందుకు…వారికి ఆధార్ పొందేందుకు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
ఆధార్ లేనిదే నిత్యం ఏ పని సాగదు, ప్రతి పనికి అవసరమయ్యే ఆధార్ కార్డు పొందడం అంత సులభతరం అవడం లేదు, ప్రభుత్వం నుంచి పొందే ఏ పథకానికైనా, చదువులకైనా, అంగన్వాడి పాఠశాలలో చేర్పించాలన్న ఆధార్ తప్పనిసరి. ఆధార్ 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ఆధార్ నమోదు గత మూడు నెలలుగా తెలంగాణలో రిజెక్టు అవ్వడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు, ప్రస్తుత ప్రభుత్వం ఇటీవలే రేషన్ కార్డులను జారీ చేస్తోంది, ఈ సమయంలో తమ పిల్లలకు ఆధార్ కార్డు తప్పనిసరిగా జత చెయ్యాల్సి ఉండగా పిల్లల ఆధార్ కోసం ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకొనే సమయంలో పిల్లల బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరిగా జతపరుచాలి. ఆధార్ నిర్వాకులు తెలంగాణ ప్రభుత్వం మీసేవ ద్వారా ఇచ్చే బర్త్ సర్టిఫికెట్ స్కానింగ్ర్ చేసి ఎన్రోల్మెంట్ చేస్తారు. అయితే పిల్లలకు వారం రోజుల లోపల వచ్చే ఆధార్ మూడు నెలలుగా రావటం లేదు, పైగా బర్త్ సర్టిఫికెట్ చెల్లనందున ఎన్రోల్మెంట్ రిజెక్ట్ చేశామని చరవాణికి సందేశాలు అందుతున్నాయని తల్లి దండ్రులు చెబుతున్నారు, అసలే రేషన్ కార్డులు పదేళ్ల తరువాత ఇస్తున్నారని, ఇప్పుడు తమకు ఆధార్ ఉంటేనే దరఖాస్తు కు అవకాశం ఉంటుందని లేదంటే దరఖాస్తు చేసుకొనే అవకాశం కోల్పోతామని, మళ్ళీ ప్రభుత్వం రేషన్ కార్డులు మళ్ళీ ఎప్పుడు ఇస్తుందో నని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఆధార్ రాకపోవడానికి అసలు కారణం…. క్యూ ఆర్ కోడ్ స్కాన్ కాకపోవడమే.
గత రెండు నెలలుగా ఆధార్ ఎన్రోల్మెంట్ చేస్తున్నప్పటికీ ఆధార్ జనరేట్ కాకపోవడం కారణం ప్రభుత్వం ఇచ్చే బర్త్ సర్టిఫికెట్లో క్యూఆర్ కోడ్ లోపమని ఆధార్ రీజనల్ ఆఫీసు అధికారులు తెలుపుతున్నారు. ఇటీవల అన్ని ఉమ్మడి జిల్లాలలో ఏర్పాటు చేసినటువంటి ఆధార్ నిర్వాహకుల రీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో రిజెక్ట్ అవ్వడానికి కారణాలు అడుగగా ఈ విషయాన్ని వెలిబుచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అందించే బర్త్ సర్టిఫికెట్ లో క్యూ కోడ్ లింక్… uidai కి రిజిస్టర్ కాకపోడం వలన, ఆర్టిఫిషల్ ఇంటెలిజెంట్ కు అందడం లేదని అందువల్లే ఇలా రిజెక్టు అవుతున్నాయని ఆధార్ హైదరాబాద్ రీజినల్ ఆఫీసు వారు నిర్వహించిన రిట్రైనింగ్ సమావేశంలో ఆధార్ రీజినల్ మేనేజర్ అధికారి నరేష్ తెలిపారు.
తెలంగాణలో ఫిబ్రవరి 2025 ముందు ఎవరైతే మీసేవ ద్వారా తీసుకున్న బర్త్ సర్టిఫికెట్లు అందరూ మళ్ళీ మీసేవ లో వెళ్లి రీప్రింట్ బర్త్ సర్టిఫికెట్ తీసుకొని మళ్ళీ ఎన్రోల్మెంట్ చేస్కోంటే వస్తాయని అన్నారు. పాత మీసేవ బర్త్ సర్టిఫికెట్ కేవలం క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే వివరాలు పూర్తిగా అందక పోవడం వలన రిజెక్ట్ అయ్యాయని ,కానీ ఫిబ్రవరి నెల నుంచి తీసుకొనే బర్త్ సర్టిఫికెట్ లో తెలంగాణా ప్రభుత్వం ఇస్తున్నట్టు ఆన్లైన్ లింక్ ఓపెన్ అవుతుందని అన్నారు. క్యూ ఆర్ కోడ్ వలన నకిలీ బర్త్ సర్టిఫికెట్ లు గుర్తించడంలో సులభంగా, నకిలీ ధ్రువీకరణ పత్రాల జారీ నివారించేందుకు తోడ్పడుతుందని తెలిపారు.
రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడిదలాబాద్ జిల్లా హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్