



Best Web Hosting Provider In India 2024
ఏపీ మెగా డీఎస్సీ 2025 షెడ్యూల్ విడుదల – ముఖ్య తేదీలివే
టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెగా డీఎస్సీ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఏప్రిల్ 20వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. మే 15వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఏపీ మెగా డీఎస్సీ 2025
ఏపీలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శనివారం మెగా డీఎస్సీ 2025 షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 20వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొంది.
ఏపీ డీఎస్సీ 2005 షెడ్యూల్ – ముఖ్య తేదీలు:
- ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల – 20 ఏప్రిల్ 2025
- ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం – 20 ఏప్రిల్ 2025
- దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు – 15 మే 2025
- హాల్ టికెట్లు విడుదల – 30 మే 2025
- పరీక్ష తేదీలు – 06.06.2025 నంచి 06.07.2025 మధ్య ఉంటాయి.సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు.
- ప్రాథమిక కీలు – పరీక్షలు పూర్తయిన రెండు రోజు ప్రాథమిక కీలను విడుదల చేస్తారు.
- అభ్యంతరాల స్వీకరణ – ప్రాథమిక కీల విడుదల తర్వాత 7 రోజులు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
- ఫైనల్ కీ – అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత ప్రకటిస్తారు.
- మెరిట్ జాబితా – తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
- అధికారిక వెబ్ సైట్లు – https://cse.ap.gov.in లేదా https://apdsc.apcfss.in
సంబంధిత కథనం
టాపిక్
Ap Dsc NotificationAndhra Pradesh NewsEducationRecruitment