ఓటీటీలోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నయా వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నయా వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

హై జనూన్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్న ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఓటీటీలోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నయా వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ స్టార్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రలో హై జనూన్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ మ్యూజికల్ డ్రామా సిరీస్‍లో నీల్ నితిన్ ముకేశ్ కూడా మరో లీడ్ రోల్ చేస్తున్నారు. అభిషేక్ శర్మ ఈ సిరీస్‍కు దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్, డ్యాన్స్ చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఈ హై జనూన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

హై జనూన్ వెబ్ సిరీస్ మే 16వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. టీజర్ ద్వారా డేట్ కన్పర్మ్ చేసింది. మే 16 నుంచి హాట్‍స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ చూసేయవచ్చు.

రెండు మ్యూజిక్ గ్రూప్‍ల మధ్య..

టీజర్ ద్వారా హై జనూన్ స్టోరీలైన్‍పై క్లారిటీ వచ్చింది. ముంబైలోని అండర్సన్స్ కాలేజీ బ్యాక్‍డ్రాప్‍లో ఈ సిరీస్ సాగనుంది. కాలేజీలోని రెండు మ్యూజిక్ క్లబ్‍ల మధ్య పోటీతో ఈ సిరీస్ స్టోరీ ఉండనుంది. సింగింగ్, మ్యూజిక్, డ్యాన్స్ పర్ఫార్మెన్సులతో ఈ సిరీస్ సాగుతుంది.

హై జనూన్ సిరీస్‍లో జాక్వెలిన్, నితిన్ ముకేశ్‍తో పాటు సిద్దార్థ్, నిగమ్, సుమేధ్ ముద్గల్కర్, యుక్తి తరేజా, ఆర్యన్ కటోచ్, ప్రియాంక్ శర్మ, కున్వర్ అమర్, మోహన్ పాండే, ఎలిషా మేయర్ కీలకపాత్రలు పోషించారు.

హై జనూన్ సిరీస్‍ను మ్యూజికల్ డ్రామా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అభిషేక్ శర్మ. ఈ సిరీస్‍ను జియో క్రియేటివ్ ల్యాబ్స్ ప్రొడ్యూజ్ చేసింది. హిందీలో రూపొందిన ఈ సిరీస్ ఇతర భాషల డబ్బింగ్‍లోనూ వస్తుందేమో చూడాలి.

హాట్‍స్టార్‌లో అదరగొడుతున్న స్వీట్‍హార్ట్

తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా స్వీట్‍హార్ట్ గత వారం జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ అందుబాటులోకి వచ్చింది. రియా రాజ్, గోపికా రమేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం హాట్‍స్టార్ ఓటీటీలో టాప్‍లో ట్రెండ్ అవుతోంది. మార్చిలో థియేటర్లలో విడుదలైన స్వీట్‍హార్ట్ సినిమా మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఓటీటీలో మాత్రం మంచి వ్యూస్ సాధిస్తోంది.

స్వీట్‍హార్ట్ చిత్రానికి ఇలాంగో రామ్ దర్శకత్వం వహించారు. లవ్ బ్రేకప్ తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసే ట్విస్టులో ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీని పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా నిర్మించటంతో పాటు సంగీతం కూడా అందించారు. ఈ చిత్రంలో రెంజీ పనికర్, రెడిన్‍ కింగ్‍స్లే, అరుణాచల్వేశరన్, తులసి కూడా కీరోల్స్ చేశారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024