





Best Web Hosting Provider In India 2024

Sri Reddy: పోలీసుల ముందు హాజరైన నటి శ్రీరెడ్డి.. విచారణ తర్వాత మళ్లీ నోటీసులు!
Sri Reddy: నటి శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్‍లో హాజరయ్యారు. పోలీసులు ఆమెను విచారించారు. ఆ తర్వాత మరో నోటీసు అందించారు. ఆ వివరాలు ఇవే..
సోషల్ మీడియాలో గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డి చిక్కులను ఎదుర్కొంటున్నారు. వరుసగా నోటీసులను అందుకుంటున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‍కు వెళ్లారు శ్రీరెడ్డి. ఇటీవల నోటీసులు అందుకున్న ఆమె నేడు (ఏప్రిల్ 19) విచారణకు హాజరయ్యారు.
విచారణకు హాజరైన శ్రీరెడ్డిని విచారించారు సీఐ రామకృష్ణ. మళ్లీ పిలిచినప్పుడు రావాలంటూ 41ఏ నోటీసులను పోలీసులు ఆమెకు అందజేశారు. కాసేపు విచారణ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లారు శ్రీరెడ్డి.
కేసు ఇదే
ఆంధ్రప్రదేశ్‍లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో శ్రీరెడ్డి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వరుసగా చేశారు. ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‍ను టార్గెట్ చేస్తూ అప్పుడు మాట్లాడారు. కొన్ని అభ్యంతరకర, అసభ్య వ్యాఖ్యలు చేశారు. దీంతో శ్రీరెడ్డిపై తెలుగు దేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసులు నమోదయ్యాయి.
కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత శ్రీరెడ్డి స్వరం మార్చారు. తాను ఇక రాజకీయాల గురించి మాట్లాడను అంటూ సోషల్ మీడియాలో చెప్పారు. తనను క్షమించాలని నారా లోకేశ్‍ను కూడా అడిగారు.
అయితే, శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కోపంగా ఉన్న కొందరు టీడీపీ నాయకులు కేసులు పెట్టారు. దీంతో ఆమె చిక్కుల్లో పడ్డారు. అందులో భాగంగానే నేడు పోలీసులు ఎదుట హాజరయ్యారు.
ఇటీవలే జైలుకు వెళ్లిచ్చిన పోసాని
నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‍పై గతంలో చేసిన వ్యాఖ్యల కారణంగా జైలు పాలయ్యారు. ఇటీవలే సుమారు 24 రోజుల పాటు ఆయన జైలులో గడిపారు. ఆయనపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. మొత్తంగా బెయిల్ రావడంతో బయటికి వచ్చారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కూడా ఇదే అంశంలో కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ అవుతారని చాలాసార్లు వినిపించినా అలా జరగలేదు. అయితే, ఆయనకు ముందస్తు బెయిల్ దక్కింది.
సంబంధిత కథనం
టాపిక్