





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఇన్‍స్పిరేషన్ కలిగించే సినిమా.. రెగ్యులర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ సినిమా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ప్రస్తుతం రెంటల్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ చిత్రం.. సాధారణ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. రెగ్యులర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ చిత్రానికి భారీగా ప్రశంసలు దక్కాయి. టొరెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ప్రదర్శతమైన ఈ చిత్రం బాగా పాపులర్ అయింది. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ హిందీ డ్రామా మూవీ మోస్తరు కలెక్షన్లు దక్కించుకుంది. ఓటీటీలో ఇటీవలే రెంటల్ విధానంలోనూ వచ్చింది. అయితే, ఈ సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ మూవీ ఇప్పుడు ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది.
రెగ్యులర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ చిత్రం ఏప్రిల్ 25వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం ఇటీవలే ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో అడుగుపెట్టింది. అయితే, ఏప్రిల్ 25న రెంట్ తొలగిపోనుంది. ఆరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్లందరూ ఈ చిత్రాన్ని ఉచితంగా చూడొచ్చు.
సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ సినిమాలో ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్ర పోషించారు. సినీ దర్శకుడు కావాలనే ఓ యువకుడు.. తన సొంత ఊరిలోనే స్నేహితులతో కలిసి సినిమా తీయడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. స్ఫూర్తిదాయకంగా ఈ మూవీ ఉంటుంది.
నిజజీవిత కథ ఆధారంగా..
సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ సినిమాకు వరుణ్ గ్రోవర్ కథను అందించగా.. రీమా కగ్తి దర్శకత్వం వహించారు. మాలేగావ్ అనే చిన్న పట్టణంలోని ఫిల్మ్ మేకర్ నాసిర్ హుసేన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 2008లో వచ్చిన డాక్యుమెంటరీ ఆధారంగా అదే పేరుతో సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ చిత్రాన్ని డైరెక్టర్ రీమా తెరకెక్కించారు.
సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ సినిమాలో ఆదర్శ్ గౌరవ్‍తో పాటు వినీత్ కుమార్ సింగ్, శశాంక్ ఆరోరా, రిధి కుమార్, అనూజ్ సింగ్, షాకిబ్ అయూబ్, జ్ఞానేంద్ర త్రిపాఠి కీలకపాత్రలు పోషించారు. చిన్నపట్టణంలో ఉంటూ సినీ దర్శకుడిని కావాలనుకునే యువకుడు సొంతంగా చిత్రం తీసే జర్నీ ఈ మూవీలో చాలా ఇన్‍స్పిరేషన్‍గా ఉంటుంది. ఈ చిత్రంలో విభిన్న భావోద్వేగాలతో హృదయాలను తాకేలా ఉంటుంది.
సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ చిత్రాన్ని ఎక్సెల్ ఎంటర్‌టైన్‍మెంట్, టైగర్ బేబీ ఫిల్మ్స్ పతాకాలపై జోయా అక్తర్, రీమా కగ్తి, ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిద్ధ్వానీ నిర్మించారు. ఈ మూవీకి సచిన్ – జిగార్ సంగీతం అందించగా.. స్వప్నిల్ సోనావానే సినిమాటోగ్రఫీ చేశారు.
కాగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 18న ఖౌఫ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లో మోనికా పవర్, రజత్ కపూర్ లీడ్ రోల్స్ చేయగా.. పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం