Sukumar: నా రూపం వచ్చేటట్లు వరి పొలంలో పంట వేశాడు.. డైరెక్టర్ సుకుమార్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Sukumar: నా రూపం వచ్చేటట్లు వరి పొలంలో పంట వేశాడు.. డైరెక్టర్ సుకుమార్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Sukumar About Suviksit Bojja Farming As Director Face: పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ రూపం వచ్చేలా వరి పొలంలో ఫార్మింగ్ చేసిన అభిమాని సువిక్షిత్ బొజ్జ. తాజాగా సువిక్షిత్ బొజ్జ హీరోగా నటించిన సినిమా దూరదర్శిని. ఈ సినిమా నుంచి అపనా తనమనా లిరికల్ వీడియో సాంగ్‌ను సుకుమార్ రిలీజ్ చేశారు.

నా రూపం వచ్చేటట్లు వరి పొలంలో పంట వేశాడు.. డైరెక్టర్ సుకుమార్ కామెంట్స్

Sukumar About Suviksit Bojja Farming As Director Face: సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటించిన చిత్రం దూరదర్శని. కలిపింది ఇద్దరిని అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహించారు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బి. సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మించారు.

హత్తుకునే ప్రేమకథ

ప్రస్తుతం దూరదర్శిని సినిమా నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. 1990వ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవల విడుదలైన ఈ దూరదర్శిని టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో పాటు నానీడ వెళుతుందా అనే లిరికల్‌ వీడియో సాంగ్‌కు కూడా అనూహ్యమైన ప్రశంసలు లభించాయి.

సుకుమార్‌తో సాంగ్ రిలీజ్

తాజాగా దూరదర్శిని నుంచి అపనా తనామనా అనే లిరికల్ వీడియోను పాన్‌ ఇండియా డైరెక్టర్, పుష్ప, పుష్ప-2 చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకున్న బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ విడుదల చేశారు. సింధుజ, శ్రీనివాసన్‌ ఆలపించిన ఈ బ్యూటిఫుల్‌సాంగ్‌కు సురేష్‌ బనిశెట్టి సాహిత్యం అందించారు. ఆనంద్‌ గుర్రాన బాణీలు సమకూర్చారు.

అప్పట్నుంచి సువిక్షిత్ పరిచయం

ఈ పాట రిలీజ్ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ.. ”ఈ సినిమా హీరో సువిక్షిత్‌ నా రూపం వచ్చేటట్లు వరిపొలంలో ఫామింగ్‌ (పంట వేశాడు) చేశాడు. నాకు అప్పట్నుంచి సువిక్షిత్ అంటే పరిచయం ఉంది. తనకి సినిమా అంటే పాషన్‌. దూరదర్శిని నుంచి రిలీజ్ చేసిన ఈ సాంగ్‌ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. ఈ సినిమా అందరికి మంచి విజయం అందించాలి” అని తెలిపారు.

నాకు ఇష్టమైన వ్యక్తితో

హీరో సువిక్షిత్ మాట్లాడుతూ.. ”నా అభిమాన దర్శకుడు, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి సుకుమార్‌ చేతుల మీదుగా మా సాంగ్‌ ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అందరికి వాళ్ల వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకు వస్తాయి” అని అన్నాడు.

బ్యాక్‌డ్రాప్‌కు తగినట్లుగా

”తాజాగా విడుదలైన ఈ లిరికల్‌ వీడియో అందరి హృదయాలకు హత్తుకుంటుంది. 1990వ నేపథ్యంలో అందరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. బ్యాక్‌డ్రాప్‌కు తగ్గ నటీనటులతో, లోకేషన్స్‌తో ఎంతో సహజంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. తప్పకుండా చిత్రాన్ని అందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు” అని హీరో సువిక్షిత్ బొజ్జ చెప్పుకొచ్చాడు.

దూరదర్శిని సాంగ్ రిలీజ్ చేసిన సుకుమార్
దూరదర్శిని సాంగ్ రిలీజ్ చేసిన సుకుమార్

దూరదర్శిని నటీనటులు

ఇదిలా ఉంటే, దూరదర్శిని సినిమాలో సువిక్షిత్‌ బొజ్జ, గీతిర రతన్‌‌తోపాటు భద్రం, కృష్ణా రెడ్డి, కిట్టయ్య, చలపతి రాజు, జెమిని సురేష్‌, జి.భాస్కర్‌, లావణ్య రెడ్డి, తేజ చిట్టూరు తదితరులు నటించారు. ఈ చిత్రానికి నారాయాణ ఆవుల కథ అందించగా.. డైలాగ్స్‌ కాకర్ల చరణ్‌, లక్ష్మణ్‌.కె రాశారు. ఆనంద్‌ గుర్రాన సంగీతం అందించారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024