





Best Web Hosting Provider In India 2024

OTT Telugu Crime Thriller: 3 ఓటీటీల్లో తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్.. ఆడవాళ్ల రక్తం తాగే మనిషి.. ఇక్కడ చూసేయండి!
Hidimbha OTT Streaming On 3 Platforms: 3 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో తెలుగు సైకలాజికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిడింబ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆడవాళ్ల రక్తం తాగే మనిషి చుట్టూ తిరిగే ఆ సినిమాను ఒక ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. కానీ, ఓ ట్విస్ట్ ఉంది. హిడింబ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు చూస్తే..!
Hidimbha OTT Release: ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు కొదవలేదు. ఇతర భాషల్లోనే కాకుండా తెలుగులో కూడా విభిన్నమైన కథాంశంతో సినిమాలు తెరకెక్కాయి. అలాంటి వాటిలో హిడింబ మూవీ ఒకటి. యాంకర్ ఓంకార్ తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన అశ్విన్ బాబు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు.
అశ్విన్ బాబు ప్రయోగాత్మక చిత్రం
ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం అంటే 2023లో వచ్చిన సినిమానే హిడింబ. తెలుగులో సైకలాజికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన హిడింబతో అశ్విన్ బాబు ప్రయోగం చేశాడనే చెప్పాలి. అయితే, ఈ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ, ఓటీటీలోకి రిలీజ్ అయ్యాక మాత్రం మంచి పేరు తెచ్చుకుంది.
నిజానికి తెలుగులో ఇలాంటి తరహా సినిమాలు రాలేదు. ఒక యూనిక్ పాయింట్‌తో వచ్చిన హిడింబ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అయినప్పటికీ ఓటీటీలో మాత్రం అదరగొట్టింది. ఆ ఓటీటీతో పాటు ఇప్పుడు మరో రెండు ఓటీటీల్లో కూడా హిడింబ స్ట్రీమింగ్ అవుతోంది. 2023 జూలై 20న థియేటర్లలో విడుదలైన హిడింబ కొన్ని రోజులకు ఆహా ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది.
ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్
ఆహాలో ఓటీటీ రిలీజ్ అయిన హిడింబ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అశ్విన్ బాబు యాక్టింగ్ బాగుందని, యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడని టాక్ వచ్చింది. ఇక హిడింబ క్లైమాక్స్ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా మైండ్ బ్లాక్ అయ్యేలా ఉందని కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు హిడింబ మరో రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు భాషలోనే హిడింబ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్లు మాత్రమే ఇందులో హిడింబను చూడగలరు. ఇక జియో హాట్‌స్టార్‌లో మాత్రం హిడింబను ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసేయొచ్చు. కానీ, ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కేవలం హిందీ భాషలో మాత్రమే హిడింబ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
కిడ్నాప్ చేసి రక్తం తాగే మనిషి
క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి తెలుగులో వచ్చిన ఈ సైకలాజికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ హిడింబను మూవీ సజెషన్ కింద చూడొచ్చు. హిడింబ స్టోరీలోకి వెళితే.. అభయ్, ఆద్య ఇద్దరు పోలీస్ ట్రైనింగ్‌లో ఉండగా లవ్ చేసుకుంటారు. కానీ, కొన్ని కారణాలతో విడిపోతారు. ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అయితే అభయ్ మాత్రం హైదరాబాద్‌లో ఎస్సైగా చేస్తుంటాడు.
మరోవైపు సిటీలో అమ్మాయిలు అందరూ మిస్ అవుతుంటారు. ఆడవాళ్లను కిడ్నాప్ చేసి వారి రక్తం తాగుతుంటాడు ఆ కిడ్నాపర్. సీరియల్‌గా అమ్మాయిలు కిడ్నాప్ కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి వస్తుంది. దాంతో ఇన్వెస్టిగేషన్ పని ఆద్యకు అప్పజెబుతారు. ఈ క్రమమంలో ఆద్య, అభయ్ కలిసి పనిచేయాల్సి వస్తుంది.
హిడింబ ఓటీటీ స్ట్రీమింగ్
మరి వారిద్దరు కలిసి కిడ్నాప్ చేసే వ్యక్తిని పట్టుకున్నారా? వారెందుకు విడిపోయారు? మళ్లీ కలుసుకున్నారా కిడ్నాప్ చేసిన మనిషి ఆడవాళ్ల రక్తం ఎందుకు తాగుతున్నాడు? దాని వెనుక అతని కథ ఏంటీ? అసలు అతనెవరు? అనే థ్రిల్లింగ్ విషయాలు తెలియాలంటే 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న హిడింబను చూడాల్సిందే.
సంబంధిత కథనం
టాపిక్