కెనడాలో భారతీయ విద్యార్థిని మృతి; బస్టాప్ లో నిల్చుంటే బుల్లెట్ వచ్చి తగలింది..

Best Web Hosting Provider In India 2024


కెనడాలో భారతీయ విద్యార్థిని మృతి; బస్టాప్ లో నిల్చుంటే బుల్లెట్ వచ్చి తగలింది..

Sudarshan V HT Telugu

ఒంటారియోలోని హామిల్టన్ లో హర్ సిమ్రత్ రాంధవా (21) అనే భారతీయ విద్యార్థిని బుల్లెట్ గాయాలతో మృతి చెందింది. బస్టాప్ లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా ప్రమాదవశాత్తూ బుల్లెట్ తగిలి ఆమె ప్రాణాలు కోల్పోయింది.

హర్ సిమ్రత్ రాంధవా (X)

కెనడాలోని ఒంటారియోలో బుధవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటనలో, ఆ కాల్పులతో ఏ మాత్రం సంబంధం లేని హర్ సిమ్రత్ రాంధవా (21) అనే భారతీయ విద్యార్థిని మృతి చెందింది. హామిల్టన్ లోని ఓ బస్ స్టాప్ లో వేచి ఉన్న సమయంలో ఆమెకు బుల్లెట్ తగిలింది. ఆమె ఒంటారియోలోని మొహాక్ కాలేజీలో విద్యార్థిని.

కాన్సులేట్ వివరణ

టొరంటోలోని ఇండియన్ కాన్సులేట్ 21 ఏళ్ల విద్యార్థిని మరణానికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది. ఒంటారియోలోని హామిల్టన్ లో భారతీయ విద్యార్థిని హర్ సిమ్రత్ రాంధవా దుర్మరణం పట్ల కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రోడ్డుపై జరిగిన కాల్పుల్లో హర్ సిమ్రత్ కు ప్రమాదవశాత్తూ బుల్లెట్ తగిలిందని కెనడా లోని ఇండియన్ కాన్సులేట్ కాన్సులేట్ వెల్లడించింది.

కేసు నమోదు

‘ప్రస్తుతం హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత కుటుంబానికి అండగా ఉన్నాయి’ అని కాన్సులేట్ తెలిపింది. హామిల్టన్ లోని అప్పర్ జేమ్స్, సౌత్ బెండ్ రోడ్ వీధుల సమీపంలో రాత్రి 7:30 గంటలకు కాల్పులు జరిగినట్లు హామిల్టన్ పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హర్ సిమ్రత్ ఛాతీపై బుల్లెట్ గాయాలను గుర్తించారు. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

కాల్పుల ఘటన

నల్లని కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు తెల్లటి సెడాన్ కారులో ఉన్నవారిపై కాల్పులు జరిపాడు. కాల్పులు జరిగిన వెంటనే రెండు వాహనాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఘటనా స్థలానికి కొన్ని అడుగుల దూరంలో ఉన్న ఇంటి వెనుక కిటికీకి కూడా బుల్లెట్లు తగిలాయి. ఆ ఇంట్లో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. రాత్రి 7.15 నుంచి 7.45 గంటల మధ్య కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో డాష్కామ్ లేదా సెక్యూరిటీ కెమెరా ఫుటేజీల కోసం దర్యాప్తు అధికారులు అన్వేషిస్తున్నారు.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link