క్రైస్తవ సోదరులారా అందుకోండి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు, ఇదిగో అందమైన సందేశాలు కోట్‌లు

Best Web Hosting Provider In India 2024

క్రైస్తవ సోదరులారా అందుకోండి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు, ఇదిగో అందమైన సందేశాలు కోట్‌లు

Haritha Chappa HT Telugu

ఈస్టర్ పండుగకు క్రైస్తవ సోదరులంతా ఎంతో సంతోషంగా ఉంటారు. గుడ్ ఫ్రైడే రోజు పడిన బాధను ఈస్టర్ పండగతో మర్చిపోతారు. ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఇక్కడ మేము కొన్ని విషెస్ అందించాము.

ఈస్టర్ విషెస్ (Pixabay)

ఈస్టర్ పండుగ ఏసుక్రీస్తు మరణం పై సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించుకుంటారు. ఇది క్రైస్తవ సోదరులకు ఎంతో ముఖ్యమైనది. ఇది యేసు పునరుత్థానాన్ని సూచిస్తుంది. అలాగే లెంట్ సీజన్ ముగింపును కూడా చెబుతుంది. శుక్రవారం రోజు శిలువ పై ప్రాణాలు వదిలిన ఏసు ఈస్టర్ పండుగ రోజే తిరిగి ప్రాణం పోసుకుని ప్రజల మధ్యకు వస్తారు. అందుకే ఈ పండుగ ఎంతో ఆనందంగా నిర్వహించుకుంటారు క్రైస్తవులు.

ఈస్టర్ అనేది కొత్త విశ్వాసానికి, ఆశకు, కొత్త జీవితానికి చిహ్నంగా భావిస్తారు. మరణమే జీవితానికి అంతం కాదని యేసుక్రీస్తు జీవితం చెబుతుంది. ఈస్టర్ పండుగతో క్రైస్తవ సోదరులు పాటించిన లెంట్ సీజన్ ముగింపు కూడా జరుగుతుంది. ఈస్టర్ రోజున క్రైస్తవులు చర్చలలో ప్రార్థనలు చేస్తారు. కుటుంబం స్నేహితులతో వేడుకలు నిర్వహించుకుంటారు. ఇది ప్రేమ, దయను చాటి చెప్పే పండుగ.

ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలుగులో

1. ప్రేమ, నవ్వు, కొత్త ఆరంభాలకు

పునాది అందమైన ఈస్టర్

ఈరోజు మీ హృదయంలో శాంతి నిండాలని

కోరుకుంటూ హ్యాపీ ఈస్టర్

2. ఈస్టర్ పండుగ రోజున మీ హృదయం

కృతజ్ఞతతో నిండిపోవాలని

మీ ఇల్లు, ప్రేమ, ఆనందంతో

ఉప్పొంగిపోవాలని కోరుకుంటూ

ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు

3. మీకు ఈస్టర్ ఆశీర్వాదాలను పంపుతున్నాను

ఈ సీజన్లో మీరు ఆనందం, శాంతి, కొత్త ఆశలతో

జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాము

హ్యాపీ ఈస్టర్

4. ఈస్టర్ మనకు దేవుని

అనంతమైన ప్రేమను, శక్తిని సూచిస్తుంది

ఈ రోజు మీకు ఆ జీసస్ ఆశీర్వాదాలు

అందించాలని కోరుకుంటున్నాను

ఈస్టర్ శుభాకాంక్షలు

5. నా అద్భుతమైన స్నేహితునికి

ఈ ఈస్టర్ ఆనందంతో నిండి పోవాలని

ప్రకాశవంతమైన భవిష్యత్తును అందించాలని కోరుకుంటున్నాను

హ్యాపీ ఈస్టర్

6. మీకు మీ కుటుంబ సభ్యులకు ఈస్టర్ శుభాకాంక్షలు

మీ ఇల్లు, మీ హృదయం.. ఆనందంతో నిండిపోవాలని మా కోరిక

హ్యాపీ ఈస్టర్

7. శీతాకాలం తర్వాత వసంతకాలం వస్తుంది

చీకటి రాత్రుల అనంతరం ఉదయపు వెలుతురు కనిపిస్తుంది

అలాగే గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఈస్టర్

మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను

హ్యాపీ ఈస్టర్

8. చెడు రోజుల తర్వాత మంచి రోజులు

కచ్చితంగా వస్తాయని చెప్పడమే ఈస్టర్ పండుగ ఉద్దేశం

ఈస్టర్ ఒక అందమైన వేడుక

కొత్త రుతువులకు కొత్త ప్రారంభానికి సూచిక

మీకు మీ కుటుంబ సభ్యులకు ఈస్టర్ శుభాకాంక్షలు

9. ఈస్టర్ నుంచి ప్రతి సూర్యోదయం

మీ జీవితంలో కొత్త ఆశీర్వాదాలు నింపాలని మా కోరిక

మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ ఈస్టర్

10. మీ జీవితం వసంతకాలంలో

వికసించిన తోటలా మనోహరంగా ఉండాలని కోరుకుంటూ

మీకు ఈస్టర్ శుభాకాంక్షలు

11. దగ్గరగా ఉన్నా లేదా దూరంగా ఉన్నా

ఈ ఈస్టర్‌కు నువ్వు నా హృదయంలోనే ఉంటావు

ప్రేమ, ప్రశాంతత మధురమైన క్షణాలు

మీకు అందించాలని కోరుకుంటూ హ్యాపీ ఈస్టర్

12. పునరుత్థానుడైన క్రీస్తు

మీ హృదయాన్ని ఆనందంతో నింపాలని

మీ జీవితంలో కొత్త ఆశలు, శాంతిని ప్రసాదించాలని

కోరుకుంటూ ఈస్టర్ శుభాకాంక్షలు

13. ఈస్టర్ మీ జీవితంలో కొత్త ప్రారంభాలను

కొత్త ఆశను, అపారమైన ఆనందాన్ని తీసుకురావాలి

ఆ జీసస్ ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలి

ఈస్టర్ శుభాకాంక్షలు

14. దుఃఖం తర్వాత ఆనందం వస్తుంది

చీకటి తర్వాత వెలుగు వస్తుంది

ఇదే ఈస్టర్ మనకి ఇచ్చే సందేశం

హ్యాపీ ఈస్టర్

15. ఓ దేవా

నువ్వు మా దగ్గరకు తిరిగి వచ్చావు

నిన్ను చూడాలని మేము ఎంతో ఆశపడ్డాము

మా జీవితాన్ని ఆనందంతో నింపావు

మా విధిని ప్రకాశవంతం చేశావు

మా కలలను నెరవేర్చావు

జీసస్ బిడ్డలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024