



Best Web Hosting Provider In India 2024
తెలంగాణలో భూ భారతి చట్టం – ముఖ్యమైన ఈ 10 అంశాలు తెలుసుకోండి
తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న ఆర్వోఆర్-2020ను రద్దు చేసి… ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఈ నూతన చట్టంలో కీలక అంశాలను పొందుపరిచారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియతో పాటు కీలక విషయాల్లో మార్పులు తీసుకువచ్చారు.
భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న ఆర్వోఆర్-2020 రద్దు చేసి… కొత్తగా భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారమే… నాలుగు మండలాల్లో సేవలు అందుతున్నాయి. ఈ జూన్ 2 వరకల్లా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
భూ భారతి చట్టం ప్రకారం పకడ్బందీగా భూ రికార్డుల నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఎలాంటి వివాదాలు లేకుండా భూసమస్యలకు పరిష్కారం ఉంటుందని… రైతులకు ఇబ్బందులు లేకుండా కొత్త చట్టంలో కీలక సెక్షన్లను పొందుపర్చినట్లు ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. భూ భారతి చట్టానికి సంబంధించిన కరపత్రాలను కూడా రైతులకు అందజేస్తున్నారు.
పట్టా భూముల యజమానుల హక్కుల సంరక్షణతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లను ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్ పేరును కూడా భూమాతగా మార్చారు. ఈ పోర్టల్ సేవలను ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద నాలుగు మండలాల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలోనే అన్ని మండలాల్లోనూ ఈ సేవలు ప్రారంభమవుతాయి. అయితే భూ భారతి చట్టంలో ప్రస్తావించిన వాటిలో కొన్ని కీలక అంశాలను ఇక్కడ తెలుసుకోండి…
తెలంగాణ భూ భారతి చట్టం – 10 కీలక అంశాలు
- ఈ ఏడాది జనవరి 9న ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్(RoR)-2025 భూ భారతి’ చట్టం రూపం దాల్చింది. ఈ కొత్త రెవెన్యూ చట్టం ఏప్రిల్ 14వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
- ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డుల నిర్వహణ కోసం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారు. పకడ్బందీగా భూ హక్కుల రికార్డులను నిర్వహిస్తారు. తప్పుల సవరణకు కూడా అవకాశం ఉంటుంది.
- రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయటానికి ముందు భూముల సర్వే నిర్వహిస్తారు. అంతేకాదు మ్యాప్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఫలితంగా హద్దుల విషయంలో ఎలాంటి వివాదాలు రాకుండా ఉంటాయి.
- పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం చూపేందుకు ఈ కొత్త చట్టం అవకాశం కల్పిస్తుంది.
- ఇక వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ ఉంటుంది. కుటుంబ సభ్యుల అంగీకరపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి సమాచారం అందించటమే కాకుండా విచారణ తర్వాతనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇందుకు 30 రోజుల గడువు నిర్ణయించారు. ఈ గడువులోపే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
- భూ హక్కుల ఏ విధంగా సంక్రమించినప్పటికీ మ్యుటేషన్ చేసి రికార్డుల్లో నమోదు చేస్తారు. కొత్తగా ఇచ్చే పాసుపుస్తకాల్లో సర్వే మ్యాప్ ఉంటుంది.
- భూ సమస్యల పరిష్కానిరి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. భూ హక్కుల రికార్డుల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. ధరణి వ్యవస్థలో అప్పీల్ వ్యవస్థకు చోటు కల్పించలేదు.
- ప్రతి కమతానికి భూ ఆధార్ కార్డులను అందజేస్తారు.ఈ చట్టం ప్రకారం… గ్రామకంఠం, ఆబాదీలపై కూడా హక్కులను కట్టబెడుతారు.
- రైతులకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తారు.ఇందుకోసం జిల్లాల్లో న్యాయ సహాయ కేంద్రాల ఏర్పాటు చేస్తారు.రెవెన్యూ సదస్సులు నిర్వహించి గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిస్కారానికి అవకాశం కల్పిస్తారు.
- గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు అవకాశం కల్పించారు. అక్రమంగా ప్రభుత్వ భూములపై పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్