షాక్.. దేశం గర్వించే తెలుగు అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ పై వేటు.. కారణం ఇదే

Best Web Hosting Provider In India 2024


షాక్.. దేశం గర్వించే తెలుగు అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ పై వేటు.. కారణం ఇదే

యువ అథ్లెట్లను సానబెడుతూ.. ఒలింపిక్స్, పారాలింపిక్స్ స్థాయికి ఎదిగేలా చేస్తున్న భారత జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ కు షాక్. దేశం గర్వపడే ఈ కోచ్ పై నాడా సస్పెన్షన్ విధించింది.

నాగపురి రమేష్

అథ్లెటిక్స్ కోచ్ అంటే.. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో నాగపురి రమేష్ పేరు కచ్చితంగా వినిపిస్తోంది. తెలంగాణకు చెందిన ఆయన ఎంతోమంది ఛాంపియన్లను సానబెట్టారు. ద్రోణాచార్య అవార్డు కూడా అందుకున్నారు. కానీ తాజాగా ఆయనపై జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (నాడా) సస్పెన్షన్ విధించింది. ఆదివారం (ఏప్రిల్ 20) ఈ వార్త భారత అథ్లెటిక్స్ లో కలకలం రేపింది. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటున్న అథ్లెట్లు డోపింగ్ టెస్టుకు నిరాకరించడమే అందుకు కారణం.

ఏమైందంటే?

నాగపురి రమేష్ ప్రస్తుతం హైదరాబాద్ లోని సాయ్ సెంటర్ లో అథ్లెట్లకు శిక్షణ అందిస్తున్నారు. 2023 నుంచి భారత జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ గా ఆయన పని చేస్తున్నారు. అయితే ఆయన దగ్గర ట్రెయినింగ్ తీసుకుంటున్న ఇద్దరు అథ్లెట్లు డోపింగ్ టెస్టుకు నిరాకరించారు. ఈ ఇద్దరికీ రమేష్ హెల్ప్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

అందుకే వేటు

ఇటీవల అథ్లెట్లు పరాస్ సింఘాల్, పూజా రాణి, నలుబోతు షణ్ముగ శ్రీనివాస్, శుభమ్ మహరా, చెలిమి ప్రత్యూష, కిరణ్, జ్యోతి డోపింగ్ టెస్టులకు శాంపిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీనిపై నాడా సీరియస్ అయింది. అథ్లెట్లు శాంపిల్స్ ఇవ్వకపోవడం వెనుకు కోచ్ ల బాధ్యతారాహిత్యం, సపోర్ట్ ఉందని నాడా భావించింది.

అందుకే రమేష్ పై నిషేధం విధించింది. మరో ఇద్దరు కోచ్ లు కరంవీర్ సింగ్, రాకేష్ పైనా వేటు వేసింది. ఆ ఏడుగురు అథ్లెట్లనూ సస్పెండ్ చేసింది.

రమేష్ ఏమన్నారంటే?

తనపై నాడా విధించిన సస్పెన్షన్ పై నాగపురి రమేష్ స్పందించారు. ‘‘నేనెప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. అలా చేసే వారిని కూడా ఎంకరేజ్ చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన పేద క్రీడాకారులను తీర్చిదిద్దడానికే నా జీవితాన్ని ధారపోశా. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధం’’ అని రమేష్ తెలిపారు.

నాగపురి రమేష్ దగ్గర శిక్షణ పొందిన ద్యుతీ చంద్, జ్యోతి యర్రాజి, పారా అథ్లెట్ జీవాంజీ దీప్తి అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటారు. ద్యుతి, జ్యోతి ఒలింపిక్స్ లో పోటీపడ్డారు. జీవాంజీ దీప్తి 2024 పారిస్ పారాలింపిక్స్ లో బ్రాంజ్ గెలిచింది. ప్రస్తుతం డోపింగ్ కారణంగానే ద్యుతీ నిషేధం ఎదుర్కుంటోంది.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link