




Best Web Hosting Provider In India 2024
కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసిన 14 ఏళ్ల క్రికెటర్ వైభవ్.. అసలేం జరిగిందంటే?
14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం చేసి వైభవ్ సూర్యవంశీ హిస్టరీ క్రియేట్ చేశాడు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఔటైన తర్వాత ఈ రాజస్థాన్ ఆటగాడు ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
14 ఏళ్లకే వైభశ్ సూర్యవంశీ పేరు ప్రపంచ క్రికెట్లో మార్మోగుతోంది. ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్సు ఆటగాడిగా అతను హిస్టరీ క్రియేట్ చేశాడు. శనివారం (ఏప్రిల్ 19) లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ క్రీజులోకి వచ్చాడు. అయితే ఔట్ అయిన తర్వాత అతను కన్నీళ్లను ఆపుకోలేక ఏడ్చేసిన వీడియోలు వైరల్ గా మారాయి.
ఫుల్ ఎమోషనల్
ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీలో ఆడడం ఏ యువ ఆటగాడికైనా కల లాంటిదే. ఈ లీగ్ లో సత్తాచాటితే నేషనల్ టీమ్ కు సెలక్ట్ కావొచ్చు, రూ.కోట్లు కొల్లగొట్టొచ్చు. అలాంటి ఛాన్స్ నే 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ కొట్టేశాడు. అంతటి ప్రెస్టేజియస్ లీగ్ లో ఆడే అవకాశం రావడంతో వైభవ్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. క్రీజులో అడుగుపెట్టి భారీ షాట్లు ఆడిన అతను ఔటయ్యాక కన్నీళ్లు అదుపు చేసుకోలేకపోయాడు.
ఆ వయసులో కష్టమే
మార్ క్రమ్ బౌలింగ్ లో వైభవ్ స్టంపౌటయ్యాడు. 20 బంతుల్లో 34 పరుగులు చేసిన వైభవ్ 2 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. ఔట్ అయ్యాక వైభవ్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. 14 ఏళ్ల వయసులో ఎవరైనా మెచ్యూరిటీగా ఉంటూ.. భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టమే. వైభవ్ కూడా అదుపు చేసుకోలేకపోయాడు. ఈ లీగ్ లో ఆడే ఛాన్స్ వచ్చిందనే ఆనందం, వికెట్ కాపాడుకోలేకపోయాననే బాధ.. ఇలా మిక్స్ డ్ ఎమోషన్స్ తో వైభవ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. డగౌట్లో కూర్చున్న తర్వాత కూడా అతను ఏడ్చాడు.
సిక్సర్ తో
గాయంతో దూరమైన శాంసన్ స్థానంలో టీమ్ లోకి వచ్చిన వైభవ్.. ఛేజింగ్ లో ఇంపాక్ల్ ప్లేయర్ గా బరిలో దిగాడు. తన ఎదుర్కొన్న తొలి బంతికే సూపర్ సిక్సర్ కొట్టాడు. అనుభవజ్ఞుడైన శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టిన సూర్యవంశీ తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చాడు.
ఈ టీనేజ్ సెన్సేషన్ అక్కడితో ఆగిపోకుండా రెండో ఓవర్లో అవేశ్ ఖాన్ బౌలింగ్ లో తొలి బంతికి కూడా సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత ఫోర్తో ఓవర్ తో ముగించాడు. స్పిన్నర్ దిగ్వేశ్ బౌలింగ్ లో ఓ బంతిని స్టాండ్స్ లోకి పడేశాడు.
ఐపీఎల్ అరంగేట్రంలో వైభవ్ వీరోచితంగా ప్రయత్నించినప్పటికీ, ఎల్ఎస్జి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. 181 పరుగుల లక్ష్య ఛేదనలో రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link