Sampoornesh Babu: మొదటి మూడు నాలుగు రోజులు ఇబ్బంది పడ్డాను, ఉపేంద్ర లాంటి పాత్ర చేయాలని ఉంది.. సంపూర్ణేష్ బాబు కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Sampoornesh Babu: మొదటి మూడు నాలుగు రోజులు ఇబ్బంది పడ్డాను, ఉపేంద్ర లాంటి పాత్ర చేయాలని ఉంది.. సంపూర్ణేష్ బాబు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Sampoornesh Babu About Sodara Movie And Upendra: సంపూర్ణేష్ బాబు చాలా కాలం గ్యాప్ తర్వాత చేస్తున్న తెలుగు మూవీ సోదరా. ఏప్రిల్ 25న సోదరా మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సోదరా మూవీ హీరోలు సంపూర్ణేష్ బాబు సినీ విశేషాలు పంచుకున్నాడు. ఉపేంద్ర లాంటి పాత్ర చేయాలని చెప్పుకొచ్చాడు.

మొదటి మూడు నాలుగు రోజులు ఇబ్బంది పడ్డాను, ఉపేంద్ర లాంటి పాత్ర చేయాలని ఉంది.. సంపూర్ణేష్ బాబు కామెంట్స్

Sampoornesh Babu About Sodara Movie And Upendra: వైవిధ్యమైన సినిమాలు, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న కథానాయకుడు సంపూర్ణేష్‌ బాబు.. చాలా కాలం గ్యాప్ తర్వాత సంపూర్ణేష్ బాబు నటించిన సినిమా సోదరా.

సంపూర్ణేషఅ బాబుతోపాటు

అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న ‘సోదరా‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సంపూర్ణేష్ బాబు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్‌ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. మన్‌ మోహన్‌ మేనం పల్లి దర్శకత్వంలో క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ 25న సోదరా రిలీజ్

సంపూర్ణేష్ బాబు, సంజోష్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సోదరా మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర కథానాయకుడు సంపూర్ణేష్‌ బాబు మీడియాతో ముచ్చటించారు. సినీ విశేషాలను పంచుకున్నారు.

గత చిత్రాల తరహాలో ఉండదు

సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ.. ”అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదరా. ఇది నా గత చిత్రాల తరహాలో ఉండదు. ఇది కుటుంబ కథ ఇద్దరూ అన్నదమ్ముల కథ. అన్నగా బరువు బాధ్యతలు ఉన్న పాత్రను ఈ చిత్రంలో పోషించాను” అని అన్నాడు.

క్యారెక్టర్ మూడ్ పోకూడదని

”ఈ సినిమా చూస్తున్నంత సేపు అందరికి తమ రియల్‌లైఫ్‌ సంఘటనలు గుర్తుకు వస్తాయి. నా రియల్‌ లైఫ్‌లో ఉండే నరసింహా చారికి ఈ చిత్రంలో చేసిన పాత్రకు దగ్గరి పోలికలు ఉంటాయి. మొదటి మూడు నాలుగురోజులు ఈ పాత్రను పోషించడానికి ఇబ్బంది పడ్డాను. నాకు వేరే సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుండేవి. అయితే క్యారెక్టర్‌లోని మూడ్‌ పోకూడదని ఈ సినిమాలో నా పాత్ర కంప్లీట్‌ అయిన తరువాతే ఇతర సినిమాల చిత్రీకరణలో పాల్గొన్నాను” అని సంపూర్ణేష్ బాబు తెలిపాడు.

ఫ్యామిలీ మొత్తం నవ్వుకునేలా

”ఈ చిత్రంలో జనరల్‌గా నా సినిమాలో ఉండే వినోదంతో పాటు కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయి. సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరూ తమ అన్నాదమ్ములకు ఫోన్‌ చేస్తారు. హృదయకాలేయంలో ఉన్న కామెడీ మాత్రం ఉండదు. ఇందులో ఉండే వినోదం కూడా ఎంతో ఆహ్లాదంగా ఫ్యామిలీ మొత్తం నవ్వుకునేలా ఉంటుంది” అని సంపూర్ణేష్ బాబు చెప్పాడు.

హృదయకాలేయంకు మించిన కథ

”అందరూ హృదయ కాలేయం లాంటి సినిమాలు మళ్లీ మీ నుంచి ఎందుకు రావడం లేదు? అంటున్నారు. అయితే ఆ స్థాయికు తగ్గ కథలు దొరకడం లేదు. ఈ మధ్య కథలు విన్నాను. కానీ, పెద్దగా నాకు ఎక్కలేదు. హృదయాకాలేయం మించిన కామెడీ కథ దొరికితే చేస్తాను. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాను” అని సంపూర్ణేష్ బాబు వెల్లడించాడు.

చాలా పాత్రలు

”సూపర్‌ సుబ్బు అనే వెబ్‌సీరిస్‌లో కూడా నటించాను. నటుడిగా చాలా తరహా పాత్రలు చేయాలని ఉంది. ఏ అనే సినిమాలో ఉపేంద్ర లాంటి పాత్ర చేయాలని ఉంది” అని హీరో సంపూర్ణేష్ బాబు చెప్పుకొచ్చాడు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024