జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025పై బిగ్​ అప్డేట్​- రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి అంటే..

Best Web Hosting Provider In India 2024


జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025పై బిగ్​ అప్డేట్​- రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి అంటే..

Sharath Chitturi HT Telugu

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 రిజిస్ట్రేషన్​కి సంబంధించిన కీలక వివరాలను ఐఐటీ కాన్పూర్​ వెల్లడించింది. రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఏప్రిల్​ 23 నుంచి మే 2 వరకు జరుగుతుంది. పూర్తి వివరాలు..

జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ఎప్పటి నుంచి అంటే..

జేఈఈ మెయిన్స్​ సెషన్​ 1, సెషన్​ 2 ముగియడం, ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు అందరి ఫోకస్​ జేఈఈ అడ్వాన్స్​డ్​పై పడింది. ఈ నేపథ్యంలోనే జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025పై ఐఐటీ కాన్పూర్​ బిగ్​అప్డేట్​ ఇచ్చింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్​డ్​ 2025 రిజిస్ట్రేషన్ విండోను ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు తెరవనునట్టు వెల్లడించింది. మెయిన్స్​లో ఉత్తీర్ణత సాధించిన అర్హులైన అభ్యర్థులు jeeadv.ac.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మే 2న రాత్రి 11.59 గంటలకు దరఖాస్తు విండో ముగుస్తుందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 5 రాత్రి 11:59 గంటలు అని గమనించాలి.

జేఈఈ అడ్వాన్స్​డ్ 2025- ముఖ్యమైన తేదీలు..

జేఈఈ మెయిన్ క్వాలిఫైడ్ అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్ డ్​కు ఆన్​లైన్ రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు.

రిజిస్టర్డ్ అభ్యర్థుల ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మే 5

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 అడ్మిట్ కార్డు డౌన్​లోడ్​కి సమయం: మే 11 నుంచి మే 18 (మధ్యాహ్నం 2:30 గంటల వరకు)

దివ్యాంగులు/ 40 శాతం కంటే తక్కువ వైకల్యం, రాతలో ఇబ్బంది ఉన్న అభ్యర్థులకు స్క్రైబ్​ ఎంపిక: మే 17

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 పరీక్ష: మే 18 (పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు- పేపర్​ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు)

అభ్యర్థి సమాధానాల కాపీ: మే 22

ప్రొవిజనల్ ఆన్సర్ కీ: మే 26

ఆన్సర్​ కీలో అభ్యంతరాలపై సవాలు: నుంచి 27 (సాయంత్రం 5 గంటల వరకు)

జేఈఈ అడ్వాన్స్​డ్ 2025 ఫైనల్ ఆన్సర్ కీ, రిజల్ట్: జూన్ 2

ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్​ఐటీల్లో చదువు కోసం ఏటా జేఈఈని నిర్వహిస్తారు. మెయిన్స్​లో క్వాలిఫై అయిన వారికి అడ్వాన్స్​డ్​ పరీక్ష ఉంటుంది. అందులో కటాఫ్​ దాటిన వారికి వివిధ ఐఐటీలు, ఎన్​ఐటీల్లో సీట్లు లభిస్తాయి. జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల తర్వాత ఐఐటీ, ఎన్​ఐటీ+ సీట్లలో ప్రవేశానికి జోసా కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జూన్ 3న జోసా కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఐఐటీ కాన్పూర్ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) 2025 రిజిస్ట్రేషన్​ని జూన్ 2న ప్రారంభించి జూన్ 3న ముగియనుంది. జూన్ 5న ఏఏటీ నిర్వహించి జూన్ 8న ఫలితాలను ప్రకటిస్తారు.

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 దరఖాస్తు ఫీజు (ఇండియన్ నేషనల్స్) మహిళా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1,600. మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.3,200. మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ని చూడవచ్చు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link