వ్యాయామానికి సమయం దొరకట్లేదా? వంట చేసేటప్పుడు, తిన్న తర్వాత ఈ చిన్న చిన్నచిట్కాలను పాటించండి చాలు!

Best Web Hosting Provider In India 2024

వ్యాయామానికి సమయం దొరకట్లేదా? వంట చేసేటప్పుడు, తిన్న తర్వాత ఈ చిన్న చిన్నచిట్కాలను పాటించండి చాలు!

Ramya Sri Marka HT Telugu

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి రెగ్యులర్ వ్యాయామం చాలా అవసరం. కానీ ఈ రోజుల్లో వర్కవుట్ చేయడానికి సమయం దొరకడం కష్టమే. బిజీలైఫ్ లో మీకు వ్యాయామం కోసం సమయం దొరకకపోతే ముఖ్యం మీ రోజూవారి పనుల్లో ఈ రకాల చిన్న చిన్న చిట్కాలు పాటించండి.

ఫిట్‌గా ఉండాలంటే డెయిలీ లైఫ్‌లో ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించండి (Shutterstock)

మీ శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి రెండు సింపుల్ మార్గాలు ఉన్నాయి. ఒకటి సరైన ఆహారం, రెండోది కొద్దిగా వ్యాయామం. కానీ నేటి జీవనశైలిలో ఈ రెండూ కష్టమైన పనులనే చెప్పుకోవాలి. చాలా మంది తమ ఆహారం విషయంలో శ్రద్ధ వహిస్తున్నారు, కానీ వ్యాయామం విషయానికొచ్చే సరికి సమయం లేక చేయలేకపోతున్నారు.

ఎనిమిది నుండి తొమ్మిది గంటలు కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం, ఆ తర్వాత అలసిపోయి నిద్రపోవడం అంతే ఇప్పుడు చాలా మంది జీవనశైలి ఇలాగే ఉంది. ఇలాంటి సందర్భంలో ఫిట్‌నెస్ గురించి శ్రద్ధ వహించడం కష్టంతో కూడిన పని అనడంలో తప్పేం లేదు. పనితో రాజీ పడే రోజులు కావు ఇవి.

అలాగని ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించకపోవడం, సమయం కేటాయించకపోవడం పొరపాటని మీరు తెలుసుకోవాలి. వ్యాయామం చేయడానికి సమయం లేకపోయినా మీ రోజూవారి పనులు చేసే సమయంలో చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా కూడా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండవచ్చు. మీ కోసం, మీ ఆరోగ్యం కోసం మీరు కొంత సమయం కేటాయించితేనే ఫిట్ గా ఉండటం సాధ్యమవుతుంది. ముఖ్యంగా మీరు వంట చేసేటప్పుడు, తిన్న తర్వాత కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటించండి చాలు. అవేంటో, ఏమేం చేయాలో తెలుసుకుందాం రండి.

1. నడుస్తూ పనులు చేయండి

మీరు వ్యాయామం కోసం సమయం కేటాయించలేకపోతే సాధారణ నడకను మీ రోజూవారీ పనుల్లో చేర్చుకోండి. దీనికి మీరు ప్రత్యేకంగా చోటు, సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే నడుస్తూ చేయగలిగే పనులను చేయండి. ఉదాహరణకు, ఫోన్‌లో మాట్లాడటం, లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం లేదా లంచ్ తర్వాత స్నేహితులతో కొంత సేపు మాట్లాడుతూ నడవడం వస్తువలను సర్దేటప్పుడు అటు ఇటు తిరగడం వంటివి. ఇలా రోజులో ఎక్కువ సార్లు నడుస్తూ మీ పనులను చేశారంటే మీ పని అవుతుంది. మీరు నడిచినట్లు కూడా ఉంటుంది. ఇది మీరు ఫిట్‌గా, హెల్తీగా ఉండేలా చేస్తుంది.

2. ప్రోటీన్, ఫైబర్‌తో నిండిన ఆహారాలను తినండి

వ్యాయామానికి సమయం కేటాయించలేనివారు ఆహారంపై మరింత శ్రద్ధ వహించాలి. మీరు తినే భోజనంలో ప్రోటీన్, ఫైబర్‌ వంటివి సమృద్ధిగా ఉండేలా చూసుకోండి. ప్రోటీన్ కండరాల పునరుద్ధరణలో సహాయపడుతుంది, బరువు నిర్వహణలో కూడా సహాయపడుతుంది. అదేవిధంగా, ఫైబర్‌తో సమృద్ధిగా ఉండే ఆహారాలు మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది మీ మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అదనంగా ఫైబర్ కలిగిన ఆహారం తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇది బరువు నిర్వహణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

3. కాళ్లు ఎత్తి నిలబడండి

వంట చేస్తున్నప్పుడు లేదా నిల్చుని ఏదైనా పని చేస్తున్నప్పుడు, మీరు ఈ సింపుల్ ఫిట్‌నెస్ చిట్కాను ప్రయత్నించవచ్చు. ఇలాంటి సమయాల్లో మీరు మీ పాదలపై భారం వేయకుండా మీ కాలి వేళ్లపై భారం వేసి నిలబడాలి. కొంత సేపు ఆ స్థితిలో ఉండి తర్వాత సాధారణ స్థితిలో నిలబడండి. ఇలా పని చేస్తూనే మీరు ఈ చిట్కాలను ప్రయత్నించారంటే ఇది మీ కాఫ్ కండరాలను చురుకుగా ఉంచుతుంది. ఇది శరీర సమతుల్యత, స్థిరత్వాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.

4. భోజనం తర్వాత వజ్రాసనం చేయండి

భోజనం తర్వాత నడవడానికి సమయం దొరకకపోతే మీరు వజ్రాసనం చేయవచ్చు. ఇందులో మీరు వెన్నుముకను నిటారుగా ఉంచి, రెండు మోకాళ్లను వంచి, కాళ్ళపై కూర్చోవాలి. మీరు దీన్ని మీ కుర్చీలో కూర్చుని కూడా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఇది జీర్ణక్రియను బాగుంటుంది. అంతేకాదు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉంటే వజ్రాసనం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

5. హైడ్రేషన్‌పై శ్రద్ధ వహించండి

ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారం, వ్యాయామం మాత్రమే సరిపోదు. సరిపోయేంత నీరు త్రాగడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి రోజంతా మీరు ఎక్కువ సార్లు నీరు త్రాగుతున్నారా లేదా అని కూడా గమనించండి. సాధారణ నీటితో పాటు మీరు మీ ఆహారంలో డీటాక్స్ వాటర్‌ను కూడా చేర్చుకోండి. ఇవి మీరు రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరం, చర్మం లోతుల్లో నుంచి శుభ్రం చేసి అందంగా, ఆరోగ్యంగా ఉంటారు.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024