




Best Web Hosting Provider In India 2024

ఖుష్కా రైస్ ఎప్పుడైనా తిన్నారా? ఈ రెసిపితో చేశారంటే ఇదే బెస్ట్ పులావ్ అంటారు!
ఖుష్కా రైస్ పేరు ఎప్పుడైనా విన్నారా? అన్నం తినడానికి బోర్ గా అనిపించినప్పుడు, స్పెషల్ అకేషన్ల సమయంలో దీన్ని చేశారంటే మీ అకేషన్ మరింత స్పెషల్ అవాల్సిందే. ఈరెసిపీతో ఖుష్కా రైస్ తయారు చేశారంటే పలావ్ అంటే ఇదే అని అందరూ అనాల్సిందే. కావాలంటే ట్రై చేయండి.
ఖుష్కా రైస్ స్పెషల్ అండ్ ఈజీ రెసిపీ
రోజు రోటీన్ రైస్ తినడం బోర్ కొట్టినప్పుడు, సెలవులు, ప్రత్యేక రోజుల్లో ప్రత్యేకంగా ఏదైనా వండుకుని తినాలి అనుకున్నప్పుడు ఖుష్కా రైస్ బెస్ట్ ఆప్షన్. తెలంగాణలో బగారన్నం, ఆంధ్రాలో పులావ్ ఎంత ఫేమస్సో సౌతిండియాలో ఈ ఖుష్కా రైస్ అంత ఫేమస్. ఈ రెసిపీతో చేశారంటే ఇంట్లో వాళ్లంతా ఇదే బెస్ట్ పులావ్ అనేస్తారు. నాన్ వెజ్ తో ఈ రైస్ కలిపి తిన్నారంటే వావ్ అనకుండా ఉండలేరు. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. ఆలస్యం చేయకుండా ఖుష్కా రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.
ఖుష్కా రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు:
- కప్పు బియ్యం(బాస్మతీ అయితే బెటర్)
- 3 స్పూన్లు నెయ్యి
- 1 ఇంచు దాల్చిన చెక్క
- 4 లవంగాలు,
- 3 యాలకులు,
- 1 అనాస పువ్వు
- చిన్న ముక్క జాజికాయ
- ఒక టీస్పూన్ జీలకర్ర
- ఒక టీస్పూన్ సోంపు
- ఒక బిర్యానీ ఆకు
- ఒక ఉల్లిపాయ
- నాలుగు పచ్చిమిరకపకాయలు
- ఒక టీస్పూన్ అ్లలం వెల్లుల్లి పేస్ట్
- పావు చెంచా పసుపు
- ఒక టీస్పూన్ కారం
- రెండు టామాటోలు
- అర టీస్పూన్ గరం మసాలా
- రుచికి సరిపడా ఉప్పు
- అర కప్పు పెరుగు
- గుప్పెడు కొత్తిమీర
- గుప్పెడు పుదీనా
- ఒక కప్పు నీరు
తయారుచేసే విధానం:
- ప్రెజర్ కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా వేడి చేయండి.
- అంగుళం దాల్చిన చెక్క, మూడు యాలికులు, నాలుగు లవంగాలతో పాటు అనాసపువ్వు, పావు అంగుళం కంటే తక్కువ జాజికాయ వేయండి.
- వీటిని చక్కగా వేపుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ సోంపు, ఒక బిర్యానీ ఆకు వేసి నిమిషం పాటు ఫ్రై చేసుకోండి.
- ఆ తర్వాత ఉల్లిపాయ సన్న తరుగు, మూడు చీల్చుకున్న పచ్చిమిరపకాయ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించండి.
- ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కు రాగానే ఒక టీ స్పూన్ తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి.
- ఇప్పుడు పావు చెంచా, ఒక టీ స్పూన్ కారం వేసుకుని ఫ్రై చేయండి.
- ఆ తర్వాత రెండు పండిన టమాటా ముక్కలు వేసి పేస్ట్ అయిపోయేంత మెత్తగా ఉడికించుకోండి.
- ఇప్పుడు అందులో అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి.
- అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుని, అరకప్పు పెరుగు వేసి బాగా కలుపుకోండి.
- పెరుగులోని నీరు ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకూ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి.
- ఇప్పుడు అరకట్ట కొత్తిమీర తరుగు కట్టలతో సహా వేసుకోండి.
- చిన్నకట్ట పుదీనా తరుగు వేసి బాగా కలుపుకోండి.
- ఆ తర్వాత గంటసేపు ఉడకబెట్టిన బాస్మతి బియ్యం వడకట్టుకుని అందులో వేయండి.
- స్టవ్ ను హై ఫ్లేమ్ మీద పెట్టి బియ్యం విరగకుండా కలుపుకోండి.
- బియ్యం కాస్త పొడిపొడిగా అయ్యాక ఒక కప్పు నీళ్లు పోసుకోండి.
- కుక్కర్ ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేయండి.
- ఇది ఏ నాన్ వెజ్ కర్రీ అయినా లేదా రైతాతో అయినా టేస్టీగా ఎంజాయ్ చేసేయొచ్చు.
సంబంధిత కథనం