ఓటీటీలోకి పాపులర్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ లాస్ట్ సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి పాపులర్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ లాస్ట్ సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

‘యూ’ వెబ్ సిరీస్‍లో చివరి సీజన్ వచ్చేస్తోంది. ఈ సిరీస్ 5వ సీజన్ ఈవారంలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ఓటీటీలోకి పాపులర్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ లాస్ట్ సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘యూ’ చాలా పాపులర్ అయింది. పెన్‍ బాడ్‍గ్లే ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్‍లో ఇప్పటి వరకు వచ్చిన నాలుగు సీజన్లు మంచి సక్సెస్ సాధించాయి. నాలుగో సీజన్ తర్వాత చివరిదైన 5వ సీజన్ కోసం చాలా మంది ఎదురుచూశారు. ఎట్టకేలకు యూ వెబ్ సిరీస్‍లో ఐదో సీజన్ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఈ వారంలోనే స్ట్రీమింగ్‍కు రానుంది.

స్ట్రీమింగ్ వివరాలు

యూ సీజన్ 5 నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ గురువారం ఏప్రిల్ 24వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో చివరి సీజన్ 10 ఎపిసోడ్లు అదే రోజు అందుబాటులోకి వస్తాయి.

కరోలిన్ కెప్నెస్ రచించిన యూ అనే నవల ఆధారంగా అదే పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. 2018లో తొలి సీజన్ వచ్చింది. 2019ల రెండో సీజన్, 2021లో మూడోది, 2023లో మూడో సీజన్ అడుగుపెట్టాయి. తాను ఇష్టపడే మహిళలను, తనకు అడ్డం వచ్చే వారిని చంపేసే జో గోల్డ్‌బర్గ్ అనే కిల్లర్ చుట్టూ ఈ యూ సిరీస్ సాగుతుంది.

ఐదో సీజన్‍ ఇలా..

లండన్ నుంచి న్యూయార్క్ సిటీకి జో గోల్డ్‌బర్గ్ (పెన్‍ బాడ్‍గ్లే ) వెళ్లిపోతాడు. తన భార్య కేట్‍తో కలిసి మారతాడు. గతాన్ని మరిచిపోయి సంతోషంగా జీవించాలని అనుకుంటాడు. తాను చేసిన మర్డర్ల గురించి ఇప్పటికే కేట్‍కు జో చెప్పి ఉంటాడు. కేట్ పెద్దగా సీరియస్ అవదు. జోను తన గతం వెంటాడుతుందా.. అతడితో కేట్ బంధం ఎలా సాగుతుంది.. చివరికి ఏమవుతుందనేది యూ సిరీస్‍లో చివరితైన ఐదో సీజన్‍లో ఉండనుంది. ఏప్రిల్ 24 నుంచి ఈ ఐదో సీజన్‍ను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.

యూ సిరీస్ ఐదో సీజన్‍లో పెన్ బాడ్‍గ్లేతో పాటు చార్లెట్ రిచీ, బ్రేవర్, నటాషా బెహ్మన్, పెటే ప్లోజెక్, టామ్ ఫ్రాన్సిన్, నవా మవూ కీరోల్స్ చేశారు.

నెట్‍ఫ్లిక్స్‌లో జువెల్ తీఫ్

జువెల్ తీఫ్ వెబ్ సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ శుక్రవారం ఏప్రిల్ 25వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ హిందీ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్ చేశారు. జైదీప్ అహ్లవత్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కూకీ గులాటీ, రాబీ గెర్వాల్ దర్శకత్వం వహించారు. ఈ జువెల్ తీఫ్ చిత్రంలో నిఖితా దత్తా, కృణాల్ కపూర్, కుల్‍భూషణ్ కర్బంద కీరోల్స్ చేశారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024