





Best Web Hosting Provider In India 2024

OTT Thriller Movie: ఓటీటీలోకి మరో సూపర్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 7.1 రేటింగ్.. 93 నిమిషాలే.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Thriller Movie: ఓటీటీలోకి మరో సూపర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. కేవలం 93 నిమిషాల రన్ టైమ్ తోనే ఉన్న ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలేంటో తెలుసుకుందాం.
OTT Thriller Movie: థ్రిల్లర్ జానర్లో మరో సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఓ వెరైటీ టైటిల్ తో వచ్చిన ఈ మూవీకి థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒకే పాత్ర, ఒక కారులో జరిగే స్టోరీ మంచి థ్రిల్ పంచింది. ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా పేరే క్రేజీ (Crazxy).
క్రేజీ ఓటీటీ రిలీజ్ డేట్
కేవలం 93 నిమిషాల రన్ టైమ్.. స్క్రీన్ పై కనిపించేది ఒకే పాత్ర.. ఒక కారులో సాగిపోయే స్టోరీ.. అందుకు తగినట్లే క్రేజీ అనే టైటిల్.. ఈ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. క్రేజీ మూవీ ఏప్రిల్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
గిరీష్ కోహ్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజై ఇటు ప్రేక్షకులు, అటు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ నటుడు సోహమ్ షా లీడ్ రోల్లో నటించాడు.
క్రేజీ మూవీ స్టోరీ ఇదే
మహారాణి వెబ్ సిరీస్ తెలుసు కదా. ఈ సిరీస్ ద్వారా పాపులర్ అయిన నటుడు సోహమ్ షా. తర్వాత ఓటీటీలో పలు వెబ్ సిరీస్, సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ క్రేజీ మూవీలో అతడు డాక్టర్ అభిమన్యు సూద్ అనే పాత్రలో నటించాడు. డాక్టరే అయినా విచిత్రమైన ప్రవర్తనతో చెడ్డ పేరు తెచ్చుకునే ఓ తండ్రి పాత్ర అది. ఓ రోజు తన కూతురు కిడ్నాప్ కు గురైందన్న వార్తతో అతని జీవితం మలుపు తిరుగుతుంది.
ఈ సినిమా మొత్తం ఒక కారులోనే సాగడం విశేషం. లీడ్ క్యారెక్టర్ తప్ప మిగతా పెద్దగా ఇతర పాత్రలు కూడా కనిపించవు. 93 నిమిషాల పాటు ఆ కారు, ఆ పాత్ర చుట్టూ స్టోరీ తిరుగుతుంది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించింది. తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు రావడంతో రెండో వారంలో థియేటర్ల సంఖ్య పెరిగింది.
ఈ క్రేజీ మూవీని సోహమ్ షా ఫిల్మ్స్ నిర్మించింది. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటిగా ఈ క్రేజీ పేరుగాంచింది. ఒకవేళ థియేటర్లలో మీరు ఈ సినిమాను చూసి ఉండకపోతే ఏప్రిల్ 25 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది.
సంబంధిత కథనం