




Best Web Hosting Provider In India 2024

ఏపీ పదో తరగతి ఫలితాలపై బిగ్ అప్డేట్, ఈ నెల 23న విడుదల
ఏపీ పదోతరగతి ఫలితాలపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 23న ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి.
ీ పదోతరగతి ఫలితాలపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 23న ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది 6,19,275 మంది విద్యార్థుల పది పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ 10వ తరగతి ఫలితాలు 2025 ఆన్‌లైన్‌లో bse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. హెచ్.టి.తెలుగులో ఏపీ పదోతరగతి ఫలితాలు ఒక్క క్లిక్ లో తెలుసుకోవచ్చు.
హెచ్.టి.తెలుగులో పదో తరగతి ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీ పదోతరగతి ఫలితాలు ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలతో పాటు ఓపెన్ స్కూల్ టెన్త్ రిజెల్ట్స్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result , https://bse.ap.gov.in , https://apopenschool.ap.gov.in/ వెబ్‌సైట్‌లతో పాటు వాట్సాప్ ‘మన ద్వారా తెలుసుకోవచ్చు.
వాట్సాప్ మన మిత్రలో పది ఫలితాలు
పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు వాట్సాప్ మన మిత్ర ద్వారా ఫలితాలు తనిఖీ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ మొబైల్ లోని వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపించారు. అనంతరం విద్యా సేవలను ఎంచుకుని, ఆపై ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలు అప్షన్ ఎంచుకోండి. విద్యార్థి రోల్ నంబర్‌ను నమోదు చేస్తే ఫలితాల పీడీఎఫ్ కాపీని పొందవచ్చు. అలాగే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్‌ల ద్వారా ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. LEAP మొబైల్ యాప్ ద్వారా టీచర్లు, విద్యార్థుల లాగిన్‌ల ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఈ నెల 23వ తేదీన ఫలితాలు
“ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలు, ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ నెల 23న ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నాం. అభ్యర్థుల ఫలితాలు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్లు, ‘మన మిత్ర’ (వాట్సాప్), LEAP మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంచుతాం. వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు. అలానే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. LEAP మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్‌ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించాం” – ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి
సంబంధిత కథనం
టాపిక్