వేసవిలో గర్భిణిలు ఎలాంటి ఆహారం తినాలి? తల్లీ బిడ్డా ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

Best Web Hosting Provider In India 2024

వేసవిలో గర్భిణిలు ఎలాంటి ఆహారం తినాలి? తల్లీ బిడ్డా ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

Ramya Sri Marka HT Telugu

ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండకపోతే తల్లీబిడ్డా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో గర్భిణిలు ఎలాంటి ఆహారాలను తినాలి, ఆరోగ్యంగా ఉండటం కోసం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

వేసవిలో గర్భిణిలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు (freepik)

వేసవి కాలంలో ప్రెగ్నెన్సీ సాధారణ రోజుల్లో కన్నా కొంత కష్టంగా అనిపిస్తుంది. అధిక వేడి, చెమట, డీహైడ్రేషన్, అలసట వల్ల శరీరానికి ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి ఈ సమయంలో గర్భిణీ లు ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండటం కోసం శరీరానికి తగిన శక్తి, పోషణ అందడం కోసం ముఖ్యంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వేసవి రోజుల్లో తల్లితో పాటు, గర్భంలో పెరుగుతున్న శిశువు ఆరోగ్యకరంగా ఎదగాలంటే తగినన్ని ద్రవాలు, తేలికపాటి, శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో వాతావరణానికి అనుగుణంగా శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే, శక్తిని పెంచే, తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను ఎంచుకోవడం వల్ల తల్లీబిడ్డా ఆరోగ్యంగా, చురుగ్గా ఉండగలుగుతారు. అవేంటో తెలుసుకుందాం రండి.

వేసవిలో గర్భిణిలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు:

1. నీరు ఎక్కువగా తాగుతుండాలి

వేసవి కాలం వచ్చిందంటే శరీరంలో నీరు ఎక్కువగా ఖర్చు అవుతుంది. కాలానికి అనుగుణంగా శరీరానికి తగినన్ని నీరు తాగుతూ ఉండాలి. ఈ సమయంలో గర్భిణిలు రోజుకు కనీసం 8–10 గ్లాసుల నీరు తాగాలి. కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మకాయ షర్బత్, హెర్బల్ టీలు వంటివి కూడా మంచివి. వీటితో పాటు పుచ్చకాయ, ఖర్బూజ్, నారింజ, స్ట్రాబెర్రీ వంటి నీటి శాతం ఎక్కువ కలిగి ఉండే పండ్లను మితంగా తింటూ ఉండాలి.

2. చల్లదనాన్ని ఇచ్చే ఫలాలు తినండి

వేసవి కాలంలో బయట వేడి మాత్రమే కాదు శరీరంలో లోపల కూడా వేడి చేసే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ సమయంలో గర్భిణిలు శరీరానికి చల్లదానాన్నిచ్చే కూరగాయలు పండ్లను తినాలి. కీరదోస, మామిడిపండలు వంటి వాటిని తప్పకుండా తినాలి. కానీ మితంగా మాత్రమే తినాలి. వీటిని తినే ముందు శుభ్రంగా కడిగి తినడం మర్చిపోవద్దు.

3. తేలికపాటి, శక్తినిచ్చే భోజనం తీసుకోండి

ఏ సమయంలో అయినా ఆరోగ్యంగా ఉండాలంటే తేలికపాటి ఆహారాలు తినాలి, అవి శక్తినిచ్చేవి అయి ఉండాలి. ముఖ్యంగా వేసవిలో గర్భిణిలు ఈ నియమాన్ని తప్పక పాటించాలి. ఈ సమయంలో వచ్చే జీర్ణ సమస్యలు తగ్గాలి, అలాగే శక్తితో నిండాలి అనుకుంటే ఆకుకూరలు, వెజిటెబుల్ సలాడ్లు, పెరుగు, కాజా వంటి వాటిని తప్పకుండా తినాలి. ఇవి శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. బ్రౌన్ రైస్, గోధుమ రొట్టెలు, ఓట్స్ వంటి హోల్ గ్రైన్స్ తీసుకోండి. ప్రతి 3–4 గంటలకు తేలికపాటి భోజనం చేయడం మంచిది.

4. కాల్షియం, ప్రోటీన్ కలిగిన ఆహారాలు తినాలి

గర్భధారణ సమయంలో తల్లీబిడ్డా ఆరోగ్యం కోసం శరీరానికి కాల్షియం, ప్రొటీన్ కలిగిన ఆహారాలను తప్పకుండా తినాలి. పాలు, పెరుగు, పన్నీర్, టోపులతో పాటు ఉడికించిన గుడ్లు, పప్పులు, జీడిపప్పు, బాదం వంటివి డైలీ డైట్లో తప్పకుండా ఉండేలా చూసుకోండి. వీటితో పాటు చికెన్, ఫిష్ లాంటి మాంసాహారాలను కూడా తీసుకోవచ్చు. కాకపోతే వీటిని మితంగా, ఎక్కువ మసాలాలు ఉపయోగించకుండా వండుకుని తినాలి.

5. ఆరోగ్యకరమైన స్నాక్స్ తినాలి

ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మందికి చిరుతిళ్లు తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు అతిగా మసాలు కలిగిన, వేయించిన ఆహారలు తినకూడదు. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. అలాగే టీ కాఫీలు తాగితే డీహైడ్రేషన్‌ సమస్య రావచ్చు. కాబట్టి జంక్ ఫుడ్, ప్యాకెట్ స్నాక్ వంటివ వాటికి బదులుగా శనగలు, మఖానా, పాప్ కార్న్, స్ప్రౌట్స్ వంటి వాటిని ఎంచుకుని తినండి. ఇవి శక్తిని, పోషణను అందించి తల్లీబిడ్డా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.

7. సహజ శీతలీకరణ పదార్థాలు

వేసవిలో వేడి కారణంగా చల్లటి పానీయాలు తాగాలనే కోరిక పెరుగుతుంది. ఇలాంటప్పుడు కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగకండి. ఇవి హానికరమైన రసాయనాలు కలిగి ఉంటాయి. వీటికి బదులుగా పుదీనా నీరు, కొత్తిమీర నీరు, జీలకర్ర నీరు, సోంపు నీరు వంటివి తాగడం ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024