




Best Web Hosting Provider In India 2024
‘ఏఐ’ చదువు కోసం ఈ 7 ఇండియన్ ఇన్స్టిట్యూన్స్ బెస్ట్- డేటా సైన్స్‌కి కూడా..
నేటి టెక్ ప్రపంచంలో ఏఐ, డేటా సైన్స్ రంగాలకు మంచి భవిష్యత్తు ఉంది. మరి మీరు కూడా ఆయా రంగాల్లో చదువుకుని, మంచి ఉద్యోగం చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఏఐ, డేటా సైన్స్‌లో చదువు కోసం ఇండియాతో పాటు అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉన్న రంగాలుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి టెక్ ప్రపంచంలో ఈ రెండింటిపై అందరి ఫోకస్ పడింది. అందుకు తగ్గట్టుగానే వీటిల్లో మంచి కెరీర్ అవకాశాలు కూడా ఉంటున్నాయి. మరి మీరు కూడా ఏఐ, డేటా సైన్స్‌లో చదువుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఆయా రంగాల్లో టాప్ 7 భారతీయ ఇన్స్టిట్యూషన్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఏఐ- డేటా సైన్స్‌కి ఇండియాలో ఈ కాలేజ్‌లు బెస్ట్..
మనుషుల జీవితంలో ఏఐ ఇప్పుడు ఒక భాగమైపోతోంది. మనుషుల్లా పనిచేసేందుకు ఏఐ ఆధారిత మెషిన్లు పుట్టుకొస్తున్నాయి. ఈ రంగానికి డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక భారీ డేటా వాల్యూంని సైంటిఫిక్ పద్ధతులు, ప్రాసెస్, ఆల్గోరిథంతో ఎనలైజ్ చేసి జ్ఞానాన్ని ఇవ్వడమే డేటా సైన్స్. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో ఈ డేటా సైన్స్, ఏఐలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిపై పట్టు ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్‌కి భారీ సాలరీలు కూడా లభిస్తున్నాయి.
ఈ రంగాలపై పట్టు ఉన్న విద్యార్థులు రీసెర్చ్, డెవలప్మెంట్, కటింగ్ ఎడ్జ్ టెక్ సొలుషన్స్లో దూసుకెళుతున్నారు. అందుకే సరైన విద్యాసంస్థను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
క్యూఎస్ (క్వాక్వారెల్లి సైమండ్స్) 2025 లిస్ట్ ప్రకారం, ఏఐ, డేటా సైన్స్ కోసం ఇండియాలో ఇవి బెస్ట్..
ఐఐఎస్సీ బెంగళూరు
ఐఐటీ బాంబే
ఐఐటీ ఖరగ్‌పూర్
ఐఐటీ మద్రాస్
ఐఐటీ కాన్పూర్
వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెల్లూర్
ఏఐ- డేటా సైన్స్‌లో చదువు కోసం అంతర్జాతీయంగా ఇవి బెస్ట్..
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)
కార్నెగె మెలాన్ యూనివర్సిటీ
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కెలె (యూసీబీ)
నన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ, సింగపూర్
చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలు ఇలా..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజ్స్లో కోర్సు తర్వాత ఏఐ ఇంజినీర్, మెషిన్ లర్నింగ్ ఇంజినీర్, డేటా సైన్స్, ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్, ఏఐ కన్సల్టెంట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.
ఇక డేటా సైన్స్ చదివితే హై డిమాండ్ ఉన్న డేటా ఎనలిస్ట్, డేటా సైంటిస్ట్, మెషిన్ లర్నింగ్ ఇంజినీర్, డేటా ఇంజినీర్ వంటి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి.
ఏఐ- డేటా సైన్స్‌ని ఎందుకు ఎంచుకోవాలి?
రానున్న రోజుల్లో ఏఐ, డేటా సైన్స్ వినియోగం మరింత పెరుగుతుంది. వీటిలో చదువు వల్ల భవిష్యత్తు సెక్యూర్డ్‌గా ఉంటుంది. హెల్త్‌కేర్, ఫైనాన్స్, మేన్యుఫ్యాక్చరింగ్ సహా అనేక రంగాల్లో ఏఐ, డేటా సైన్స్ భాగం అవుతాయి. అందుకే ఈ రంగాల్లో చదువు ఉత్తేజకరంగానూ, హై సాలరీ పేమెంట్ని ఇచ్చే విధంగానూ ఉంటాయి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link