




Best Web Hosting Provider In India 2024

వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి చల్లని ప్రదేశాలకు వెళ్దామనుకుంటున్నారా! ఇదిగోండి 5 ఉత్తమ హిల్ స్టేషన్లు
వేసవి సెలవులు వచ్చేశాయి. వేడి వాతావరణంలో పిల్లలో కలిసి ఏదైనా చల్లటి ప్రదేశాలనకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. వేసవిలో కుటుంబంతో కలిసి వెళ్లడానికి తగిన చక్కటి, చల్లని 5 ఉత్తమ హిల్ స్టేషన్ల గురించి ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.
తీవ్రమైన ఎండ, అధిక ఉష్ణోగ్రతల వేడి నుండి ఉపశమనం పొందడానికి, చల్లని ప్రదేశాలకు వెళ్లడం ఉత్తమం. పిల్లలకు కూడా వేసవి సెలవులు మొదలు కాబోతున్నాయి. సెలవులు ఇచ్చింది మొదలు ఎక్కడికైనా తీసుకెళ్లండి డాడీ, ఏదైనా మంచి ప్లేస్ కి వెళదాం మమ్మీ అని అంటునే ఉంటారు పిల్లలు. వారికే కాదు పెద్దలకు కూడా వేడికి, పని ఒత్తిడికి దూరంగా ప్రశాంతంగా, చల్లగా ఉండే ఏదైనా ప్రదేశాలనికి వెళితే బాగుండు అని అనిపిస్తుంటుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తే మీరు మీ కుటుంబాన్ని తీసుకుని మంచి హిల్ స్టేషన్ కు వెళ్లడం ఉత్తమం.
పర్వత ప్రాంతాలు చాలా అందంగా, ప్రశాంతంగా అనిపిస్తాయి. నిత్యం గందరగోళంగా ఉండే నగర జీవితం నుండి కొన్ని రోజులు విరామం తీసుకొని, ప్రశాంతమైన హిల్ స్టేషన్‌లో సమయం గడిపితు మీకు చాలా రిలీఫ్ గా, సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఈ ప్రదేశాలలోని వివిధ ప్రదేశాలను చూసి, కొన్ని కార్యక్రమాలను ఆనందించవచ్చు. వేసవిలో పిల్లలతో పాటు వెళ్లడానికి అనువైన, అందమైన ప్రదేశాలలో ఉత్తమమైన 5 ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
1) పంచ్‌గని, మహారాష్ట్ర
పంచ్‌గని మహారాష్ట్రలోని ఒక అందమైన హిల్ స్టేషన్, పూణెకు సుమారు 100 కి.మీ. దూరంలో ఉండే ఈ ప్రాంతం అక్కడి చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన పచ్చదనికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి అందాలను చూడటానికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా వేసవిలో ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది.
పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇక్కడ సిడ్నే పాయింట్, టేబుల్ లాండ్, పరాగ్లైడింగ్, బోటింగ్ వంటి ఆకర్షణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. పంచ్‌గని వెజ్ స్ట్రీట్ ఫుడ్, స్ట్రాబెర్రీ ఫార్ములు కూడా ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఇది సహజ సౌందర్యం, ప్రశాంతతతో కూడిన కుటుంబ విహార యాత్రకు సరైన స్థలం.
2) డల్హౌసీ, హిమాచల్ ప్రదేశ్
ప్రకృతి ప్రేమికులు, ప్రశాంతత కోరుకునేవారికి డల్హౌసీ ఒక అద్భుతమైన ప్రదేశం. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్ డల్హౌసీ. ఇది 1970 మీటర్ల ఎత్తులో వున్న ఒక శాంతమైన పర్యాటక కేంద్రం. బ్రిటిష్ కాలం నిర్మాణ శైలిని ప్రతిబింబించే డల్హౌసీ చుట్టూ మంచు పర్వతాలు, కాశ్మీరీ చీరలు, హస్తకళలు, పైనస్ చెట్లతో నిండి ఉంటుంది.
వేసవి సెలవుల్లో కుటుంబాలతో కలిసి వెళ్ళేందుకు ఇది అద్భుతమైన స్థలం. ఇక్కడ ఖజ్జియార్ (India’s Mini Switzerland), కలాటోప్ వైల్డ్‌లైఫ్ సాంక్చురీ, పంచ్ పుల్లా, డైయన్ కుంద్ వంటి ప్రదేశాలు ముఖ్య ఆకర్షణలు. చల్లటి వాతావరణం, అందమైన లాండ్స్‌కేప్స్, ఆధ్యాత్మిక శాంతితో కూడిన ఈ ప్రదేశం పిల్లలకూ, పెద్దలకూ ఒక రిలాక్సింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.
3) ఔలి, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లోని ఔలి స్కీయింగ్ ప్రేమికులకు అద్భుతమైన ప్రదేశం, ఇక్కడ నుండి నందాదేవి, మరియు మాన పర్వతం వంటి అందమైన హిమాలయ శిఖరాలను చూడవచ్చు. సముద్ర మట్టానికి సుమారు 2,500 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం స్కీయింగ్ కు ప్రపంచ ప్రాచుర్యం పొందింది హిమాలయ పర్వత శ్రేణులు, మంచుతో కప్పిన ట్రెయిల్స్, చుట్టూ పర్వతాలు, ప్రకృతి సౌందర్యంతో ఇది ఎంతో ఆకర్షిణీయంగా ఉంటుంది. వేసవిలో కుటుంబం, పిల్లలతో కలిసి వెళ్లడానికి ఇది మంచి ఆప్షన్ .
ఇక్కడ రోప్‌వే రైడ్, గోర్సోన్ బగ్‌యాల్ ట్రెక్, నందా దేవి పర్వత దృశ్యాలు పెద్ద ఆకర్షణలు. ఆధ్యాత్మిక కోణం కలిిన వారు సమీపంలోని జోషిమఠ్ కూడా చూడచ్చు. ఔలి అంటే స్కీ ప్రేమికుల స్వర్గధామం మాత్రమే కాదు, శాంతిని కోరేవారికీ స్వర్గంలా అనిపిస్తుంది.
4) ఉటీ, తమిళనాడు
తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉన్న ఉటీ దాని అందమైన టీ తోటలు, ఆకర్షణీయమైన కాటేజీలు, ఇతిహాసిక నీలగిరి మౌంటెన్ రైల్వేకు ప్రసిద్ధి చెందింది. సహజ అందం, ప్రశాంత వాతావరణం కోరుకునేవారికి ఇది అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ చూడడానికి చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. పిల్లలతో, కుటుంబాలతో వెళ్ళేందుకు ఈ ప్రదేశం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఊటీ బోటింగ్ లేక్, కోడైకెనాల్ ఫాల్, రాజ్ బావన్ వంటి ప్రదేశాలు చూడటానికి బాగుంటాయి. నీలగిరి రాయల్ ట్రైన్ ద్వారా సాంకేతిక చరిత్రను కూడా అనుభవించవచ్చు. ఇది పిల్లలతో చేసే విహారాలకు సరైన స్థలం.
5) ఐజోల్, మిజోరం
ఐజోల్, మిజోరం రాష్ట్రంలోని ఒక అందమైన, ప్రశాంతమైన హిల్ స్టేషన్. ఇది సముద్ర మట్టానికి 1,000 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం పర్యాటకులకు సహజ సౌందర్యం, నేచర్ ట్రెక్కింగ్ వంటి వాటికి, పిల్లలతో వెళ్ళేందుకు ఇది చాలా సరైన ప్రదేశం. ఇక్కడ ట్యాంగ్‌వాంగ్ ఫారెస్ట్, చాపరియా లేక్స్, డజల్ వాగ్ ఫాల్ వంటి ఆకర్షణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. చుట్టూ పర్వత ప్రాంతాలు చెట్లతో నిండిన ఈ ప్రదేశం చల్లగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ప్రదేశం పిల్లలు, కుటుంబాలకు విశ్రాంతి అనుభూతి పొందేందుకు అద్భుతమైన ప్రాంతం.
సంబంధిత కథనం