





Best Web Hosting Provider In India 2024

Mahesh Babu: మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం!
Mahesh Babu – ED Notice: సినీ హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన కేసులో తాఖీదులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలంటూ తేదీని చెప్పింది.
టాలీవుడ్ అగ్ర హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇబ్బందుల్లో పడ్డారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్న ఆయనకు ఎన్‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సుహానా గ్రూప్‍లపై మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. దీంతో ఆ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్న మహేశ్ బాబుకు నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలంటూ ఆదేశించింది.
27న విచారణకు రావాలని..
సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్న మహేశ్ బాబును ఏప్రిల్ 27న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి కావాల్సిన సమాచారం ఇచ్చేందుకు రావాలని సూచించింది. ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్నందుకు సాయి సూర్య డెవపర్స్ నుంచి మహేశ్ బాబు రూ.5.9కోట్లు అందుకున్నారని ఈడీ పేర్కొంది. ఇందులో రూ.3.4కోట్లను చెక్ రూపంలో, రూ.2.5కోట్లను నగదుగాా అందుకున్నారని తెలుస్తోంది. అంత పెద్ద మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోవడంపై మహేశ్‍ను ఈడీ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
రాజమౌళితో గ్లోబల్ రేంజ్ సినిమా
దర్శక ధీరుడు రాజమౌళితో ప్రస్తుతం ఓ గ్లోబల్ రేంజ్ భారీ బడ్జెట్ చిత్రం (SSMB29)లో హీరోగా నటిస్తున్నారు మహేశ్ బాబు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ఇటీవలే ఫారిన్ వెకేషన్‍కు వెళ్లి వచ్చారు మహేశ్. అతిత్వరలో మళ్లీ షూటింగ్‍కు వెళ్లనున్నారు. ఈ తరుణంలో ఈడీ నోటీసులు అందాయి. మరి ఏప్రిల్ ఏప్రిల్ 27న ఈడీ ముందు మహేశ్ హాజరవుతారా.. సమయం కావాలని అడుగుతారా అనేది చూడాలి.
ఎస్ఎస్ఎంబీ29 చిత్రంలో మహేశ్ బాబుతో పాటు పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్‍లో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ మూవీకి సుమారు రూ.1000కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా. 2027లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు..
సంబంధిత కథనం