మన బతుకులు ఛిద్రం కాకుండా ఉండాలంటే భూమి భద్రంగా ఉండాలి, వరల్డ్ ఎర్త్ డే నిజాలు ఇవిగో

Best Web Hosting Provider In India 2024

మన బతుకులు ఛిద్రం కాకుండా ఉండాలంటే భూమి భద్రంగా ఉండాలి, వరల్డ్ ఎర్త్ డే నిజాలు ఇవిగో

Haritha Chappa HT Telugu

ప్రతి ఏడాది వరల్డ్ ఎర్త్ డే ను ఏప్రిల్ 22న నిర్వహించుకుంటాము. ఈ ప్రత్యేక దినోత్సవం పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత, భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుంది. ప్రతి ఏడాది వరల్డ్ ఎర్త్ డే ఎందుకు నిర్వహించుకుంటారో తెలుసుకోండి.

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం (Freepik)

మనిషి బతికేది భూమిపైనే. భూమి మనకు ఇచ్చే ఆహారం, నీళ్లతోనే జీవులన్నీ బతుకుతున్నాయి. భూమిని కాపాడుకుంటేనే జీవజాతులు మనగలవు. భూమిని కాపాడుకోవాలన్న అవగాహనను అందరిలో పెంచాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ప్తి ఏడాది వరల్డ్ ఎర్త్ డే నిర్వహించుకోవడం ప్రారంభించాము.

పర్యావరణ పరిరక్షణకు మద్దతును ఇచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వార్షిక కార్యక్రమం ఎర్త్ డే. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను ఎర్త్ డే ప్రపంచానికి గుర్తు చేస్తుంది.

వరల్డ్ ఎర్త్ డే 2025 థీమ్

ప్రపంచ భూమి దినోత్సవం ఏటా ఏప్రిల్ 22 న వస్తుంది. వరల్డ్ ఎర్త్ డే 2024 థీమ్ అవర్ పవర్ అవర్ ప్లానెట్ . ప్లాస్టిక్ వల్ల భూమిపై కాలుష్య సమస్య తీవ్రంగా మారిపోతోంది. అది ప్రకృతికి ఎంతో హాని కలిగిస్తుంది. దానిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నదే థీమ్ లక్ష్యం.

ఎర్త్ డే 2025 కోసం EARTHDAY.ORG భూమి ఆరోగ్యం కోసం ప్లాస్టిక్ ను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2040 నాటికి అన్ని ప్లాస్టిక్ల ఉత్పత్తిని 60 శాతం తగ్గించాలని డిమాండ్ చేసింది.

వరల్డ్ ఎర్త్ డే 2025 చరిత్ర

ఎర్త్ డే ఏర్పాటు చేయాలన్న ఆలోచన 1970 లలోనే కలిగింది. అమెరికా సెనేటర్ గేలోర్డ్ నెల్సన్, హార్వర్డ్ విద్యార్థి డెనిస్ హేస్ ల నుంచి ఈ కార్యక్రమం వెనుక ఆలోచన వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ లో క్షీణిస్తున్న వాతావరణం, కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలో 1969 జనవరిలో భారీ చమురు లీకేజీతో వారిద్దరూ తీవ్రంగా కలత చెందారు. పర్యావరణ ప్రభావాలతో తీవ్రంగా కలత చెందిన ఆయన, వాయు, నీటి కాలుష్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనుకున్నాడు.

పర్యావరణ పరిరక్షణ ఆలోచనను విస్తృత ప్రజానీకానికి తీసుకెళ్లడానికి అతను డెనిస్ హేస్ అనే యువ కార్యకర్తను నియమించాడు. విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడానికి వారు స్ప్రింగ్ బ్రేక్, ఫైనల్ ఎగ్జామ్స్ మధ్య వారాంతపు రోజైన ఏప్రిల్ 22 ను ఎంచుకుంటారు. యుఎస్ అంతటా 20 మిలియన్ల మంది ప్రజలు భారీ సంఖ్యలో ఓటు వేయడంతో వరల్డ్ ఎర్త్ డే ఏర్పడింది.

1990 నాటికి, ఎర్త్ డే జాతీయ సరిహద్దులను దాటి ఒక ప్రపంచ దినోత్సవంగా మారింది.

వరల్డ్ ఎర్త్ డేనాడు చేయాల్సిన పనులు

ఎర్త్ డే రోజు భూమిని రక్షించడం మన బాధ్యత. మీ ఇంట్లో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడానికి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. పర్యావరణాన్ని రక్షించే మార్గాలపై మీ కుటుంబం అవగాహన పొందాలి.

పెరుగుతున్న ప్లాస్టిక్ వినయోగం శక్తి ఉత్పత్తులను కూడా వేస్టు చేస్తోంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పవర్ వినియోగాన్ని కూడా తగ్గించుకోవాలి.మనతో పాటూ భూమిపై ఉన్న అన్ని జీవరాశులు, మొక్కలు, చెట్లను కూడా కాపాడుకోవాలి. మనం చేసే పనుల వల్ల సముద్ర జీవులు ఆపదలో పడ్డాలి. మనం వాడే ప్లాస్టిక్ తిని అవి ప్రాణాలు కోల్పోతున్నాయి.

ఏప్రిల్ 22 1970 నా జరిగిన మొదటి ఎర్త్ డే లో దాదాపు రెండు కోట్ల అంది ప్రజలు పాల్గొన్నట్టు తెలుస్తోంది.

2010లో అటవీ నిర్మూలనను అడ్డుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల చెట్లను నాటారు. అటవీ నిర్మూలన కారణంగా ప్రతి ఏడాది దాదాపు 18 బిలియన్ ఎకరాల అడవులు నాశనం అవుతున్నాయి.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024