





Best Web Hosting Provider In India 2024

Aamir Khan on Mahabharatha: మహాభారతం ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చెప్పిన ఆమిర్ ఖాన్
Aamir Khan on Mahabharata: మహాభారతం ప్రాజెక్ట్ గురించి బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఎలా ప్లాన్ చేస్తున్నారో వెల్లడించారు. చాలా భాగాలుగా వస్తుందని హింట్ ఇచ్చారు. ఆ వివరాలు ఇవే..
బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. జూన్ 20న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనన కలల ప్రాజెక్ట్ ‘మహాభారతం’ గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం చేస్తున్న ప్లాన్స్ గురించి అప్డేట్స్ ఇచ్చారు.
నా లక్ష్యం అదే.. ఈ ఏడాదిలోనే!
మహాభారతాన్ని వెండితెరపై చూపించాలని తాను చాలా కాలంగా లక్ష్యంగా పెట్టుకున్నానని ఆమిర్ ఖాన్ అన్నారు. ఈ సినిమా రైటింగ్ పనులు ఈ ఏడాదిలోనే మొదలవుతాయని హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్డేట్ చెప్పారు.
ఏకకాలంలో.. వేర్వేరు డైరెక్టరతో..
మహాభారతం సినిమా ఫ్రాంచైజీలో కొన్ని భాగాలు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసినట్టు ఆమిర్ ఖాన్ తెలిపారు. ఈ పార్ట్‌లకు వేర్వేరు డైరెక్టర్లు షూటింగ్ చేసేలా ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఏకకాలంలో కొన్ని పార్ట్‌ల షూటింగ్ జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. మహాభారతం ప్రాజెక్టును తానే నిర్మిస్తానని ఆమిర్ అన్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఆ మహాభారతం ఫ్రాంచైజీని ప్రొడ్యూజ్ చేసేందుకు ఆమిర్ రెడీ అయినట్టు తెలుస్తోంది.
మహాభారత ఇతిహాసాన్ని చిత్రాలుగా తీసుకొచ్చే ప్లాన్‌ను ఆమిర్ ఖాన్ గతంలోనే చెప్పారు. ఇప్పుడు అందుకు సంబంధించి అప్డేట్స్ ఇచ్చారు. ఈ ఏడాదిలోనే రైటింగ్ పనులు మొదలవుతాయని చెప్పడంతో ఆసక్తి పెరిగిపోయింది. అనేక ముఖ్యమైన పాత్రలు ఉండే మహాభారతంలో వివిధ సినీ ఇండస్ట్రీల్లోని స్టార్ నటీనటులు నటించే అవకాశాలు ఉంటాయి. దీంతో అతిపెద్ద ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ మెండుగా ఉంటుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.
సితారే జమీన్ పర్ గురించి..
2007లో వచ్చిన ‘తారే జమీన్ పర్’ క్లాసిక్‌గా నిలిచింది. ఆ మూవీలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహించారు ఆమిర్ ఖాన్. ఆ చిత్రానికి 18 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా ‘సితారే జమీన్ పర్’ మూవీ వస్తోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 20న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సీక్వెల్ చిత్రానికి ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఆమిర్ ఖాన్‌తో పాటు జెనీలియా లీడ్ రోల్ చేశారు. స్పానిష్ మూవీ ఛాంపియన్ ఆధారంగా ఈ సితారే జమీన్ పర్ రూపొందింది.
తారే జమీన్ పర్‌తో పోలిస్తే ఈ సీక్వెల్ మూవీలో తన పాత్ర విభిన్నంగా ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ తెలిపారు. సితారే జమీన్ పర్లో తన క్యారెక్టర్ దురుసుగా ఉంటుందని అన్నారు. కటువుగా మాట్లాడే పాత్ర తనది అని తెలిపారు.
సంబంధిత కథనం