Karthika Deepam Today Episode April 22: కార్తీక్‍కు జ్యో సవాల్.. గుండెల్ని పిండేసిన దీప, శౌర్య.. ‘మా అమ్మ తప్పు చేయలేదు’

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam Today Episode April 22: కార్తీక్‍కు జ్యో సవాల్.. గుండెల్ని పిండేసిన దీప, శౌర్య.. ‘మా అమ్మ తప్పు చేయలేదు’

Karthika Deepam 2 Today Episode April 22: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో దీప పోలీస్ స్టేషన్‍లో ఉందని శౌర్యకు జ్యోత్స్న చెబుతుంది. దీప వద్దకు శౌర్య వెళుతుంది. నాతో ఇంటికి రా అంటూ ఏడుస్తుంది. అబద్ధం చెప్పావంటూ కార్తీక్‍పై కోప్పడుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam Today Episode April 22: కార్తీక్‍కు జ్యో సవాల్.. గుండెల్ని పిండేసిన దీప, శౌర్య.. ‘మా అమ్మ తప్పు చేయలేదు’

కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 22) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కారు వచ్చి ఆగడంతో అమ్మ వచ్చిందా అని కార్తీక్‍ను శౌర్య అడుగుతుంది. కారులో నుంచి జ్యోత్స్న దిగుతుంది. ఈవిడ ఎందుకు వచ్చిందనుకున్న కార్తీక్.. శౌర్యను లోపలికి వెళ్లాలని చెబుతాడు. హాయ్ బావా అని జ్యోత్స్న అంటే.. ఎందుకు వచ్చావని కోపంగా అంటాడు. ఇంక నువ్వు దీపను కాపాడే ప్రయత్నాలు చేయవద్దని చెప్పేందుకు వచ్చానని జ్యోత్స్న అంటుంది. వీరి మాటలు తలుపుచాటున ఉండి వింటూ ఉంటుంది శౌర్య.

దీపే షూట్ చేసిందని డాడీ చెప్పాడు

“డాడీ (దశరథ్) దగ్గర రిపోర్ట్ రాసుకోవడానికి ఎస్ఐ వచ్చారు. దీపే నన్ను షూట్ చేసిందని డాడీ చెప్పాడు. ఈ ఒక్క ఆధారం చాలు కదా దీప జైలుకు వెళ్లేందుకు” అని జ్యో చెబుతుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. నువ్వు ఇంట్లో వాళ్లకు అబద్ధం చెప్పొచ్చు.. కానీ నిజం నువ్వైనా అర్థం చేసుకోవాలని జ్యోత్స్న చెబుతుంది. దీపను కాపాడే ప్రయత్నాలు ఇంకా చేసి విలన్ అవకు అని అంటుంది. అమ్మను నాన్న కాపాడే ప్రయత్నం చేయడం ఏంటి.. అమ్మ ఎక్కడుంది అని శౌర్య అనుకుంటుంది. నాన్నను అడిగినా అబద్ధమే చెబుతాడు.. నేను కాశీ మామయ్యను అడుగుతానని శౌర్య ఆలోచిస్తుంది. నాన్నకు తెలియకుండా వెళ్లాలని అనుకుంటుంది.

ఈ యాంగిల్‍లో ఎందుకు ఆలోచించకూడదు

నాకు గాయమై నీ చేతిలో కత్తి ఉంటే నువ్వే పొడిచావని అనుకుంటారు.. ఎవరైనా పొడిచి కూడా నీ చేతిలో కూడా పెట్టి ఉండొచ్చు కదా అని కార్తీక్ లాజిక్ చెబుతాడు. మా డాడీని ఎవరో షూట్ చేసి గన్ దీప చేతిలో పెట్టారని అంటున్నావా అని జ్యోత్స్న అడుగుతుంది. ఈ యాంగిల్‍లో ఎందుకు ఆలోచించకూడదని అంటాడు. అక్కడ అందరూ ఉన్నారని, మీ అత్త, మామయ్య మాటలైనా నమ్ముతావ్ కదా అని జ్యోత్స్న చెబుతుంది. దీప మీద నువ్వు పెంచుకున్న ప్రేమ నిన్ను గుడ్డివాడిని చేసింది బావ అని జ్యో అంటుంది.

ఎలా తప్పించుకుంటుందో చూస్తా.. జ్యో సవాల్

ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వారో అర్థం చేసుకో అని జ్యోత్స్న అంటుంది. అర్థం చేసుకున్నా కాబట్టే వీలైనంత దూరంగా ఉండాలనుకుంటున్నానని కార్తీక్ అంటాడు. నాకు చాలా పనులు ఉన్నాయ్, దయచేసి నువ్వు ఇంట్లోకి వెళ్లొద్దు అని జ్యోత్స్నతో కార్తీక్ చెబుతాడు. నా భార్యను ఎలా నిర్దోషిగా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు అని అంటాడు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అని జ్యోత్స్న అంటుంది. శిక్ష పడకుండా దీప ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను అలా సవాల్ చేసి పోతుంది జ్యో.

కోర్టుకు బయలుదేరిన శివన్నారాయణ, సుమిత్ర

దీపను కోర్టులో హాజరు పరుస్తారని.. సాక్ష్యం చెప్పేందుకు వెళదాం పదండి అని సుమిత్ర, పారిజాతంతో శివన్నరాయణ అంటాడు. ఈయన (దశరథ్) దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా మామయ్య అని సుమిత్ర అంటే.. డాక్టర్‌కు చెప్పా చూసుకుంటారని బదులిస్తాడు. కేసుకు సంబంధించిన కోర్టు వ్యవహారాలు దశరథ్‍కు తెలియకూడదని శివన్నారాయణ అంటాడు. ముగ్గురు కోర్టుకు బయలుదేరతారు.

జ్యోకు ఎదురుపడిన శౌర్య

కాశీ మామయ్య ఇల్లు ఎక్కడ అంటూ రోడ్డుపై తిరుగుతుంటుంది శౌర్య. అక్కడున్న వారిని అడిగితే తెలియదంటారు. ఇంతలో శౌర్యను కారులో వెళుతున్న జ్యోత్స్న చూస్తుంది. నువ్వేంటి రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావని శౌర్యను జ్యో అడుగుతుంది. మా అమ్మ కోసం కాశీ మామయ్య ఇంటికి వెళుతున్నానని శౌర్య సమాధానమిస్తుంది. మీ ఎక్కడ ఉందో ఎవరికి తెలుసు అని శౌర్యను జ్యోత్స్న అడుగుతుంది. నీకు తెలుసు అని శౌర్య అంటుంది. నాకు తెలుసని నీకెవరు చెప్పారని జ్యో అడుగుతుంది. నువ్వే చెప్పావ్.. మా నాన్నతో మాట్లాడడం నేను విన్నా అని శౌర్య అంటుంది.

అమ్మకు ఏమైంది, ఎక్కుడుందో చెప్పు అని జ్యోత్స్నను శౌర్య అడుగుతుంది. మళ్లీ బూచోడు వచ్చాడా అని అంటుంది. ప్లీజ్ జో.. మా అమ్మ ఎక్కడుందో చూపించు అని బాధగా అడుగుతుంది. నువ్వు నా ఫ్రెండ్ కదా.. అమ్మను చూపించు అంటుంది.

దీపను చూసి పరుగెత్తుకొచ్చిన శౌర్య

కోర్టుకు తీసుకెళ్లేందుకు దీపను పోలీస్ స్టేషన్ నుంచి కారులో ఎక్కించేందుకు కానిస్టేబుల్స్ తీసుకొస్తుంటారు. ఇంతలో శౌర్య పరిగెత్తుకొని వస్తుంది. అమ్మ.. అమ్మా అని అరుస్తుంది. శౌర్య అంటూ కూతురిని హత్తుకొని ఏడుస్తుంది దీప. శౌర్య కూడా కన్నీరు పెట్టుకుంటుంది. ఇక్కడికి ఎలా వచ్చావని దీప అడిగితే.. నీకోసమే అని శౌర్య అంటుంది. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళుతున్నావ్ అని ఏడుస్తూ అంటుంది శౌర్య. గుండెలను పిండేసింది.

కార్తీక్‍పై కోప్పడిన శౌర్య.. జ్యో చెప్పింది

ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. రౌడీ నువ్వేంటి ఇక్కడ ఉన్నావని అంటాడు. నువ్వు నాతో మాట్లాడొద్దు.. అమ్మ గురించి అబద్ధం చెప్పావ్ అని కోప్పడుతుంది శౌర్య. అసలు అమ్మ ఇక్కడ ఉందని ఎవరు చెప్పారని కార్తీక్ అడుగుతాడు. జ్యో చెప్పిందని శౌర్య బదులిస్తుంది. జ్యోత్స్నను ఎందుకు కలిశావని దీప అడుగుతుంది. జ్యో ఇంటికి వచ్చిన నాన్నతో మాట్లాడిందని, అప్పుడు నేను విన్నానని అంటుంది.

మా అమ్మ తప్పు చేయదు.. గుండెల్ని పిండేసిన సీన్

ఏమైందమ్మా నీకు అని శౌర్య బాధగా అడుగుతుంది. తప్పు చేస్తే పోలీసులు పట్టుకుంటావని చెప్పావు కదా.. మరి పోలీసులు నిన్నెందుకు పట్టుకున్నారు.. నువ్వేం తప్పు చేశావ్ అని శౌర్య ఏడుస్తూ అడుగుతుంది. శౌర్యను దీప హత్తుకుంటుంది. ఇద్దరూ కన్నీరు పెట్టుకుంటారు. “నాన్న ఎందుకు అబద్ధం చెప్పాడు. నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు. నువ్వు నాతో మాట్లాడేందుకు రావా” అని శౌర్య అంటుంది. ఇంటికి వెళదాం పదా.. నేను నిన్ను వదిలిపెట్టను అని ఏడుస్తుంది. అమ్మ తర్వాత వస్తుందని కానిస్టేబుల్ అంటుంది. “ప్లీజ్ మా అమ్మను వదిలేయండి. మా అమ్మ ఏ తప్పు చేయలేదు. చాలా మంచిది. నాకు మా అమ్మానాన్నలు కావాలి. అమ్మా.. పద ఇంటికి పోదాం” అని శౌర్య బాధగా అంటుంది. నాన్న అబద్ధం చెప్పాడని అంటుంది. నీ గురించి ఏడుస్తున్నా.. తెలుసా నీకు అని చెబుతుంది.

అమ్మకు పని ఉంది.. మనం వెళదాం పదా అని కార్తీక్ అంటాడు. నీ మాట నమ్మను.. కొత్తగా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావని శౌర్య అంటుంది. నిజంగానే అమ్మ వెళ్లాలని అని కార్తీక్ చెబుతాడు. అయితే, అమ్మతో నేనూ వెళతానని మారాం చేస్తుంది శౌర్య. నువ్వు నాన్నతో వెళ్లు అని దీప చెబుతుంది. ఏంటి ఇది అని కానిస్టేబుల్‍ను ఎస్ఐ అడిగితే.. చిన్నపిల్ల, రెండు నిమిషాలు అని కానిస్టేబుల్ చెబుతుంది. నువ్వు వస్తేనే ఇంటికి వెళతానని దీపతో ఏడుస్తూ అంటుంది శౌర్య. ఇంటికి వెళదాం రా అని కార్తీక్ అంటే.. నేను రాను, నిన్ను నమ్మను అని శౌర్య ఏడుస్తుంది. జ్యో చెప్పకపోతే అమ్మ ఎక్కడ ఉందో నాకు తెలిసి కాదు అని అంటుంది. నాకు అమ్మా.. నాన్న ఇద్దరూ కావాలని ఏడుస్తుంది.

శౌర్యకు మాటిచ్చిన కార్తీక్

శౌర్య పాప మంచిదంట.. అమ్మ మాట వింటుందంట అని దీప సముదాయిస్తుంది. దీప కూడా చాలా మంచిది.. శౌర్య మాట వింటుంది అని శౌర్య అంటుంది. శౌర్యను హత్తుకొని బోరున ఏడుస్తుంది దీప. అమ్మ మనతో రాకపోతే నేనూ నీతో మాట్లాడను అని కార్తీక్‍తో శౌర్య అంటుంది. నాకు చిన్న పని ఉంది.. తర్వాత వస్తానని, నువ్వు వెళ్లు దీప చెబుతుంది. నువ్వు నా మాట వినకుంటే నేను ఎప్పటికీ రాను అని శౌర్యకు దీప చెబుతుంది. అమ్మ కావాలంటే ఇప్పుడు మీ నాన్నతో వెళ్లాలి అని అంటుంది. వెళతాను అని శౌర్య అంటుంది. కార్తీక్ బాబు.. శౌర్యను తీసుకెళ్లండి అని దీప చెబుతుంది. తప్పకుండా వస్తావ్ కదూ అని శౌర్య అంటే.. వస్తానని దీప చెబుతుంది. ఒట్టు అని శౌర్య అంటే దీప ఆలోచిస్తుంది. ఒట్టు వేయదు. అమ్మను తప్పకుండా తీసుకొస్తానని కార్తీక్ మాటిస్తాడు. నాన్న మాట ఇచ్చాడంటే తప్పడు అని శౌర్య అంటుంది.

అమ్మా నువ్వు తొందరగా రావాలి.. ఎదురుచూస్తూ ఉంటానని చెబుతుంది. మీ నాన్న ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకైనా వస్తానని దీప చెబుతుంది. నాన్నతోనే ఉండు అని దీప అంటుంది. బాయ్ అమ్మా అంటూ శౌర్య ఏడుస్తుంది. అమ్మ ఎంత దూరం వెళ్లినా నేను తీసుకొస్తానని కార్తీక్ అంటాడు. మాటిచ్చావ్ కదా తీసుకొచ్చేయ్ అని శౌర్య అంటుంది. ఇంటికెళదాం పదా అని కార్తీక్ చెబుతాడు.

సాక్ష్యాలు ఉరితాడు కావాలి.. సుమిత్రతో పారిజాతం

“ఆ దీపకు బుద్ధి చెప్పేందుకు సరైన టైమ్ వచ్చింది. ఇప్పుడు కోర్టులో పడే శిక్ష పెద్ద గుణపాఠం కావాలి. మనం చెప్పే సాక్ష్యాలు దాని మెడకు ఉరితాడు కావాలి. కార్తీక్ ముఖం చూసో.. కార్తీక్ గుర్తొచ్చో.. చంటిదాని తలచుకొనే మీరు కనికరిస్తే అది మన జ్యోత్స్నను బతకనివ్వదు” అని కోర్టుకు వెళ్లే దారిలో సుమిత్రతో పారిజాతం అంటుంది. నాకు నా కొడుకు ముఖం తప్ప ఎవరూ గుర్తుకు రారు, నేను పడిన బాధ నాకే తెలుసు అని శివన్నారాయణ అంటాడు. నా మనవరాలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న దీపకు ఎలాంటి న్యాయం చేయాలో అలాంటిదే చేద్దామని చెబుతాడు. సుమిత్ర బాధగా ఉంటుంది.

నాతో చెప్పి ఉంటే అప్పుడే కాపాడే వాడిని

దీప కోసం కోర్టు దగ్గర వేచిచూస్తుంటారు కార్తీక్, కావేరి. ఏం జరిగిందో ఆరోజు నాతో చెప్పి ఉంటే అప్పుడే దీపను కాపాడేవాడినని కార్తీక్ అంటాడు. నువ్వు ఏం చేస్తావోనని భయమేసిందని కావేరి అంటుంది. అలా దాచే పరిస్థితి ఇక్కడి వరకు తెచ్చారని చెబుతుంది. జ్యోత్స్న అంత మంచిది కాదని, నిన్ను దక్కించుకునేందుకు ఏదైనా చేస్తాననిందని అంటుంది. దీపను నీ జీవితంలో ఉండనివ్వను అని చెప్పింది, కానీ ఏం చేయబోతోందో చెప్పలేదని అని కావేరి అంటుంది.

వెనుక ఏదైనా జరిగిందా!

దీపను నీ నుంచి శాశ్వతంగా దూరం పారిజాతంతో జ్యోత్స్న చెప్పిందని కావేరి అంటుంది. “దురదృష్టం చూశావా. దీప గన్ పట్టుకోవడం ఏంటి. అది పేలడం ఏంటి. బుల్లెట్ దశరథ్‍కు తగలడం ఏంటి. అంతా మాయలాగా జరిగిపోయింది” అని కావేరి అంటుంది. “నేను చూసిన దానికి.. దీప చెప్పిన దానికి వెనుక ఏదైనా జరిగిందా” అని కార్తీక్ ఆలోచిస్తాడు. ఇంతలో దీపను కోర్టు దగ్గరికి తీసుకొస్తారు పోలీసులు. కార్తీక్, కావేరి దగ్గరికి దీప వస్తుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 22) ఎపిసోడ్ పూర్తయింది. కోర్టులో ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్‍లో తెలియనుంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024