





Best Web Hosting Provider In India 2024

TS Inter results 2025 : కాసేపట్లో తెలంగాణ ఇంటర్ బోర్డు 2025 ఫలితాలు విడుదల.. ఇలా సులభంగా రిజల్ట్ తెలుసుకోవచ్చు
తెలంగాణ ఇంటర్ బోర్డు 2025 ఫలితాలను కాసేపట్లో విడుదల చేయనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హెచ్‌టీ తెలుగు డైరెక్ట్ లింక్స్ ద్వారా ఫలితాలను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025 ఫలితాలను కాసేపట్లో విడుదల చేయనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. రిజల్ట్‌కు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. అలాగే హెచ్‌టీ తెలుగు లింక్స్ ద్వారా ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.
హెచ్‌టీ తెలుగు లింక్స్..
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ 2025 ఫలితాల లింక్..
https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result
తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 ఫలితాల లింక్..
https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ వొకేషనల్ ఫలితాల లింక్..
https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result
తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 వొకేషనల్ ఫలితాల లింక్..
https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-voc-result
అధికారిక వెబ్‌సైట్ ద్వారా..
1. విద్యార్థులు ఫలితాలను యాక్సెస్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ను సందర్శించాలి.
2. హోమ్‌పేజీలో “టీజీ ఇంటర్ ఫలితాలు 2025” లింక్ ఉంటుంది. ఆ లింక్‌పై క్లిక్ చేయాలి.
3. “మొదటి సంవత్సరం ఫలితాలు” లేదా “రెండవ సంవత్సరం ఫలితాలు” ఎంచుకోవాలి.
4. రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ వంటి లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
5.మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్తు ప్రయోజనాల కోసం స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేసుకోవాలి.
స్కోర్ కార్డులో ఏముంటాయి..
1.విద్యార్థి పేరు
2.విద్యార్థి హాల్ టికెట్ నంబర్
3.సబ్జెక్టుల వారీగా మార్కులు
5.విద్యార్థుల అర్హత స్థితి (పాస్ లేదా ఫెయిల్)
6.డివిజన్ (మొదటి, రెండవ లేదా మూడవ స్థానం)
7.విద్యార్థి పొందిన గ్రేడ్
పరీక్షలు ఇలా..
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5, 2025 నుండి మార్చి 24, 2025 వరకు జరిగాయి. రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 6, 2025 నుండి మార్చి 25, 2025 వరకు జరిగాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3, 2025 నుండి ఫిబ్రవరి 22, 2025 వరకు జరిగాయి.
టాపిక్