





Best Web Hosting Provider In India 2024

ఇంకొక్క రోజే విద్యార్థులకు స్కూల్ కష్టాలు.. ఎల్లుండి నుంచి తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వచ్చేసింది. మరొక్క రోజు బడికి వెళితే ఎల్లుండి నుంచి వేసవి సెలవులు మొదలైపోతాయి. తెలంగాణలో పాఠశాలలకు విద్యా సంవత్సరం ఏప్రిల్ 23తో ముగియనుంది. తిరిగి జూన్ 12 బడులు తెరుచుకుంటాయి.
తెలంగాణలో పాఠశాలలకు ఎల్లుండి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులను ప్రకటించారు.
తెలంగాణలో రేపటితో విద్యా సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ విద్యా శాఖ విడుదల చేసిన విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారం.. తెలంగాణలోని పాఠశాలలకు వేసవి సెలవులు ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం అవుతాయి. పాఠశాలలు తిరిగి జూన్ 12న తెరుచుకుంటాయి.
ఈ ఏడాది పాఠశాల విద్యార్థులకు 46 రోజుల వేసవి సెలవులు లభించాయి. ఇప్పటికే అన్ని బోర్డులకు సంబంధించి వార్షిక పరీక్షల నిర్వహణ పూర్తి చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవుల షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది వేసవిలో మొత్తం 46 సెలవులు లభించనున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్