Bigg Boss Amardeep: బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్ చౌద‌రి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ లాంఛ్ – టైటిల్ ఇదే

Best Web Hosting Provider In India 2024

Bigg Boss Amardeep: బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్ చౌద‌రి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ లాంఛ్ – టైటిల్ ఇదే

Nelki Naresh HT Telugu

బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ అమ‌ర్‌దీప్ చౌద‌రి హీరోగా న‌టించిన సుమ‌తీ శ‌త‌కం మూవీ ఇటీవ‌ల అమ‌రావ‌తిలో ప్రారంభ‌మైంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సైలీ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ మూవీలో బిగ్‌బాస్ సీజ‌న్ 8 కంటెస్టెంట్ టేస్టీ తేజ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్ చౌద‌రి

బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ అమ‌ర్‌దీప్ చౌద‌రి సుమ‌తీ శ‌త‌కం పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు. రొమాంటిక్ ఎంగేజింగ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఇటీవ‌ల అమ‌రావ‌తిలో ప్రారంభ‌మైంది.

ఈ సినిమా ద్వారా ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీలో బిగ్ అమర్‌దీప్ చౌదరికి జోడీగా సైలీ చౌదరి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

వైకుంఠ‌పురం విలేజ్‌లో

అమరావతిలోని వైకుంఠ‌పురం విలేజ్ టెంపుల్‌లో ఘనంగా సుమ‌తీ శ‌త‌కం మూవీప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్లాప్ కొట్టారు. సుమతీ శతకం మూవీకి కథను బండారు నాయుడు అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చుతున్నారు.

స‌న్నీలియోన్ మందిర మూవీ…

గ‌తంలో సన్నీ లియోన్ తో ‘మందిర’సినిమాను నిర్మించిన‌ కొమ్మాలపాటి సాయి సుధాకర్ సుమ‌తీ శ‌త‌కం సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బిగ్‌బాప్ ఫేమ్ టేస్టీ తేజ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

ఈ మూవీలో అమ‌ర్‌దీప్ చౌద‌రి పాత్ర కొత్త కోణంలో ఉంటుంద‌ని స‌మాచారం. ప‌క్కింగి అబ్బాయి ఇమేజ్‌కు భిన్న‌మైన క్యారెక్ట‌ర్‌లో అత‌డు క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

మ‌రో రెండు సినిమాలు…

సుమ‌తీ శ‌త‌కంతో పాటు హీరోగా మ‌రో రెండు సినిమాలు చేస్తోన్నాడు అమ‌ర్‌దీప్‌. అత‌డు క‌థానాయ‌కుడిగా న‌టించిన తొలి సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఈ మూవీలో న‌టి సురేఖ‌వాణి కూతురు సుప్రిత హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లే మ‌రో ల‌వ్ కామెడీ డ్రామా మూవీని అనౌన్స్‌చేశాడు అమ‌ర్‌దీప్‌. అను ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీలో స్ర‌వంతి ఆనంద్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది.

బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్‌…

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో ఫ‌స్ట్ ర‌న్న‌ర‌ప్‌గా అమ‌ర్‌దీప్ నిలిచాడు. ఈ సీజ‌న్‌లో ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ విన్న‌ర్‌గా నిలిచాడు. ఆరంభం నుంచి అమ‌ర్‌దీప్ టైటిల్ విన్న‌ర్ అంటూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఫైన‌ల్‌లో మాత్రం అమ‌ర్‌దీప్‌కు షాకిస్తూ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ టైటిల్ ఎగ‌రేసుకుపోయాడు.

తెలుగు సీరియ‌ల్స్‌

బిగ్‌బాస్ కంటే ముందు జాన‌కి క‌ల‌గ‌న‌లేదు, ఉయ్యాల జంపాల‌, సిరి సిరి మువ్వ‌లుతో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్ చేశాడు. ఈ సీరియ‌ల్స్ ద్వారా పాపుల‌ర్ అయ్యాడు. రాజుగారికిడ్నాప్‌, ప్రేమ‌దేశం, ఐరావ‌తంతో పాటు మ‌రికొన్ని చిన్న సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేశాడు.

విడాకులు….

రియ‌ల్ లైఫ్‌లో తెలుగు సీరియ‌ల్ యాక్ట‌ర్ తేజ‌స్విని గౌడ‌ను పెళ్లిచేసుకున్నాడు అమ‌ర్‌దీప్‌.వీరిద్ద‌రు విడాకులు తీసుకున్న‌ట్లుగా కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల‌ను తేజ‌స్విని ఖండించింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024