OTT Animated Movies: పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే 10 యానిమేషన్ చిత్రాలు.. వేసవి సెలవుల్లో ఓటీటీల్లో చూపించండి!

Best Web Hosting Provider In India 2024

OTT Animated Movies: పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే 10 యానిమేషన్ చిత్రాలు.. వేసవి సెలవుల్లో ఓటీటీల్లో చూపించండి!

OTT Animated Movies: కొన్ని యానిమేషన్ సినిమాలు సరదాగా ఉండటంతో పాటు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అలాంటి 10 చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.. వేసవిలో మీ పిల్లలకు ఓటీటీల్లో చూపించండి!

OTT Animated Movies: పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే 10 యానిమేషన్ చిత్రాలు.. వేసవి సెలవుల్లో ఓటీటీల్లో చూపించండి!

యానిమేషన్ సినిమాలు అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. సరదాగా ఉండటంతో పాటు పాత్రలు బొమ్మల్లా కనిపించడం వల్ల తొందరగా కనెక్ట్ అవుతారు. ఆసక్తికరంగా చూస్తారు. కొన్ని యానిమేటెడ్ చిత్రాలు పిల్లలకు సరదాను పంచటంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఇలాంటి సినిమాలను పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా చూపించాలి. వేసవి సెలవులు వచ్చేయడంతో అందుకు ఇదే సరైన సమయం. యానిమేటెడ్ మూవీస్ కావటంతో పిల్లలు ఇష్టంగా చూడడంతో పాటు వారిలో ఆటోమేటిక్‍గా పాజిటివిటీ పెరుగుతుంది. అలా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచగలిగే 10 యానిమేషన్ సినిమాలు గురించి, ఇవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

కుంగ్ ఫూ పాండా

కుంగ్ ఫూ పాండా (2008) సరదాగా ఉండటంతో పాటు పిల్లల్లో తమపై తమకు నమ్మకాన్ని పెంచగలదు. ఈ చిత్రంలో తికమకగా ఉండే పాండా.. వారియర్‌లా మారేందుకు చేసే పనులు, కృషి మెప్పిస్తాయి. పిలల్లకు నవ్వు తెప్పించడంతో పాటు ఆలోచింపజేస్తాయి. ఎదుటి వారు సందేహిస్తున్నా.. నీలోని బలాన్ని నువ్వు నమ్ముకో అనే మెసేజ్‍ను అందిస్తుంది ఈ మూవీ. కుంగ్‍ఫూ పాండా సినిమా జియోహాట్‍స్టార్, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.

ఫైండింగ్ నీమో

సముద్రగర్భంలో చేపలతో పాటు ఇతర జలచరాలతో ఈ ‘ఫైండింగ్ నీమో’ (Findeing Nemo) యానిమేషన్ చిత్రం ఉంటుంది. కుటుంబం, స్నేహం గురించి పాజిటివ్ మెసేజ్‍ను ఈ చిత్రం అందిస్తుంది. చేప అయిన నీమోకు ఓ రెక్క సరిగా లేకపోయినా సవాళ్లను ఎలా ఎదుర్కొనిందనే విషయం స్ఫూర్తివంతంగా అనిపిస్తుంది. పిల్లలు ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు. ఫైండింగ్ నీమో జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ ఇంగ్లిష్ చిత్రం తెలుగు, తమిళం, హిందీలోనూ అందుబాటులో ఉంది.

మోనా

తన ప్రజలను కాపాడుకునేందుకు చిన్నపిల్ల అయిన ‘మోనా’ (Moana) తనను తాను ఎలా నమ్మి ఎలా పోరాడిందనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. మోనా (2016) చిత్రం చూడడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తమపై తమకు ఏవైనా సందేహాలు ఉంటే సమాధానాల కోసం వెతికే ఆలోచన కూడా రావొచ్చు. మోనా చిత్రం జియోహాట్‍స్టార్ ఓటీటీలో ఉంది.

ది లయన్ కింగ్

ది లయన్ కింగ్.. యానిమేటెడ్ చిత్రం 1994లో వచ్చింది. భయాన్ని, బిడియాన్ని వదిలి సింబా.. రాజులా ఎలా ఎదిగాడన్న కథతో ఈ మూవీ ఉంటుంది. ఈ పాపులర్ చిత్రం పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఎదిగే క్రమంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని ఈ సినిమా చెబుతుంది. ఈ మూవీ జియోహాట్‍స్టార్ ఓటీటీలో ఇంగ్లిష్, తెలుగు, తమిళం, హిందీలో ఉంది. లయన్ కింగ్, ముఫాసా అంటూ ఫీచర్ చిత్రాలు కూడా వచ్చాయి. అయితే, పాత యానిమేటెడ్ చిత్రాన్ని ఇప్పటికీ చాలా మంది ఇష్టపడతారు.

బ్రేవ్

బ్రేవ్ (2021) చిత్రంలో తన పరిమితులను దాటి మెరిడా చేసే పోరాటం ఇన్‍స్పైర్ చేస్తుంది. ఈ మూవీ ఆసక్తికరంగా ఉండటంతో పాటు అంతర్గతంగా ఉన్న శక్తిని ఎలా గుర్తించాలనే విషయాన్ని తెలియజేస్తుంది. బ్రేవ్ చిత్రం జియోహాట్‍స్టార్ ఓటీటీలో ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

టాంగిల్డ్

ప్రపంచాన్ని ఏ దృక్పథంతో చూస్తే బాగుంటుందో టాంగిల్డ్ (Tangled) చిత్రం చెబుతుంది. ప్రతీ ఒక్కరిలోనూ హిడెన్ టాలెంట్, అంతర్గత శక్తి ఉంటుందని రపుంజెల్ పాత్ర చెబుతుంది. టాంగిల్డ్ మూవీ కూాడా జియోహాట్‍స్టార్ ఓటీటీలో ఇంగ్లిష్, హిందీలో ఉంది.

రటాటూయీ

ఎలుకగా తనకు చాలా పరిమితులు ఉన్నా కలలను సాకారం చేసుకునేందుకు రెమీ ప్రయత్నిస్తుంది. ఈ అంశంతోనే ‘రటాటూయీ’ (Ratatouille) చిత్రం రూపొందింది. ఎన్ని కష్టాలు వచ్చినా తమపై తాము నమ్మకం కోల్పోకూడదని పిల్లలకు ఈ చిత్రం చెబుతుంది. ఈ సినిమా జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

కోకో

సవాళ్లు ఎదురైనా తనకు ఇష్టమైన మ్యూజిక్‍ను మిగెయెల్ అలాగే కొనసాగించడం చుట్టూ కోకో (2017) చిత్రం ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకోవడం, ప్రత్యేకతను చాటుకోవడం ముఖ్యమని ఈ మూవీ తెలియజేస్తుంది. కోకో చిత్రం కూడా జియోహాట్‍స్టార్ ఓటీటీలో ఇంగ్లిష్, హిందీలో స్ట్రీమ్ అవుతోంది.

ది ఇంక్రెడిబుల్స్

మనకు ఉండే శక్తిని మంచి కోసం ఉపయోగించాలని ది ఇంక్రెడిబుల్స్ (2004) చిత్రం చెబుతుంది. ఐకమత్యం ముఖ్యమనేది కూడా వివరిస్తుంది. ఈ మూవీని జియోహాట్‍స్టార్ ఓటీటీలో ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళంలో చూడొచ్చు.

ఎన్‍కాంటో

పిల్లలు ఎంత విలువైన, ప్రత్యేకమైన వారో.. ఎన్‍కాంటో (2021) సినిమా చెబుతుంది. చిన్నారుల్లో ఈ చిత్రం ఆత్మ విశ్వాసాన్ని పెంచగలదు. ఈ మూవీ జియోహాట్‍స్టార్ ఓటీటీలో ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024