




Best Web Hosting Provider In India 2024

భర్తతో రోజూ ఈ 5 మాటలు చెప్పారంటే జీవితాంతం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాడు!
ప్రేమను చాటుకోవడానికి పెద్ద పెద్ద చర్యలు అవసరం అని మనం ఎక్కువగా అనుకుంటాము. కానీ నిజం ఏమిటంటే, మనస్ఫూర్తిగా చెప్పే కొన్ని మాటలే భాగస్వామి హృదయాన్ని తాకుతాయి మరియు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.
పెళ్లి అంటే ఒక బ్యూటిఫుల్ బాండ్. ఈ బంధంలో ఇద్దరు మనుషులే కాదు, రెండు మనపులు, రెండు డిఫరెంట్ థింకింగ్స్, రెండు లైఫ్ స్టైల్స్ కలిసిపోతాయి. ఏడు జన్మల బంధం అనేది జస్ట్ చిన్న మాట మాత్రమే కాదు.. రోజూ మనం చేసే చిన్న చిన్న ప్రామిస్‌లు, మన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవడం వల్లే ఈ బంధం స్ట్రాంగ్ అవుతుంది. భార్యాభర్తల మధ్య లవ్ అనేది చేతల్లో మాత్రమే కాకుండా మాటల్లో కూడా కనిపిస్తేనే ఆ బాండింగ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది.
భార్య అయినా భర్త అయినా భాగస్వామి పట్ల తమకున్న ప్రేమ చూపించడానికి పెద్ద పెద్ద పనులేం చేయక్కర్లేదు, కొన్ని సింపుల్ అండ్ జెన్యూన్ వర్డ్స్ చెబుతుంటే చాలు. గుండెని టచ్ చేయడానికి ప్రేమతో కూడిన మాటలు చాలు. ముఖ్యంగా భర్త ప్రేమను పొందడానికి భార్య అతనితో చెప్పే కొన్ని ‘మ్యాజిక్’ వర్డ్స్ ఉన్నాయి చూడు, అవి రిలేషన్‌షిప్‌లో స్వీట్‌నెస్‌ని పెంచడమే కాదు, ఆ లవ్ లైఫ్‌లాంగ్ గుర్తుండిపోయేలా చేస్తాయి. మీ హబ్బీ హార్ట్‌ని టచ్ చేసి, మీ రిలేషన్‌షిప్‌ని ఎప్పటికీ స్పెషల్‌గా ఉంచే ఆ కొన్ని మాటలేంటో తెలుసుకోవాలని ఉందా. అయితే రండి..
1. ఐ లవ్ యూ సో మచ్! (నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా)
ప్రేమించడం అందరూ చేస్తారు కానీ దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోతారు. మన ఫీలింగ్స్ వాళ్లకి ఆటోమేటిక్‌గా అర్థమవుతాయని మనం అనుకుంటారు. కానీ చాలాసార్లు లవ్‌ని కాపాడుకోవడం కోసం దాన్ని బయటికి చెప్పడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ హబ్బీతో మీ లవ్‌ని ఎప్పటికప్పుడు చెప్పేస్తూ ఉండండి. మీరు మీ హబ్బీతో “ఐ లవ్ యూ సో మచ్!” అని చెప్పినప్పుడు, వాళ్లకి మంచి ఫీలింగ్ రావడమే కాదు, ఈ రిలేషన్‌షిప్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అని వాళ్లు ఫీల్ అవుతారు.
2. “నీ ఆలోచనను నేను అప్రిషియేట్ చేస్తాను!” (నువ్వు చెప్పే ప్రతి మాట నాకు ఇష్టం)
ఎవరికైనా వాళ్ల ఎఫర్ట్స్‌ని ఎవరైనా మెచ్చుకుంటే తెగ హ్యాపీగా ఉంటుంది. వాళ్ల మాటలు, వాళ్ల ఐడియాలు, వాళ్లు తీసుకునే డిసిషన్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటారు. ముఖ్యంగా భార్య తన భర్త థాట్స్‌ని, వాళ్లు చేసే పనులను అప్రిషియేట్ చేసినప్పుడు, వాళ్లకి వాళ్ల వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఇది చిన్న విషయమే కానీ హార్ట్‌ని టచ్ చేస్తుంది, రిలేషన్‌షిప్‌ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది.
3. ఐ ట్రస్ట్ యూ ఫుల్లీ! (నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నా)
భార్యభర్తలు ఒకరినొకరు నమ్మడం అనేది వాళ్ల రిలేషన్‌షిప్ బేస్‌ని స్ట్రాంగ్ చేస్తుంది. మీరు మీ హబ్బీతో నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నా అని చెప్పినప్పుడు, అతను మీ పట్ల మరింత బాధ్యతాయుతంగా, కేరింగ్‌గా ఉంటాడు. ఈ నమ్మకం వాళ్లకి ఒక కంఫర్ట్ జోన్ ఇస్తుంది, ఏ సిట్యువేషన్‌లో అయినా మీరు వాళ్ల పక్కనే ఉంటారని వాళ్లు ఫీల్ అవుతారు.
4. “నా మిస్టేక్స్‌కి సారీ!” (నా తప్పు ఉంటే క్షమించు)
ఏ రిలేషన్‌షిప్‌లో అయినా ఉండే బ్యూటీ ఏంటంటే, సారీ చెప్పడం, సారీ అడగడం. మీరు మీ చిన్న చిన్న మిస్టేక్స్‌కి కూడా ఈజీగా సారీ అడిగినప్పుడు, ‘నేను’ కంటే ‘మేము’ అనేదే మీకు ఇంపార్టెంట్ అని వారికి అర్థమవుతుంది. ఈ ఒక్క వర్డ్‌తో చాలా గొడవలు తగ్గిపోతాయి, మనసుల మధ్య, మనుషుల మధ్య దూరం తగ్గుతుంది. భార్య భర్తల మధ్య రిలేషన్‌లో ఈగోకి ప్లేస్ ఉండకూడదు అంతే!
5. “నేను ఎప్పుడూ నీ వెంటే ఉంటాను!”
లైఫ్ పార్టనర్ అంటేనే సంతోషంలోనూ, బాధలోనూ ఒకరికొకరు సపోర్ట్‌గా ఉండటం. వైఫ్ తన హబ్బీతో ఏ సిట్యువేషన్‌లో అయినా తాను అతనితోనే ఉంటానని చెప్పినప్పుడు, అది అతని కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేస్తుంది. లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ మీరు ఏ టైమ్‌లో అయినా భర్తకు తోడుగా ఉంటానని నమ్మకం ఇచ్చినప్పుడు, అతను తనంత అదృష్టవంతుడు ఇంకెవరూ లేరని ఫీల్ అవుతాడు. మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటాడు.
సంబంధిత కథనం
టాపిక్