Thudarum: ఈ మలయాళం సినిమా టైటిల్‌కు అర్థమేంటో చెప్పగలరా.. తెలుగు ప్రేక్షకులంటే అంత లోకువా?

Best Web Hosting Provider In India 2024

Thudarum: ఈ మలయాళం సినిమా టైటిల్‌కు అర్థమేంటో చెప్పగలరా.. తెలుగు ప్రేక్షకులంటే అంత లోకువా?

Hari Prasad S HT Telugu

Thudarum: మలయాళం, తమిళం, కన్నడ ఇండస్ట్రీల సినిమాలు తెలుగులో రిలీజ్ కావడం కామనే. కానీ తెలుగులోనూ అవే టైటిల్స్ తో రిలీజ్ అవుతుండటంతో ఇక్కడి ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ మలయాళం సినిమా టైటిల్ కు అసలు అర్థమేంటో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ఈ మలయాళం సినిమా టైటిల్‌కు అర్థమేంటో చెప్పగలరా.. తెలుగు ప్రేక్షకులంటే అంత లోకువా?

Thudarum: మలయాళం సినిమాలను ఆదరించే వాళ్లలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందే ఉంటారు. ఆ ఇండస్ట్రీ కంటెంట్ ను ఓటీటీలో తెగ చూస్తారు. అయితే ఇదే అలుసుగా తీసుకొని అక్కడి మేకర్స్ తమ సినిమాలను ఇష్టం వచ్చినట్లుగా డబ్ చేసి వదులుతున్నారు. అలా తాజాగా వస్తున్న మరో మూవీ తుడరుమ్ (Thudarum). అసలు ఈ పదమే ఎప్పుడూ వినని తెలుగు ప్రేక్షకులు అర్థమేంటో తెలియక బిక్కమొహాలు వేస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులంటే లోకువా?

మలయాళం సినిమాలను ఆదరిస్తున్నారు కదా అని అక్కడి మూవీస్ అన్నింటినీ డబ్ చేసి వదలడం వరకూ బాగానే ఉంది. కానీ అలా తీసుకొచ్చే సమయంలో కనీసం టైటిల్ అయినా ఇక్కడి ప్రేక్షకులకు అర్థమయ్యేలా పెడితే బాగుంటుంది. ఈ విషయంలో అక్కడి మేకర్స్ కు, ఇక్కడి డబ్బింగ్ హక్కులు పొందిన వారికి అసలు పట్టింపే లేనట్లుగా కనిపిస్తోంది. దీనికి తాజా ఉదాహరణ మోహన్ లాల్ నటించిన తుడరుమ్ మూవీయే.

శోభన కూడా నటించిన ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగులోనూ వస్తోంది. కానీ అక్కడి టైటిల్ నే ఇక్కడా పెట్టారు. అసలు దీనికి అర్థమేంటో ఎలా తెలియాలి? తెలుగు ప్రేక్షకులు అంటే అంత లోకువా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మలయాళంలో తుడరుమ్ అంటూ కొనసాగుతుంది అని అర్థం. అందుకు తగినట్లుగా తెలుగులో టైటిల్ మార్చి పెడితే ఇక్కడి ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది. కానీ టైటిల్ మార్చడం కాదు కదా.. మరీ నాసిరకం డబ్బింగ్ తోనే ప్రేక్షకులపైకి వదులుతున్నారు.

ఇదేమీ కొత్త కాదు

తెలుగు ప్రేక్షకులపైకి ఇలాంటి అర్థం కాని టైటిల్స్ తో గతంలోనూ ఎన్నో తమిళ, మలయాళం సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. తాజాగా నస్లేన్ నటించిన అలప్పుజ జింఖానా అదే టైటిల్ తో వస్తోంది. ఇక తమిళ సినిమాలు రాయన్, వేట్టయన్, పొన్నియిన్ సెల్వన్, రెట్రోలాంటివి కూడా టైటిల్ మార్చకుండానే వచ్చాయి. మలయాళం నుంచి ఎల్2: ఎంపురాన్ కూడా మరో ఉదాహరణే. ఇలాగే వర్షంగల్కు శేషమ్, గురువాయూర్ అంబలనడయిల్, గోలంలాంటి సినిమాలు కూడా అలాగే వచ్చాయి.

ఇప్పుడు మోహన్ లాల్ తుడరుమ్ కూడా అంతే. టైటిల్ కు అర్థమేంటో తెలియకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు ఎలా చూస్తారో మేకర్స్ కే తెలియాలి. అంతేకాదు తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమాలు తెచ్చే సమయంలో తెలుగు టైటిల్సే పెట్టాలన్న నిబంధనను కూడా తీసుకురావాలన్న డిమాండ్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024