





Best Web Hosting Provider In India 2024

Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్‌లో రెండు తెలుగు సినిమాలు.. రెండో స్థానంలో రీసెంట్ బ్లాక్‌బస్టర్
Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్ లో గడిచిన వారం రోజులుగా టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం. ఈ జాబితాలో రెండు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. అందులో కోర్ట్ మూవీ రెండో స్థానంలో కొనసాగుతోంది.
Netflix Top Trending: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. వీటిలో టాప్ 10 ట్రెండింగ్ జాబితా కూడా మారిపోతూనే ఉంటుంది. ఇక ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 22 వరకు గడిచిన వారం రోజుల్లో టాప్ ట్రెండింగ్ సినిమాల జాబితాలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్
నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో తొలి స్థానంలో హిందీ బ్లాక్‌బస్టర్ ఛావా ఉంది. బాక్సాఫీస్ దగ్గర కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ మూవీ.. ఓటీటీలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా టాప్ లోనే కొనసాగుతోంది. ఇక తర్వాతి స్థానంలో తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ మూవీ ఉంది.
ఈ సినిమా కూడా అటు థియేటర్లలో దుమ్ము రేపిన తర్వాత ఓటీటీలోనూ చెలరేగుతోంది. ఇండియాలో రెండో స్థానంలో ఉన్న ఈ మూవీ.. గ్లోబల్ గా నాన ఇంగ్లిష్ కేటగిరీ సినిమాల్లో ఐదో స్థానంలో ఉండటం విశేషం. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తున్నారో చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇక మూడు, నాలుగు స్థానాల్లో టెస్ట్, ఛావా సినిమాలు ఉన్నాయి.
టాప్ 10లో మ్యాడ్ కూడా..
ఇక నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో మ్యాడ్ మూవీ కూడా ఉంది. ఈ సినిమా సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తొలి పార్ట్ ఇలా టాప్ 10 ట్రెండింగ్ లో ఉండటం విశేషం. ఈ మూవీ 9వ స్థానంలో కొనసాగుతోంది. ఐదు వారాలుగా ఈ సినిమా టాప్ 10లోనే ఉంది.
ఇక తమిళ సినిమాలు టెస్ట్, డ్రాగన్, పెరుసు మూవీస్ వరుసగా 3, 5, 7 స్థానాల్లో ఉన్నాయి. మలయాళ బ్లాక్‌బస్టర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఆరోస్థానంలో కొనసాగుతోంది. ఈ మూవీ నాలుగు వారాలుగా టాప్ 10లో ఉంది.
కోర్ట్ మూవీ గురించి..
కోర్ట్ ఓ చిన్న సినిమాగా రిలీజై సంచలనం సృష్టించింది. నాని నిర్మించిన ఈ మూవీ.. ఓ ప్రేమ జంట చుట్టూ తిరుగుతుంది. మైనర్లపై అత్యాచారాలను తీవ్ర నేరాలుగా పరిగణిస్తూ కఠినంగా రూపొందించిన పోక్సో చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు.
ఇందులో ప్రియదర్శి, శివాజీతోపాటు రోషన్, శ్రీదేవిలాంటి వాళ్లు నటించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టింది. ఓటీటీలోనూ సత్తా చాటుతోంది.
సంబంధిత కథనం