




Best Web Hosting Provider In India 2024

Malayalam Movie: ఓటీటీలోకి ఏడాది తర్వాత తెలుగులో వస్తున్న మలయాళం మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్
Malayalam Movie: ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్ ఉన్న ఓ మలయాళం మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు వస్తోంది. గతేడాది మార్చిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు తెలుగులో వస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా ప్రైమ్ వీడియోలో మలయాళంలో ఉంది.
Malayalam Movie: మనసుకు హత్తుకునే ఓ మలయాళం మూవీ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. తమ పిల్లలు తమను కాదనుకోవడంతో వృద్ధాశ్రమంలోని ఓ వృద్ధ జంట ఆ వయసులో ఒకరి కోసం మరొకరు కలిసి ఉండాలని తీసుకునే నిర్ణయం వాళ్ల జీవితాలను ఎలా మార్చేస్తుందనే కథ ఆధారంగా రూపొందిన మూవీ ఇది. ఈ సినిమా పేరు ప్రణయం 1947. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్ ఈ మూవీ సొంతం.
ప్రణయం 1947 ఓటీటీ రిలీజ్ డేట్
మలయాళంలో గతేడాది మార్చిలో జననం: 1947 ప్రణయం తుదరున్ను పేరుతో ఓ మూవీ రిలీజైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరళలోని వృద్ధులు వయసు మీద పడిన సమయంలో ఎదుర్కొనే సవాళ్లు, కష్టాలను ఇద్దరు వృద్ధుల జీవితాల ఆధారంగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.
ఇప్పుడీ సినిమాను ప్రణయం 1947 పేరుతో ఆహా వీడియో ఓటీటీ తెలుగులోకి తీసుకొస్తోంది. ఈ సినిమా బుధవారం (ఏప్రిల్ 23) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించింది. నిజానికి ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మలయాళంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆహా వీడియో ఓటీటీ ద్వారా తెలుగులోకి వస్తోంది.
ప్రణయం 1947 మూవీ గురించి..
మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో డ్రామా జననం: 1947 ప్రణయం తుదరున్ను. గతేడాది మార్చి 20న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల ఆదరణ సంపాదించిన ఈ మూవీ.. ఐఎండీబీలో ఏకంగా 8.1 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా గౌరి అనే ఓ ఒంటరి వృద్ధ మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె ఓ ఓల్డేజ్ హోమ్ లో కాలం గడుపుతుంటుంది.
ఆ సమయంలో తన కేర్ టేకర్ గా ఉన్న శివన్ తో కలిసి జీవించాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత వాళ్లిద్దరి జీవితాలు ప్రేమతో నిండిపోతాయి. ఈ వృద్ధులు తమ శేష జీవితాన్ని ఎలా గడిపారన్నదే ఈ మూవీ స్టోరీ. బుధవారం (ఏప్రిల్ 23) నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ ప్రణయం 1947 సినిమాను తెలుగులో చూసి ఎంజాయ్ చేయండి.
సంబంధిత కథనం