పేదవాడిలా బతికిన ఆసుపత్రి స్వీపర్.. ఇంట్లో నోట్ల కట్టలు, కోటికిపైగా ఆస్తి.. కానీ లేని వారసులు!

Best Web Hosting Provider In India 2024


పేదవాడిలా బతికిన ఆసుపత్రి స్వీపర్.. ఇంట్లో నోట్ల కట్టలు, కోటికిపైగా ఆస్తి.. కానీ లేని వారసులు!

Anand Sai HT Telugu

ఒడిశా మల్కన్‌గిరికి చెందిన దంబారు గరడ అనే ఆసుపత్రి స్వీపర్ మరణించారు. అయితే ఆయనకు కోటికి పైగా ఆస్తి ఉంది. చాలా పొదుపుగా జీవించేవారు. ఆ వ్యక్తికి చట్టబద్ధమైన వారసులు లేరు.

ప్రతీకాత్మక చిత్రం

మల్కన్‌గిరి జిల్లాలో దీర్ఘకాలంగా ఆసుపత్రి ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి అనుకోకుండా చనిపోయారు. ఆయనకు చాలా సంపాద ఉంది. కానీ ఆయన బతికిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దంబారు గరడ అనే ఈ వ్యక్తి పేదరికం అంచున నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు. కానీ ఆయన నివాసంలో భారీ నగదు దొరికింది.

33 సంవత్సరాలుగా దంబారు ప్రభుత్వం అందించిన ఇంట్లోనే నివసించాడు. పదవీ విరమణకు ఒక నెల ముందు గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు. నెలకు దాదాపు రూ. 50,000 జీతం తీసుకునేవాడు. విద్యుత్, వంట సౌకర్యాలు వంటి ముఖ్యమైన అవసరాలను కూడా పట్టించుకోలేదు. ఆయన జీవనశైలి చాలా కఠినంగా ఉండేది. విద్యుత్ సేవలు ఉన్నప్పటికీ.. లైటింగ్ కోసం కొవ్వొత్తులను ఉపయోగించేవారని పొరుగువారు గుర్తుచేసుకున్నారు.

ఇంటి వాతావరణం దారుణంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. దంబారు ఇంట్లో చాలా అరుదుగా వండుకునేవాడు, బయట లభించే భోజనాన్ని ఎంచుకునేవాడు. అతని మరణం తర్వాత క్వార్టర్‌లోని వివిధ భాగాలలో దాచిపెట్టిన అనేక నగదు సంచులను పోలీసులు కనుగొన్నారు. వాటిలో రూ.50, రూ.100, ఇతర నోట్లు చక్కగా పేర్చి ఉన్నాయి.

దంబారు బ్యాంకు బ్యాలెన్స్‌లు, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) పొదుపులను కలిపితే ఆస్తులు కోటి దాటవచ్చు. ఆర్థిక స్తోమత ఉన్నప్పటికీ అతడు కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టలేదు. పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టలేదు. అయితే అంత సంపాదించినా.. ఆ డబ్బును ఖర్చు చేయలేదని స్థానికులు అంటున్నారు. చాలా నిరాడంబరంగా బతికేవారని చెబుతున్నారు. ఆయనకు వారసులు కూడా ఎవరూ లేరు.

‘సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి డబ్బు సంపాదిస్తారు. కానీ ఆయన జీవితకాలంలో మంచి బట్టలు ధరించలేదు. గొప్ప ఆహారం తినలేదు. ఆయన జీవితాంతం ఇంట్లో టవల్ ధరించి గడిపారు. విద్యుత్తును ఉపయోగించలేదు, 1992 నుండి రాత్రిపూట కొవ్వొత్తులను వెలిగించేవాడు. చాలా పొదుపుగా జీవితాన్ని గడిపాడు.’ అని స్థానికులు చెప్పారు.

Anand Sai

eMail
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link