





Best Web Hosting Provider In India 2024

OTT Horror: మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన సూపర్‌హిట్ తెలుగు హారర్ మూవీ – వణికించే ట్విస్ట్‌లతో…
OTT Horror: టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ మూవీ మసూద థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చింది. ఆమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. మసూద సినిమాలో తిరువీర్, సంగీత, కావ్య కళ్యాణ్‌రామ్ కీలక పాత్రలు పోషించారు. అమెజాన్‌ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది.
తెలుగు హారర్ మూవీ మసూద ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది. ఆడియెన్స్‌ను భయపెట్టిన ఈ హారర్ మూవీ థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చింది. మంగళవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. మసూద స్ట్రీమింగ్ వివరాలను అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఆహా ఓటీటీలో మసూద అందుబాటులో ఉంది
రెగ్యులర్ హారర్ మూవీస్‌కు భిన్నంగా…
మసూద మూవీలో తిరువీర్, సంగీత, బాంధవి శేఖర్, కావ్య కళ్యాణ్‌రామ్ కీలక పాత్రలు పోషించారు. సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. రెగ్యులర్ హారర్ మూవీస్‌కు భిన్నమైన నేపథ్యాన్ని ఎంచుకొని దర్శకుడు మసూద మూవీని తెరకెక్కించాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు హారర్, ఎలిమెంట్స్, ట్విస్ట్‌లు ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్‌ను పంచాయి.
మసూద ఎవరు?
నీలం భర్తకు దూరంగా తన కూతురు నాజియాతో (భాంధవి శేఖర్) కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే గోపీ (తిరువీర్) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మినీ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ తన ప్రేమను మినీకి చెప్పడానికి భయపడుతుంటాడు. నీలమ్ కూతురు నాజియాకు దయ్యం పట్టడంతో వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది.
ఆ దయ్యం బారి నుంచి తన కూతురిని రక్షించుకోవడానికి గోపి సహాయం కోరుతుంది నీలమ్. అతి భయస్తుడైన గోపీ ఆ దెయ్యం నుంచి నాజియాకు విముక్తిని కల్పించాడా? నాజియాను ఆవహించిన మసూద ఎవరు? ఆమె ఎలా చనిపోయింది? మసూద బారి నుంచి నాజియాను పీర్‌బాబా ఎలా కాపాడాడు? అన్నదే ఈ మూవీ కథ.
13 కోట్ల కలెక్షన్స్…
మసూద మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 13 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందించాడు.
మొదటి సినిమా….
హీరోగా తిరువీర్‌కు మసూద మొదటి సినిమా. తొలి మూవీతోనే పెద్ద హిట్ అందుకున్నాడు. బొమ్మలరామారాం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు తిరువీర్. ఘాజీ, జార్జ్‌రెడ్డి, మల్లేషం, పలాస 1978 సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. పరేషాన్, మోక్షపఠంతో మరికొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షో, భగవంతుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.