సీయూఈటీ పీజీ ఆన్సర్ కీ విడుదల.. ఇదిగో డైరెక్ట్ లింక్ ఇక్కడ ఓపెన్ చేయండి

Best Web Hosting Provider In India 2024


సీయూఈటీ పీజీ ఆన్సర్ కీ విడుదల.. ఇదిగో డైరెక్ట్ లింక్ ఇక్కడ ఓపెన్ చేయండి

Anand Sai HT Telugu

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్(సీయూఈటీ పీజీ) 2025 ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో దీనిని చూడవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సీయూఈటీ పీజీ 2025 ఆన్సర్ కీని 2025 ఏప్రిల్ 22న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు exams.nta.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా చెక్ చేయవచ్చు. పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీతో అభ్యంతర విండోను కూడా తెరిచారు. 22 ఏప్రిల్ 2025 నుంచి 24 ఏప్రిల్ 2025 వరకు (రాత్రి 11 గంటల వరకు) అభ్యర్థులకు అభ్యంతరాల విండోను ఎన్టీఏ తెరిచి ఉంచుతుంది.

ఆన్సర్ కీలో ఇచ్చిన ప్రశ్నకు సమాధానం తప్పుగా ఉందని అభ్యర్థులు భావిస్తే అభ్యంతర విండోలోకి వెళ్లి తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ప్రతి ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లేవనెత్తిన అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. సబ్జెక్టు నిపుణుడి అభిప్రాయం మేరకు తుది ఆన్సర్ కీని రూపొందించి దాని ఆధారంగా ఫలితాలను రూపొందిస్తారు.

సీయూఈటీ పీజీ పరీక్షను 2025 మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎన్టీఏ నిర్వహించింది. పరీక్షను మూడు షిఫ్టుల్లో నిర్వహించారు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి 157 సబ్జెక్టుల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 4,12,024 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు.

ఆన్సర్ కీ ఎలా చెక్ చేయాలి?

ముందుగా exams.nta.ac.in/CUET-PG/ అధికారిక వెబ్‌సైట్ వెళ్లాలి.

ఇప్పుడు హోమ్ పేజీలో ఇచ్చిన సీయూఈటీ పీజీ ఎగ్జామ్ ఆన్సర్ కీ 2025 లింక్ మీద క్లిక్ చేయాలి.

ఆ తర్వాత లాగిన్ అవ్వాలి. తర్వాత సబ్‌మిట్ క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీ ముందు కొత్త విండో ఓపెన్ అవుతుంది. మీ స్క్రీన్‌పై ఆన్సర్ కీ కనిపిస్తుంది.

ఇప్పుడు సమాధానం పీడీఎఫ్‌ను చెక్ చేయండి. దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Anand Sai

eMail

Best Web Hosting Provider In India 2024


Source link