Karthika Deepam Today Episode April 23: రగిలిన శివన్నారాయణ.. కోర్టులో జ్యోత్స్న అబద్ధం.. దీపపై లాయర్ ఆరోపణలు

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam Today Episode April 23: రగిలిన శివన్నారాయణ.. కోర్టులో జ్యోత్స్న అబద్ధం.. దీపపై లాయర్ ఆరోపణలు

Karthika Deepam Today Episode April 23: కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 23) ఎపిసోడ్‍లో కోర్టు ఆవరణలో దీప, కార్తీక్‍ను చాలా మాటలు అంటారు శివన్నారాయణ, సుమిత్ర. జ్యోను కార్తీక్ నిలదీస్తాడు. కోర్టులో దీపను ఇబ్బంది పెట్టేలా ఆరోపణలు చేస్తాడు లాయర్. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam Today Episode April 23: రగిలిన శివన్నారాయణ.. కోర్టులో జ్యోత్స్న అబద్ధం.. దీపపై లాయర్ ఆరోపణలు

కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 23, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీపను కోర్టు దగ్గరికి తీసుకొస్తారు పోలీసులు. అక్కడే ఉన్న కార్తీక్, కావేరి దగ్గరికి దీప వెళుతుంది. దీప ఇదంతా నా వల్లే.. నేను చూసింది నీకు చెప్పకుండా ఉండాల్సిందని కావేరి అంటుంది. దీంట్లో ఎవరి తప్పు లేదు.. ఇదంతా నా తలరాత అని దీప చెబుతుంది. ఎవరో రాసిన రాతలను నీ తలరాత అనుకోవద్దు.. వాటిని నేను మారుస్తా అని దీపతో కార్తీక్ అంటాడు.

పరువు తీసే వాళ్లు.. ప్రాణాలు తీసే వాళ్లు..

శౌర్య అని దీప అడిగితే ఇంటి దగ్గరే ఉండాలన్నానని చెబుతాడు. అమ్మ, అనసూయను కూడా రావొద్దన్నానని, నిన్ను ఇలా చూడడం ఎవరికి ఆనందంగా ఉండదని అంటాడు. ఇంతలో కోర్టు దగ్గరికి శివన్నారాయణ, సుమిత్ర, పారిజాతం వస్తారు. దీప, కార్తీక్‍ను కోపంగా చూస్తారు. ఇప్పుడు అన్నయ్యకు ఎలా ఉందని వదినా అని సుమిత్రను కావేరి అడుగుతుంది. ఎలా ఉందో నీ పక్కన ఉన్న మనిషిని అడగాల్సింది అని దీపను ఉద్దేశించి పారిజాతం అంటుంది. పరువులు తీసే వాళ్లు.. ప్రాణాలు తీసే వాళ్లు ఏకమయ్యారు అంటూ కావేరి, దీపను ఉద్దేశించి అంటాడు శివన్నారాయణ. వాళ్లతో మనకు మాటలు ఏంటి అని చిరాకు పడతాడు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో.. ఎలా చెప్పాలి అని చెబుతాడు.

జ్యోత్స్నే కారణం.. శివన్నారాయణ ఆగ్రహం

మాటలు అనడం చాలా సులభం, వెనక్కి తీసుకోవడం చాలా కష్టం అని కార్తీక్ అంటాడు. చంపడం చాలా తేలిక, బతికించడం చాలా కష్టమని కౌంటర్ వేస్తాడు శివన్నారాయణ. జ్యోత్స్న ఈ పరిస్థితికి రావడానికి కారణం జ్యోత్స్న.. పెద్దనాన్న అని కావేరి అంటుంది. పెదనాన్న, చిన్నాన్న అంటూ వరసలు పెట్టి పిలవకు అంటూ ఆగ్రహిస్తాడు శివన్నారాయణ. మీకు సిగ్గూశరం లేవు కాబట్టే సవతి కూతురిని కాంచన కూతురు అనుకుంది, నువ్వు సవతి కొడుకును కొడుకు అనుకుంటున్నావంటూ ఫైర్ అవుతాడు.

గంగలో కలవడం మేలు

ఏ రోజైనా అందరం కలవాల్సిన వాళ్లమే కదా అని కావేరి అంటుంది. మీతో కలవడం కంటే.. గంగలో కలిస్తే పుణ్యమైనా వస్తుందని శివన్నారాయణ అంటాడు. ఈ మనిషితో ఇక మాట్లాడకు చిన్నమ్మా అని కార్తీక్ అంటాడు. ఇప్పుడు నీకు పరాయి వాళ్లు బంధువులు అయ్యారు.. బంధువులు పరాయి వాళ్లు అయ్యారు అంటూ విరుసుగా మాట్లాడుతుంది పారిజాతం. పారు అని కార్తీక్ అరుస్తాడు. అత్తయ్య అన్న మాటల్లో తప్పు ఏముందని సుమిత్ర అంటుంది. నిజాలు మాట్లాడితే నీకు, నీ భార్యకు నచ్చదా అని చెబుతుంది.

కార్తీక్ బాబును ఏమీ అనొద్దమ్మా అని సుమిత్రను దీప అడుగుతుంది. నిన్ను ఏమైనా అనాలంటే ముఖం చూడాలి.. నీ ముఖం చూస్తే ఆసుపత్రిలో ఉన్న భార్త గుర్తొస్తున్నాడని సుమిత్ర అంటుంది. పసుపు కుంకాలకు ఇంకా రుణపడి ఉన్నా కాబట్టే నా ఐదోతనం ప్రాణాలతో ఉంది, లేకపోతే నువ్వు చేసిన పనికి నా భర్త ప్రాణాలు పోయేవి అని కోపంగా అంటుంది సుమిత్ర. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు అర్థం కాదమ్మా అని దీప బాధగా అంటుంది.

శిక్ష అనుభవించాల్సిందే

వేరేవాళ్తేతే కొట్టేవాళ్లరని పారిజాతం అంటుంది. మీ కోపం పోతుందంటే కొట్టండి.. కానీ నా భార్యను కాదు.. నన్ను కొట్టండి అని కార్తీక్ అంటాడు. మీరు కొడితే చావు దెబ్బలు తగులుతాయని, మాకు అలా రాదు అని సుమిత్ర అంటుంది. దీప దురుద్దేశం ఆ దేవుడికి తెలుసు కదా.. చేసిన పాపానికి ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని సుమిత్ర అంటుంది. మీ తొట్టిగ్యాంగ్ ఏదీ అంటూ కాంచన, అనూసయ సహా అందరి గురించి పారిజాతం అడుగుతుంది. నిజాలు, నిజాయితీ ఒంటరిగా నిలబడి పోరాడి గెలుస్తాయని కార్తీక్ అంటాడు. చూద్దాం.. ఎలా గెలుస్తారో అని శివన్నారాయణ అంటాడు.

పగబడితే ఎలా ఉంటుందో చూపిస్తా.. రగిపోయిన శివన్నారాయణ

శివన్నారాయణ కోపంతో రగిలిపోతాడు. నేను పగబడితే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ కోపంగా మాట్లాడతాడు. “ఒక్క మాట మాత్రం రాసిపెట్టుకో.. ఇక నీ భార్య బయటికి రాదు. రేయ్ నువ్వు నా కోపాన్ని, నా ఆవేశాన్ని, నా పంతాన్ని, నా పట్టుదలనే చేశావ్. అంతే కానీ నా పగను చూసి ఉండవు. నేను పగబడితే ఎలా ఉంటుందో చూపిస్తా” అని ఆగ్రహంగా అంటాడు శివన్నారాయణ. దీని బతుకు ఊచలు లెక్కపెట్టుకోవడమే అని పారిజాతం అంటుంది. నువ్వు నమ్మకంగా ఉండు.. కోర్టులో జరిగింది ధైర్యంగా చెప్పు అని దీపతో కార్తీక్ అంటాడు.

జ్యోత్స్నను నిలదీసిన కార్తీక్

ఇంతలో కోర్టు దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. దీప పోలీస్ స్టేషన్‍లో ఉందని చెప్పి.. అక్కడికి శౌర్యను ఎందుకు తీసుకొచ్చావని కార్తీక్ నిలదీస్తాడు. ఇంక మారవా అంటూ ఆగ్రహిస్తాడు. నీకు మంచే చేశానని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది జ్యోత్స్న. శౌర్య రోడ్లు పట్టుకొని తిరుగుతుంటే.. అలాగే వదిలేయకుండా దీప గురించి చెప్పానని జ్యో అంటుంది. మనం మాట్లాడుకున్న మాటలను శౌర్య వినిందని చెబుతుంది. లాయర్ కల్యాణ్ చక్రవర్తే కాపాడాలని కార్తీక్ అనుకుంటాడు.

కోర్టులో మొదలైన వాదనలు.. అది అటెంప్ట్ టు మర్డర్

దీప తరఫున కోర్టులో వాదనలు మొదలుపెడతాడు లాయర్ కల్యాణ్ ప్రసాద్. శివన్నారాయణ అబ్బాయి దశరథ్‍ను గన్‍తో షూట్ చేసిందనే అభియోగంతో నా క్లైంట్ దీపను అరెస్ట్ చేశారని జడ్జికి వివరిస్తాడు. అది అభియోగం కాదు.. అందరి కళ్లు ముందే అటెంప్ట్ టు మర్డర్ అని శివన్నారాయణ తరఫున వాదిస్తున్న లాయర్ భగవాన్ దాస్ అంటాడు. అప్పుడే ఎందుకింత ఆవేశం అని కల్యాణ్ చెబుతాడు. బోనులో బాధ పడుతూ ఉంటుంది దీప.

భార్యకు కాపాడిన వ్యక్తి భర్త ప్రాణం తీస్తుందా!

ప్రశ్నించేందుకు సుమిత్రను పిలుస్తాడు లాయర్ కల్యాణ్ ప్రసాద్. దీప తెలుసా అని అడుగుతాడు. తన ప్రాణాలు కాపాడినందుకు తామే ఇంట్లోకి తీసుకొచ్చామని సుమిత్ర సమాధానమిస్తుంది. “ఎక్కడో ముత్యాలమ్మ గూడెంలో ఉన్న దీప.. సిటీకి వచ్చి అనుకోకుండా సుమిత్ర ప్రాణాలు కాపాడింది. భార్యకు ప్రాణం పోసి భర్త ప్రాణం ఎలా తీసుస్తుంది” అని జడ్జికి కల్యాణ్ ప్రసాద్ చెబుతాడు. ముగ్గురు పిల్లలను తల్లే చంపిన విషయం తెలుసని వేరే ఘటన గురించి భగవాన్ దాస్ అంటాడు. కనేటప్పుడు ఆ తల్లికి కూడా పిల్లలపై ప్రేమ ఉంటుందని, కానీ చంపేటప్పుడు ఏమైందని వాదిస్తాడు. మనుషులు మారతారు, ప్రేమ మారుతుందని అని లాజిక్ తీస్తాడు.

జ్యోత్స్నను చంపాలనుకుంది

ప్రాణం పోసిన తల్లే ప్రాణాలు తీసిందంటే.. ప్రాణాలు కాపాడిన ఈ మనిషి ప్రాణాలు ఎందుకు తీయకూడదని ఆరోపణలు చేస్తాడు లాయర్ భగవాన్ దాస్. దశరథ్‍ను చంపితే దీపకు ఏమొస్తుందని కల్యాణ్ ప్రసాద్ అడుగుతాడు. దీప చంపాలనుకున్నది దశరథ్‍ను కాదు.. జ్యోత్స్నను అని భగవాన్ దాస్ అంటాడు. ఏ విధంగా అడ్డొచ్చిందని జ్యోత్స్ను దీప చంపాలనుకుందో చెప్పండని కల్యాణ్ అడుగుతాడు. “నేను వివరిస్తా, జ్యోత్స్నను దీప చంపాలనుకునేందుకు కారణం ఉంది. దాన్ని దీప నుంచే చెప్పిస్తా” అని భగవాన్ దాస్ అంటాడు.

నరసింహం ప్రస్తావన తెచ్చిన భగవాన్ దాస్

దీపను భగవాన్ దాస్ ప్రశ్నిస్తాడు. నీ భర్త పేరు ఏంటి దీపను అడుగుతాడు. దీంతో దీప కాసేపు ఆలోచిస్తుంది. కార్తీక్ వంక చూస్తుంది. చెప్పు అని కార్తీక్ సైగ చేస్తాడు. కార్తీక్ బాబు అని దీప అంటుంది. మరి నరసింహ ఎవరు అని భగవాన్ దాస్ అంటాడు. దీంతో అబ్జక్షన్ అంటూ కల్యాణ్ లేస్తాడు. జైలులో ఉన్న నరసింహంతో విడాకులు తీసుకొని.. కార్తీక్‍ను రెండో పెళ్లి చేసుకుందని, అది ఆవిడ పర్సనల్ అని అంటాడు. అసలు గొడవ దీప విడాకుల తర్వాతే మొదలైందని భగవాన్ దాస్ అంటాడు.

జ్యోత్స్న అబద్ధం

ఏ గొడవ అని కల్యాణ్ అంటే.. కార్తీక్ గురించి దీపకు, జ్యోత్స్నకు మధ్య గొడవ మొదలైందని భగవాన్ దాస్ వాదిస్తాడు. కార్తీక్ బాబు గురించి జ్యోత్స్నతో నేను ఎప్పుడూ గొడవ పడలేదని దీప చెబుతుంది. దీంతో కోర్టులోనే అబద్ధం చెబుతుంది జ్యోత్స్న. “బావ గురించి చాలాసార్లు నాతో గొడవ పడింది” అని జ్యో అంటుంది. దీపనే గొడవ మొదలుపెట్టిందనేలా అవాస్తవం చెబుతుంది. “మొదలుపెట్టింది ఎవరు. ఎవరు ఎవరి దగ్గరికి వెళ్లి గొడవ పడ్డారు” అని కార్తీక్ కూడా లేస్తాడు. కూర్చొండి లేకపోతే.. బయటికి పోండి అని జడ్జి అరుస్తారు. సారీ అంటూ కూర్చుంటాడు కార్తీక్.

దీప ఆవేశపరురాలు.. కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తుందో తనకే తెలియదు అని అంటాడు లాయర్ భగవాన్ దాస్. ఆత్మగౌరవంతో బతికే మనిషిని ఆవేశపరురాలు అని అనడం కరెక్ట్ కాదని కల్యాణ్ అడ్డుకుంటాడు.

దీపపై లాయర్ ఆరోపణలు

జ్యోత్స్నను విచారించేందుకు బోనులోకి పిలుస్తాడు భగవాన్ దాస్. దీపతో మీకేంటి సంబంధం అని జ్యోను అడుగుతాడు. మా మమ్మీని కాపాడినందుకు నేనే ఇంటికి తీసుకొచ్చానని చెబుతుంది. జ్యోత్స్న, కార్తీక్‍కు ఎంగేజ్‍మెంట్ ప్లాన్ చేశారు.. నిజమేనా అని దీపను భగవాన్ దాస్ అడుగుతాడు. నిజమే అంటుంది దీప. నీ వల్లనే ఆగిపోయింది అని ఆరోపణలు చేస్తాడు భగవాన్ దాస్. దీప ఏదో చెప్పబోతే అవునా.. కాదా అని మాత్రమే చెప్పాలని దాస్ అంటాడు. అవును అంటుంది దీప. ఈ లాయర్ ఎందుకిలా చేస్తున్నాడని కార్తీక్‍ను కావేరి అడుగుతుంది. జ్యోత్స్నను గెలిపించి.. దీపను తప్పుడు మనిషిగా చూపించేందుకు అని కార్తీక్ అంటాడు.

దొంగచాటుగా పెళ్లి.. ప్రీప్లాన్డ్

జ్యోత్స్నకు, కార్తీక్‍కు పెళ్లి చేస్తానని మాటిచ్చావా లేదా అని దీపను భగవాన్ దాస్ అడుగుతాడు. ఇచ్చాను అని దీప అంటుంది. ఆ తర్వాత నువ్వు కార్తీక్‍ను దొంగచాటుగా పెళ్లి చేసుకున్నావని భగవాన్ దాస్ ఆరోపణ చేస్తాడు. అబ్జెక్షన్ అంటూ కల్యాణ్ లేస్తాడు. “దీప, కార్తీక్ దొంగచాటుగా పెళ్లి చేసుకోలేదు. వాళ్లింట్లోనే.. వాళ్ల అమ్మ సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. దీపను కార్తీక్ యాక్సిడెంట్‍గా పెళ్లి చేసుకున్నాడు. దీప కూతురికి కార్తీక్ తండ్రి కావాలనుకున్నాడు. దీప జీవితానికి తోడుగా నిలబడాలని అనుకున్నాడు. దీప అనుమతి లేకుండానే మెడలో తాళి కట్టాడు” అని కల్యాణ్ అంటాడు. కట్టాడు కాదు.. కట్టించుకుంది అని భగవాన్ దాస్ మళ్లీ అబద్ధం చెబుతాడు. ఇదంతా ప్రీప్లాన్డ్‌గా జరిగిందని అంటాడు. దీంతో బోనులో ఉన్న దీప తల్లడిల్లుతుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 23) ఎపిసోడ్ ముగిసింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024