





Best Web Hosting Provider In India 2024

జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో హైదరాబాద్, విశాఖ వాసులు మృతి.. పారిపోతున్నా వెంటాడి కాల్చేసిన ముష్కరులు
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో హైదరాబాద్, విశాఖపట్నంలకు చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్షన్ ఆఫీసర్ మనీశ్‌రంజన్, విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. విశాఖపట్నంకు చెందిన చంద్రమౌళి, హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఉద్యోగి మనీశ్ రంజన్ ప్రాణాలు కోల్పోయారు.
కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడిలో హైదరాబాద్ వాసి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మనీశ్ రంజన్‌ను ఉగ్రవాదులు కాల్చేశారు. కోఠీలోని ఇంటెలిజెన్స్ సబ్సిడరీ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మనీశ్ రంజన్ ఎల్టీసీలో భాగంగా జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లారు.
భార్యఇద్దరు పిల్లలతో కలిసి కశ్మీర్‌లో పర్యటిస్తున్న మనీశ్ రంజన్‌ను ఉగ్రవాదులు కాల్చి వేశారు. దాడికి ముందు మనీశ్ రంజన్ ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సును చుట్టుముట్టిన ఉగ్రవాదులు అందులో ప్రయాణికులను కిందకు దింపేశారు.
అతడి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించిన తర్వాత కుటుంబ సభ్యులను విడిచి పెట్టి మనీశ్ రంజన్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మనీశ్ భార్య, ఇద్దరు పిల్లల ముందే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఉగ్రవాదులు దాడి జరిగిన సమయంలో మనీష్ కుటుంబం బస్సులో ఉంది. బస్సు నుంచి కిందకు దింపి పేరు అడిగి, గుర్తింపు కార్డు చూసిన తర్వాత తలకు గురి పెట్టి కాల్చేసినట్టు కుటుంబ సభ్యులు తెలతిపారు. . బీహార్‌కు చెందిన మనీశ్ రంజన్ ఉద్యోగంలో భాగంగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. 2022 లో హైదరాబాద్ బదిలీపై వచ్చారు.
నాలుగు రోజుల క్రితం కశ్మీర్ పర్యటనకు వచ్చారు. సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ క్వార్టర్‌లో ఒంటరిగా నివసిస్తున్న మనీశ్ రంజన్ బీహార్‌లో ఉంటున్న కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లినట్టు సహచర ఉద్యోగులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నారు.
విశాఖ వాసిపై కాల్పులు…
జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన దాడిలో విశాఖపట్నంకు చెందిన చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన చంద్రమౌళి ఉగ్రవాదులు దాడితో పారిపోయేందుకు ప్రయత్నించినా ఉగ్రవాదులు వెంటాడి కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు వెళ్లిన తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర పర్యాటకులు గుర్తించారు.
ఉగ్రవాదులకు ఎదురు పడగా పారిపోతుండగా వెంటాడి కాల్చేసినట్టు చంద్రమౌళి మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చంద్రమౌళి విజయా బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. కాల్పులు జరిగిన మూడు గంటల తర్వాత సహచర పర్యాటకులు మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు విశాఖ నుంచి కశ్మీర్ బయల్దేరి వెళ్లారు.
సంబంధిత కథనం
టాపిక్