మధుమేహ రోగులు షుగర్ లెవల్స్ పెరగకుండా మామిడి పండ్లు ఎలా తినాలో తెలుసుకోండి

Best Web Hosting Provider In India 2024

మధుమేహ రోగులు షుగర్ లెవల్స్ పెరగకుండా మామిడి పండ్లు ఎలా తినాలో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

మామిడిలో సహజంగా చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి మీరు తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మధుమేహ రోగులు మామిడి పండు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారిలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోండి.

డయాబెటిక్ పేషెంట్లు మామిడి పండు ఎలా తినాలి? (Shutterstock)

మామిడిపండ్లు కోసమే వేసవి రాకను ఎదురుచూసే వారు ఎంతోమంది. పండ్ల రారాజు అయిన మామిడి అంటే పిల్లలు, పెద్దలకు కూడా ఎంతో నచ్చుతుంది. అయిదే మధుమేహ రోగులు మాత్రం మామిడి పండు తినాలంటే భయపడతారు.

మామిడి పండ్ల తియ్యటి, జ్యూసీ టేస్ట్ అందరికీ నచ్చుతుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారు తీపి మామిడి తినడం పెద్ద సమస్యగా మారుతుంది. వాస్తవానికి, మామిడిలో చక్కెర పుష్కలంగా ఉంటుంది, దీని వల్ల ఇది చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు సాధారణ ఆహారానికి దూరంగా ఉంటారు.

కానీ డయాబెటిస్ పేషెంట్లు మీ మనసును చంపుకోవాల్సిన అవసరం లేదు. మామిడి పండు తినాలనుకుంటే హ్యాపీగా తినవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఈ రోజు మేము మీకు కొన్ని చిట్కాలను చెబుతున్నాము. ఈ చిట్కాలను పాటిస్తే మీరు మితంగా మామిడి పండు తినవచ్చు.

మామిడి పండు ఇలా తినండి

జ్యూసీ మామిడి పండ్లను కళ్ల ఎదురుగా కనిపిస్తుంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అయితే మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం మంచిది కాదు. మామిడి పండ్లను ఆస్వాదించాలనుకుంటే రోజులో ఒక చిన్న మామిడి పండును ఎంపిక చేసుకోవాలి. పూర్తిగా పండినది కాకుండా మధ్యస్థంగా ఉన్నది ఎంచుకుంటే మంచిది. పూర్తి పండిన మామిడిలో చక్కెర అధికంగా ఉంటుంది.

చక్కెర స్థాయిలు పెరగడం గురించి ఆందోళన చెందకుండా మీరు మామిడిని ఆస్వాదించాలనుకుంటే, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ తో ఈ పండును జత చేసి తినండి. మీరు డ్రై ఫ్రూట్స్, చియా విత్తనాలతో మామిడి పండు ముక్కలను కలిపి తింటే మంచిది. ఎందుకంటే చియా గింజలు, డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలలో ఆకస్మిక పెరుగుదలను అడ్డుకుంటుంది. రక్తంలో చక్కెరను నిర్వహిస్తుంది.

జ్యూస్ తాగవద్దు

సాధారణ షుగర్ ఉన్నవారు మామిడి పండ్లు తినేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ముందుగా మామిడి పండును పండుగానే తినండి. అంతే తప్ప జ్యూస్ చేసి తాగడం మానుకోండి. ఎందుకంటే జ్యూస్ లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. మామిడి పండు తినాలనుకుంటే ఉదయం లేదా మధ్యాహ్న భోజన సమయంలోనే తినండి. రాత్రిపూట మాత్రం తినకూడదు.

షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి

మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తిన్న తర్వాత షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. దీనితో, మామిడి మీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీరు బాగా తెలుసుకోవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని మామిడి పండు తిన్నా కూడా… ఆ తర్వాత షుగర్ పెరిగితే డాక్టర్ సలహా లేకుండా తినడం మానేయాలి. అలాగే, సాధారణంగా తిన్న తర్వాత ఇతర అధిక కార్బ్ పండ్లు లేదా ఆహారాన్ని తినకూడదని గుర్తుంచుకోండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది.

(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024