





Best Web Hosting Provider In India 2024

AP SSC 10th Class Results 2025: నేడు ఏపీ ఎస్సెస్సీ 2025 ఫలితాలు విడుదల, హెచ్‌టి తెలుగులో ఫలితాలు తెలుసుకోండి ఇలా
AP SSC 10th Class Results 2025: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేస్తారు. ఆ తర్వాత సెకండరీ బోర్డ్ వెబ్‌సైట్‌తో పాటు హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
AP SSC 10th Class Results 2025: ఆంధ్రప్రదేశ్ పదో పరీక్షా ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 23న ఉదయం 10గంటలకు ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేస్తారు.
ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్‌లో నేరుగా తెలుసుకోవచ్చు.
https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result
నేడు పదో తరగతి ఫలితాలు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సైతం విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://www.bse.ap.gov.in/ , https://apopenschool.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
మన మిత్రలో రిజల్ట్స్ ఇలా పొందొచ్చు..
ఏపీ ప్రభుత్వం పౌరసేవల్ని అందిస్తున్న వాట్సాప్ మనమిత్ర నంబరులో పది పలితాలు కూడా తెలుసుకోవచ్చు.
- అభ్యర్థులు తమ మొబైల్ ఫోన్లో వాట్సప్ యాప్‌లో ” 9552300009 నంబర్ కు “Hi” అని మెసేజ్ పంపి, అందలో వచ్చే ఆప్షన్లలో విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, రోల్ నంబర్ నమోదు చేయడం ద్వారా ఫలితాల పీడీఎఫ్ కాపీని పొందవచ్చు.
- పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల లాగిన్ల ద్వారా ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. LEAP మొబైల్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్ల ద్వారా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.
- ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. 2024–25 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా.. 30,609 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు.
- ఈ ఏడాది మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు, వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు.
సంబంధిత కథనం
టాపిక్
Ap SscAp Ssc Board Results 2025Exam ResultsAndhra Pradesh NewsNara Lokesh
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.