Gunde Ninda Gudi Gantalu Serial: అత్త‌ను పొగిడిన మీనా – మ‌నోజ్ జాబ్ గురించి బాలు ఎంక్వైరీ – సంజుకు ఎదురుతిరిగిన మౌనిక‌

Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Serial: అత్త‌ను పొగిడిన మీనా – మ‌నోజ్ జాబ్ గురించి బాలు ఎంక్వైరీ – సంజుకు ఎదురుతిరిగిన మౌనిక‌

Nelki Naresh HT Telugu

గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 23 ఎపిసోడ్‌లో త‌న‌కు జాబ్ వ‌చ్చిన సంద‌ర్భంగా ఇంటికి స్వీట్ తీసుకొని వ‌స్తాడు మ‌నోజ్‌. మొద‌టిరోజు జీతంతో ఈ స్వీట్స్ తెచ్చాన‌ని నోరు జారుతాడు. నువ్వు ఏ జాబ్ చేస్తున్నావ‌ని బాలు ఆరాలు తీస్తాడు. నా చ‌దువుకు త‌గ్గ ఉద్యోగం అని మ‌నోజ్ అబ‌ద్ధం ఆడుతాడు.

గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 23 ఎపిసోడ్‌

స్వీట్ బాక్స్ ప‌ట్టుకొని సంతోషంగా ఇంటికొస్తాడు మ‌నోజ్‌. అంద‌రిని పిలుస్తాడు. బాలు అక్క‌డి నుంచి వెళ్లిపోబోతుంటే ఆపుతాడు. మీ అంద‌రికి ఓ శుభ‌వార్త చెప్పాలి. ముఖ్యంగా ఈ డ్రైవ‌ర్‌కు అని బాలుతో వెట‌కారంగా అంటాడు మ‌నోజ్‌. ఈ రోజు నా చ‌దువుకు త‌గ్గ ఉద్యోగం దొరికింద‌ని కుటుంబ‌స‌భ్యులంద‌రితో మ‌నోజ్ చెబుతాడు. ఆ మాట‌లు విన‌గానే రోహిణి, ప్ర‌భావ‌తి ఆనంద‌ప‌డ‌తారు. నాకు చాలా సంతోషంగా ఉంద‌ని, నిన్ను అన్న‌వాళ్లు అంద‌రికి ట‌క్కున నోళ్లు మూత‌ప‌డేలా చేశావ‌ని బాలువైపు చూస్తూ ప్ర‌భావ‌తి అంటుంది.

మొద‌టిరోజు జీతం…

నా మొద‌టిరోజు జీతంతో నీ కోసం హ‌ల్వా తెచ్చాన‌ని మ‌నోజ్ నోరు జారుతాడు. నీ జాబ్ ఏంటి అని మ‌నోజ్‌ను అడుగుతాడు బాలు. నా చ‌దువుకు త‌గ్గ ఉద్యోగం అని మ‌నోజ్ అబ‌ద్ధం చెబుతాడు. నువ్వు రోజు కూలీగా వెళుతున్నావా? ఏ రోజు జీతం ఆ రోజు ఇవ్వ‌డం ఏంటి బాలు ఆరాలు తీస్తాడు. త‌న వాటాగా వ‌చ్చిన టిప్ డ‌బ్బుల‌తో స్వీట్ కొన్న విష‌యం గుర్తుచేసుకుంటాడు మ‌నోజ్‌. కానీ నిజం దాచిపెట్టి మొద‌టిరోజే టార్గెట్ ఫినిష్ చేసి ఇన్సెంటివ్స్ తెచ్చుకున్నాన‌ని బిల్డ‌ప్‌లు ఇస్తాడు.

ప్ర‌భావ‌తి గొప్ప‌లు…

మొద‌టిరోజు నా కొడుకు ఇన్నోవెంట్ తెచ్చుకున్నాడ‌ని ప్ర‌భావ‌తి గొప్ప‌లు చెబుతుంది. అది ఇన్నోవెంట్ కాదు ఇన్సెంటివ్స్ అని రోహిణి అంటుంది. బాలుకు దిష్టి తీయ‌మ‌ని రోహిణికి చెబుతుంది ప్ర‌భావ‌తి. నాకు ఓ నిజం తెలిసిపోయింద‌ని బాలు అన‌గానే మ‌నోజ్ వ‌ణికిపోతాడు.

ఈ హ‌ల్వా ఏ హోట‌ల్‌లో అమ్ముతారో నాకు తెలుసు. ఆ హోట‌ల్‌లోని స‌ప్ల‌య‌ర్స్ అంద‌రూ త‌న‌కు ప‌రిచ‌య‌స్తులేన‌ని చెబుతాడు. బాలు త‌న‌ను ఎక్క‌డ ప‌ట్టుకుంటాడోన‌ని మ‌నోజ్ కంగారు ప‌డ‌తాడు. బాలు ఓన‌ర్‌, నౌక‌రు అనే ప‌దాలు వాడ‌టం చూసి రోహిణి కూడా వ‌ణికిపోతుంది. ఓ సారి మ‌నోజ్ ఆఫీస్‌కు అంద‌రం వెళ‌దామ‌ని బాలు అంటాడు.

మ‌నోజ్ బిల్డ‌ప్‌లు…

మ‌నోజ్‌కు జాబ్ రావ‌డం చూసి రోహిణి సంతోషానికి అవ‌ధులు లేకుండాపోతాయి. మొద‌టిసారి న‌న్ను గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేశావ‌ని అంటుంది. బాలు నోరు మూయించావ‌ని చెబుతుంది. మ‌న పెళ్లి రోజు త‌ర్వాత ఈ రోజు తాను ఎప్ప‌టికీ గుర్తుపెట్టుకుంటాన‌ని చెబుతుంది. నేను త‌ల‌చుకుంటే జాబ్ తెచ్చుకోవ‌డం పెద్ద విష‌యం కాద‌ని మ‌నోజ్ బిల్డ‌ప్‌లు ఇస్తాడు.

నువ్వు తెచ్చుకున్నది ఏ జాబ్ అని మ‌నోజ్‌ను అడుగుతుంది రోహిణి. చెప్పుకునేంత గొప్ప జాబ్ కాద‌ని మాట దాటేయ‌బోతాడు మ‌నోజ్‌. నాకు ఈ జాబ్ జాయిన్ కావ‌డం ఇష్టంలేదు…కేవ‌లం నీ కోసం నువ్వు ఇంట్లో త‌లెత్తుకొని తిర‌గ‌డం కోసం ఈ ఉద్యోగంలో చేరాన‌ని, మంచి గొప్ప జాబ్ తెచ్చుకున్న రోజు మొద‌ట నీకే చెబుతాన‌ని మ‌నోజ్ అంటాడు. నీకు చెప్పాల‌ని అనిపించిన‌ప్పుడే చెప్పు…అప్ప‌టివ‌ర‌కు నిన్ను ఏం అడ‌గ‌న‌ని రోహిణి బ‌దులిస్తుంది.

సంజు కోపం…

స‌త్యం ఇంట్లో త‌న‌కు జ‌రిగిన అవ‌మానం గురించి సంజుకు చెబుతుంది కాంతం. బాలును అవ‌మానించాల‌ని చూసి త‌న‌కే అవ‌మానం జ‌రిగేలా చేశావ‌ని అత్త‌పై ఫైర్ అవుతాడు సంజు. అప్పుడే మౌనిక రూమ్‌లోకి అడుగుపెడుతుంది. ఈ మ‌ధ్య నీలో అస‌లు భ‌యం, టెన్ష‌న్ క‌నిపించ‌డం లేద‌ని మౌనిక‌తో అంటాడు సంజు. మీ ఇంటికి వెళ్లిన‌ప్ప‌టి నుంచి చాలా ఆనందంగా క‌నిపిస్తున్నావ‌ని అడుగుతాడు. నా బ‌తుక్కి అదొక్క‌టే త‌క్కువ అని మౌనిక బ‌దులిస్తుంది.

సంతోషం ఉండ‌కూడ‌దు…

ఏంటి ఎదురించి మాట్లాడుతున్నావ‌ని , పొగ‌రు పెరిగిపోయిందా అని మౌనిక‌పై కోపంగా ఎగిరిప‌డ‌తాడు సంజు. నీ బ‌తుకులో ఎప్ప‌టికీ సంతోషం ఉండ‌కూడ‌ద‌నే నిన్ను పెళ్లి చేసుకున్నాన‌ని సంజు చెబుతాడు. ఇంట్లో జ‌రిగిన అవ‌మానానికి బ‌దులు తీర్చుకునే అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నాన‌ని కోపంగా సంజు అంటాడు.

నేను ప‌డే న‌ర‌కం చూసి కూడా మీకు సంతోషం క‌ల‌గ‌డం లేదా..మా పుట్టింటివాళ్ల‌ను కూడా ఏడిపించాలా అని భ‌ర్త‌ను నిల‌దీస్తుంది మౌనిక‌.నిన్ను టార్చ‌ర్ పెట్టిన విష‌యం మీ ఇంట్లోకు వెళ్లిస్తేనే క‌దా నాకు మ‌జా అని సంజు అంటాడు. మీ వాళ్ల‌ను ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌కూడ‌దంటే ప్ర‌తిరోజు నువ్వు ఏడ‌వాలి అని చెబుతాడు. ఇక్క‌డ నువ్వు అనుభ‌వించే శిక్ష మీ వాళ్ల‌కు తెలిసేలా ఏదో ఒక‌టి చేస్తాన‌ని అంటాడు.

మా బాలుకు తెలిస్తే బ‌త‌క‌నివ్వ‌డు…

మీ సంగ‌తి తెలిస్తే మా బాలు అన్న‌య్య మిమ్మ‌ల్ని బ‌త‌క‌నివ్వ‌డ‌ని సంజుకు వార్నింగ్ ఇస్తుంది మౌనిక‌. సంజు కోపంతో మౌనిక వైపు చూస్తాడు. ఏంటి చంపేస్తారా అని భ‌ర్త‌తో అంటుంది మౌనిక‌. మా అన్న‌య్య మాట న‌మ్మ‌కుండా మీ న‌ట‌న న‌మ్మి ఇంత‌దాక తెచ్చుకున్నందుకు ఆనందంగా చ‌చ్చిపోతాన‌ని మౌనిక చెబుతుంది. ఈ ప‌గ‌లు, ప్ర‌తీకారాలు మిమ్మ‌ల్ని ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌వ‌ని సంజుకు చెబుతుంది.

మీ అన్న‌య్య‌తో పాటు మీ కుటుంబాన్ని అవ‌మానించి…మీ అన్న‌య్య తిర‌గ‌బ‌డితే నిన్ను అక్క‌డే వ‌దిలించుకొని రావాల‌ని అనుకున్నాన‌ని, కానీ మా అత్త మూలంగా నా ప్లాన్ వ‌ర్క‌వుట్ కాలేద‌ని సంజు అంటాడు.

బాలు ముందు అనండి…

వెళ్లిపోతున్న మా అన్న‌య్య‌ను ఎందుకు ఆపారో, పుస్తెల‌తాడు ఎలా మాయ‌మైందో, మీ అత్త‌య్య‌ను మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలుసు అని మౌనిక అంటుంది.

మీ కుటుంబాన్ని బూడిద చేస్తాన‌నే మాట బాలు ముందు అనండి…ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుందో చూడండి అని సంజుతో ఛాలెంజ్ చేస్తుంది మౌనిక‌. భార్య మాట‌ల‌తో సంజు కోపం ప‌ట్ట‌లేక‌పోతాడు. మౌనిక‌ను నెట్టేస్తాడు. త‌లుపుకు ఆమె త‌ల బ‌లంగా త‌గులుతుంది. ఆ దెబ్బ‌తో స్పృ కోల్పోతుంది మౌనిక‌.

అత్త సంగ‌తి చెబుతారు…

మీనా పూల షాప్‌కు తెలిసిన మ‌హిళ వ‌స్తుంది. మీనా యోగ‌క్షేమాలు అడుగుతుంది. మీనా మెడ‌లో ప‌సుపుతాడు క‌నిపించ‌డంతో పుస్తెల‌తాడు ఏమైంద‌ని అడుగుతుంది. నిజం చెప్పు మీ అత్త లాగేసుకుందా అని అడుగుతుంది. మీ అత్త నిన్ను హింసిస్తుందా అని ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు అడుగుతుంది. ఏదైనా ఉంటే నాతో చెప్ప‌మ‌ని, మ‌న బ‌స్తీలో వాళ్లు వ‌చ్చి మీ అత్త సంగ‌తి చెబుతార‌ని ఆ మ‌హిళ అంటుంది.

మ‌ళ్లీ నీ జోలికి రావాలంటే మీ అత్త భ‌య‌ప‌డాల‌ని అంటుంది.

మీనా అబ‌ద్దం…

పుస్తెల‌తాడు హుక్ తెగిపోయింద‌ని, అంత‌కుమించి మీరు అనుకుంటున్న‌ట్లు ఏం లేద‌ని మీనా అబ‌ద్ధం ఆడుతుంది. అత్త‌గారు ముగ్గురు కోడ‌ళ్ల‌ను అమ్మ‌లా చూసుకుంటుంద‌ని, అందుకే నా షాప్‌కు అత్త పేరు పెట్టుకున్నాన‌ని మీనా అబ‌ద్ధం ఆడుతుంది.

అప్పుడే ప్ర‌భావ‌తి బ‌య‌ట‌కు వ‌చ్చి మీనాపై కోపంతో రంకెలు వ‌స్తుంది. రోజంతా షాప్‌లోనే కూర్చుంటావా? దారిన పోయేవాళ్ల‌తో మాట‌లు ఏంటి? ఇంట్లో వంట ఎవ‌రు చేస్తార‌ని క్లాస్ ఇస్తుంది. మీనా చెప్పిన అబ‌ద్ధం బ‌య‌ట‌ప‌డ‌టంతో ఆ మ‌హిళ షాక‌వుతుంది.

నేను క‌ష్ట‌ప‌డటం న‌చ్చ‌క‌నే మా అత్త అలా మాట్లాడుతుంద‌ని మ‌ళ్లీ మీనా క‌వ‌ర్ చేస్తుంది. నువ్వు చెప్పేదానికి ఆమె అరిచిన అరుపుల‌కు పొంత‌న లేద‌ని ఆ మ‌హిళ అంటుంది. వారి మాట‌ల‌ను స‌త్యం వింటాడు.

ప్ర‌భావ‌తికి క్లాస్‌…

కోపంతో ఇంట్లోకి వ‌చ్చిన స‌త్యం ప్ర‌భావ‌తికి క్లాస్ ఇస్తాడు. ఇంటి ప‌నుల‌న్నీ చేయ‌డానికి మీనా ఒక్క‌టే ఉందా…ఈ ఇంట్లో ఎవ‌రు లేరా అని నిల‌దీస్తాడు. నువ్వు ఖాళీగానే ఉన్నావు క‌దా అని ఫైర్ అవుతాడు. నేను ఇంటి ప‌నులు చేయ‌డ‌మేంటి అని ప్ర‌భావ‌తి బ‌దులిస్తుంది.

చాడీలు చెప్పి మిమ్మ‌ల్ని రెచ్చ‌గొట్టి ఇంట్లోకి మీనానే ఇంట్లోకి పంపించిందా అని నింద‌లు వేస్తుంది. క‌న్న‌త‌ల్లిలా మా అత్త‌య్య న‌న్ను చూసుకుంటుంద‌ని మీనా అన్న సంగ‌తి చెబుతాడు స‌త్యం. అదంతా నాట‌కం అని కొట్టిప‌డేస్తుంది ప్ర‌భావ‌తి.

సంజు అవ‌మానం…

దారిలో సంజు కారు ఆగిపోవ‌డం బాలు చూస్తాడు. ఇంజిన్ చెడిపోవ‌డంతో త‌న కారులో ఇంటి ద‌గ్గ‌ర డ్రాప్ చేస్తాన‌ని అంటాడు. క్యాబ్ అనుకొనే ఎక్క‌మ‌ని చెబుతాడు. మీనా కోసం కొన్న పుస్తెలు మౌనిక‌కు చూపిస్తాడు. పుస్తెలు కొనే స్థోమ‌త కూడా లేదా…ప‌సుపు కొమ్ము మెడ‌లో వేసుకొనే నీ భార్య తిరుగుతుందా అంటూ బాలును అవ‌మానిస్తూ మాట్లాడుతాడు సంజు.

మౌనిక త‌లకు దెబ్బ ఉండ‌టం చూసి సంజు నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? అత‌డు కొట్ట‌డం వ‌ల్లే నీకు ఈ గాయమైందా అని సంజును నిల‌దీస్తాడు బాలు. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024