




Best Web Hosting Provider In India 2024
వికెట్ తీశాడు.. ప్లేయర్ ను తలపై కొట్టాడు..పాకిస్థాన్ సూపర్ లీగ్ లో వింత ఘటన
పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఏవేవో వింత ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆట తప్ప అన్ని విషయాల్లో ఈ లీగ్ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. తాజాగా ఓ పేసర్ తోటి క్రికెటర్ తలపై కొట్టాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
ముల్తాన్ సుల్తాన్స్, లాహోర్ ఖలందర్స్ మధ్య మంగళవారం (ఏప్రిల్ 23) రాత్రి జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. పేసర్ తన తోటి క్రికెటర్ తలపై కొట్టడం వింతగా మారింది. ముల్తాన్ సుల్తాన్స్ పేసర్ ఉబైద్ షా.. అనుకోకుండానే తన టీమ్ వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ తలపై కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏం జరిగిందంటే?
పీఎస్ఎల్ 2025లో లాహోర్ ఖలందర్స్ ఛేజింగ్ లో సామ్ బిల్లింగ్స్ ను ఉబైద్ షా ఔట్ చేశాడు. ఈ వికెట్ పడగొట్టిన ఆనందంతో ఉబైద్ సంబరాలు చేసుకున్నాడు. ఆ జోష్ లో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ తలపై అనుకోకుండా కొట్టాడు. ఉస్మాన్ ఖాన్ చేతులు ముందుకు తేగా.. వాటి మధ్యలో నుంచి ఉబైద్ తలమీద బలంగా కొట్టాడు. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేసింది.
వెంటనే ట్రీట్ మెంట్
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025లో ఈ ఘటన జరిగిన సమయంలో ఉస్మాన్ ఖాన్ తలపై హెల్మెట్ కు బదులు టోపీ ఉంది. అతని తలపై దెబ్బ బలంగా తగిలింది. వెంటనే అతను గ్రౌండ్ లో నొప్పితో కూలిపోయాడు. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి తలెత్తింది. వెంటనే ముల్తాన్ సుల్తాన్స్ క్యాంప్ నుంచి ఫిజియో పరుగెత్తుకుంటూ వచ్చి ట్రీట్ మెంట్ అందించాడు. వెంటనే ఉస్మాన్ ఖాన్ కోలుకుని తిరిగి వికెట్ కీపింగ్ కొనసాగించడంతో ప్రమాదం తప్పింది.
ఉబైద్ అదుర్స్
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 229 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్ లో లాహోర్ ఖలందర్స్ ను ఉబైద్ షా దెబ్బకొట్టాడు. మూడు వికెట్లతో అదరగొట్టాడు. చివరకు లాహోర్ 195/9 స్కోరుకే పరిమితమై 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముల్తాన్ సుల్తాన్స్ టోర్నమెంట్‌లో వరుసగా మూడు ఓటముల తర్వాత మొదటి విజయాన్ని నమోదు చేసింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link