





Best Web Hosting Provider In India 2024

మీ పిల్లలు ఉదయాన్నే ఇలాంటి పనులు చేయకుండా చూసుకోండి
పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని తల్లిదండ్రులే కాపాడాలి. పిల్లలు ఉదయాన్నే లేచి కొన్ని పనులు చేయాలి, అలాగే కొన్ని పనులు చేయకూడదు. పిల్లలు ఉదయం నిద్ర లేచాక ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకోండి.
పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది తల్లీదండ్రులే. వారికి మంచి చెడు తెలియదు. వాటిని పిల్లలకు అర్థమయ్యేలా చేసేదే తల్లిదండ్రులు. పిల్లలు ఉదయం నిద్ర లేచాక మంచి అలవాట్లను పెంపొందించాలి. అలాగే వారు ఉదయాన్నే చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
అల్పాహారం దగ్గర నుంచి అధిక స్క్రీన్ టైమ్ వరకు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి మంచి ప్రణాళిక అవసరం. వారిలో ఆరోగ్యకరమైన, ఉత్పాదకతను పెంచే అలవాట్లు పెంచాలి.
గ్యాడ్జెట్లు దూరంగా
పిల్లలు ఉదయం నిద్రలేవగానే వారు టీపీ, ఫోన్లు వంటివి చూడకుండా చూసుకోవాలి. వారు స్క్రీన్ వైపు చూడకుండా చూసుకోవాలి. వ్యాయామం చేయడం, పాజిటివ్ ఆలోచనలు పెంచేలా వారితో మాట్లాడడం వంటివి చేయాలి.
వారి మానసిక స్థితి, ఏకాగ్రత, శారీరక దృఢత్వాన్ని పెంచడానికి సాధారణ వ్యాయామాలు పిల్లల చేత చేయించాలి. భారీ వ్యాయామాలు చేయించకూడదు. తీవ్రంగా ఉండే ఎక్సర్ సైజులు చేయకూడదు. యోగా వంటివి చేయించడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి.
వ్యక్తిగత పరిశుభ్రత
పళ్ళు తోముకోవడం, మలవిసర్జన, స్నానం చేయడం, జుట్టుకు నూనె రాసుకోవడం, దువ్వడం వంటివి వారికి వారే చేసుకునేలా ప్రోత్సహించాలి. ఉదయం మేల్కొన్న తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత గురించి పట్టించుకునేలా చేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత అనేది వారిలో ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
దుప్పట్లను వదిలేయకుండా
పిల్లలు నిద్రపోయిలేచాక తాము కప్పుకున్న దుప్పట్లు అలాగే వదిలేస్తారు. కానీ వారికి దుప్పట్లు మడతపెట్టడం నేర్పాలి. ప్రతిరోజూ ఈ పని చేయడానికి వారిని ప్రోత్సహించండి. వారు ఈ బాధ్యతలను చేపట్టినప్పుడు వారికి క్రమశిక్షణ అలవడుతుంది.
హోంవర్క్
పొద్దున్నే నిద్రలేచి హడావుడిగా హోంవర్క్ పూర్తి చేసే పిల్లలు ఉన్నారు. దీనికి తల్లిదండ్రులు ఒప్పుకోకూడదు. వారి చేత హోంవర్క్ ముందుగానే రాత్రి పూట చేయించాలి. వారు పాఠశాల విద్యలో రాణించడానికి వారికి సహాయపడండి.
ప్రశాంతమైన వాతావరణం
మీరు ఉదయం లేవగానే, మీ బిడ్డకు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించండి. వారితో సానుకూల సంభాషణలు చేయండి. వారికి కృతజ్ఞత, సహనం నేర్పండి. అనవసరమైన విమర్శలు, వాదనలు చేయవద్దు.
ఉదయం అల్పాహారం
ఎంతోమంది పిల్లలు తమకు బ్రేక్ ఫాస్ట్ నచ్చకపోతే తినకుండా వదిలేస్తారు. అల్పాహారం వారు మానేయకుండా వారికి ఆహారం తినిపించాలి. ఉదయం ఆరోగ్యకరమైన భోజనం ఇవ్వడం వల్ల రోజంతా తగినంత శక్తి లభిస్తుంది. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తినిపించాలి.
ఆలస్యంగా నిద్రలేవడం
చాలమంది పిల్లలు నిద్ర ఆలస్యంగా లేస్తారు. అలాంటి పిల్లలకు నిద్ర విషయంలో క్రమశిక్షణగా ఉండాలి. పొద్దున్నే ఒకే సమయానికి నిద్రలేచేలా వారికి శిక్షణ ఇవ్వాలి. పొద్దున్నే లేవడం, ఉదయం పనులు ముగించుకోవడం, బడికి వెళ్లడం వంటివి వారు సక్రమంతా చేసేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల సమయానికి పాఠశాలకు చేరుకోవచ్చు.
సంబంధిత కథనం