నలుపు లేదా ఎరుపు.. ఏ కుండ నీరు చల్లగా ఉంటాయి? రెండింట్లో ఏది కొంటే బెటర్?

Best Web Hosting Provider In India 2024

నలుపు లేదా ఎరుపు.. ఏ కుండ నీరు చల్లగా ఉంటాయి? రెండింట్లో ఏది కొంటే బెటర్?

Haritha Chappa HT Telugu

వేసవిలో కుండలు కొనేవారు ఎక్కువే. అయితే మార్కెట్లో నలుపు, ఎరుపు రంగు కుండలు కనిపిస్తాయి. ఈ రెండు రంగుల్లో ఏ కుండను కొనాలనే ఆలోచన ఎక్కువ మందికి ఉంటుంది. నీటికి ఏ రంగు కుండ కొంటే బాగుంటుందనే విషయాన్ని తెలుసుకోండి.

ఏ రంగు కుండా కొనాలి? (shutterstock)

వేసవి కాలంలో చల్లని నీటి కోసం కుండను కొనే వారి సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలా కుండను కొంటూ ఉంటారు. మండుతున్న ఎండలు, వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చల్లని నీటిని తాగుతూ ఉండాలి.

సహజసిద్ధంగా నీటిని చల్లబరచేందుకు కొందరు మార్కెట్ నుంచి మట్టి కుండలు తెచ్చి వంటగదిలో ఉంచుతారు. మీరు కూడా ఫ్రిజ్ నుంచి చల్లటి నీరు తాగడం మానేసి, చల్లటి నీటి కోసం మట్టి కుండ కొనాలనుకుంటే, ఈ చిట్కాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ప్రస్తుతం మార్కెట్లో నలుపు, ఎరుపు రంగు కుండలు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చల్లటి నీటికి ఏ రంగు కుండ కొంటే బాగుంటుందనే ప్రశ్న ప్రజల మదిలో మెదులుతోంది. మీరు కూడా ఈ సందిగ్ధంలో ఉంటే, మీ సమస్యను తీసేందుకు ఎరుపు, నలుపు రంగు కుండలలో ఏది కొనాలి? ఎందుకు కొనాలో తెలుసుకోండి.

ఎరుపు లేదా నలుపు కుండ

ఎరుపు రంగు లేదా నలుపు కుండల్లో ఏది కొంటే మంచిదో నిపుణులు చెబుతున్నారు. నల్ల మట్టితో చేసిన కుండలు నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచడమే కాకుండా, ఈ నీటిలో బ్యాక్టీరియా కూడా తక్కువగా పెరుగుతుంది. ఈ నీటిలో ఖనిజ మూలకాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. ఎందుకంటే నల్ల మట్టి ఆకృతి సూక్ష్మ రంధ్రాలను కలిగి ఉంటుంది. ఇది బాష్పీభవన ప్రక్రియను మెరుగుపరుస్తుంది. నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది. మీరు నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచాలనుకుంటే, నలుపు రంగు కుండ కొనుక్కోండి. నలుపు రంగు వేడిని వేగంగా గ్రహిస్తుంది. ఇది కుండ ఉపరితలాన్ని చల్లగా ఉంచుతుంది.

ఆయుర్వేదం ప్రకారం, నల్ల కుండ నీటిలో ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ, అసిడిటీ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. నల్ల కుండ ఉపరితలంపై బ్యాక్టీరియా పెరగడం వల్ల నీరు శుభ్రంగా ఉంటుంది. మీరు నీటిని 6-8 గంటలకు మించి చల్లగా ఉంచాలనుకుంటే నలుపు కుండలు ఎంచుకోవాలి.

ఎరుపు కుండలు కొంటే

ఎరుపు కుండలు సాధారణంగా ఎర్ర బంకమట్టితో తయారు చేస్తారు. ఈ కుండ నీటిని త్వరగా చల్లబరుస్తుంది. కానీ ఎక్కువసేపు చల్లదనాన్ని కొనసాగించడంలో నల్ల కుండలాగా ప్రభావవంతంగా పనిచేయవు.

కుండలో నీటితో ప్రయోజనాలు

కుండల్లోని నీరు సహజంగా చల్లబడుతుంది. రుచికరంగా ఉంటుంది. ఇది శరీరంలోని పిహెచ్ స్థాయిని సమతుల్యంగా ఉంచడం ద్వారా గొంతు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎర్ర కుండీలు చాలా సాధారణమైనవి. తక్కువ ధరకు దొరుకుతాయి. వీటిని మార్కెట్ నుంచి సులభంగా కొనుగోలు చేయవచ్చు. నలుపు రంగు కుండతో పోలిస్తే ఎరుపు రంగు కుండా కొనుక్కుంటే మంచిది. దీనిలో నీరు త్వరగా చల్లబడుతుంది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024