మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు.. ఒకటి మలయాళం, మరొకటి తమిళం.. రెండూ తెలుగులోనూ..

Best Web Hosting Provider In India 2024

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు.. ఒకటి మలయాళం, మరొకటి తమిళం.. రెండూ తెలుగులోనూ..

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు రాబోతున్నాయి. వీటిలో ఒకటి మలయాళం కాగా.. మరొకటి తమిళ సినిమా. అయితే ఇవి రెండూ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం. మరి ఆ మూవీస్ ఏంటి, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు.. ఒకటి మలయాళం, మరొకటి తమిళం.. రెండూ తెలుగులోనూ..

ఓటీటీలో ఈ వీకెండ్ చూడటానికి చాలా సినిమాలు, వెబ్ సిరీసే ఉన్నాయి. అయితే సాధారణంగా శుక్రవారం వచ్చే బ్లాక్‌బస్టర్ సినిమాలు ఈసారి గురువారమే (ఏప్రిల్ 24) అడుగుపెడుతున్నాయి. వీటిలో ఒకటి మలయాళం మూవీ ఎల్2: ఎంపురాన్ కాగా.. మరొకటి తమిళ సినిమా వీర ధీర శూరన్. రెండూ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాదించినవే కావడం విశేషం.

ఎల్2: ఎంపురాన్ ఓటీటీ స్ట్రీమింగ్

అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా చరిత్ర సృష్టించిన ఎల్2: ఎంపురాన్ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా గురువారం (ఏప్రిల్ 24) నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అంటే బుధవారం అర్ధరాత్రి 12 దాటగానే ఈ సినిమా అందుబాటులోకి కాబోతోంది. ఈ సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.270 కోట్లు వసూలు చేసింది.

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గతంలో వచ్చిన లూసిఫర్ సినిమాకు సీక్వెల్. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో మోహన్ లాల్ లీడ్ రోల్లో నటించిన మూవీ ఇది. ఇందులో గుజరాత్ అల్లర్లను చూపించడం కారణంగా వివాదం రేగింది. పెద్ద ఎత్తున వ్యతిరేకత, విమర్శలు రావడంతో ఏకంగా 27 కట్స్ తో థియేటర్లలో మళ్లీ ప్రదర్శించారు. దీంతో ఓటీటీలో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

వీర ధీర శూరన్ ఓటీటీ స్ట్రీమింగ్

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన మూవీ వీర ధీర శూరన్. ఈ సినిమా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. గురువారం (ఏప్రిల్ 24) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో మార్చి 27న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.65.3 కోట్లు వసూలు చేసి ఓ మోస్తరు విజయం సాధించింది.

ఇది యాక్షన్ క్రైమ్ మూవీ. అరుణ్ కుమార్ డైరెక్ట్ చేశాడు. విక్రమ్ తోపాటు ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు నటించారు. ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఇది పార్ట్ 2. త్వరలోనే పార్ట్ 1 షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024