




Best Web Hosting Provider In India 2024

నెట్‌ఫ్లిక్స్‌లో తిరుగులేని కోర్ట్ మూవీ.. రికార్డు వ్యూస్.. ఇప్పటి వరకూ ఎంతమంది చూశారంటే?
నెట్‌ఫ్లిక్స్‌లో కోర్ట్ మూవీకి తిరుగేేలేకుండా పోతోంది. వరుసగా రెండో వారం కూడా ఈ ఓటీటీ గ్లోబల్ ట్రెండింగ్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీ సినిమాల్లో టాప్ 10లో కొనసాగుతోంది. అంతేకాదు రికార్డు వ్యూస్ కూడా సొంతం చేసుకోవడం విశేషం.
కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో దుమ్ము రేపుతోంది. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమాకు ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ సినిమాల్లో వరుసగా రెండో వారం కూడా టాప్ 10లోనే ఉంది.
కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ స్ట్రీమింగ్
ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవిలాంటి వాళ్లు నటించిన మూవీ కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 11న స్ట్రీమింగ్ కు వచ్చిన కోర్ట్ మూవీ.. తొలి వారం గ్లోబల్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో ఐదో స్థానంలో నిలిచింది. ఇక తాజాగా రెండో వారం కూడా టాప్ 10లోనే కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఆరో స్థానంలో ఉంది. మరో ఇండియన్ మూవీ ఛావా ఐదో స్థానంలో ఉంది.
కోర్ట్ మూవీకి ఇప్పటి వరకూ నెట్‌ఫ్లిక్స్ లో ఏకంగా 29 లక్షల వ్యూస్ రావడం విశేషం. ఇక 72 లక్షల వ్యూయింగ్ గంటలను కూడా నమోదు చేసింది. అటు ఐదో స్థానంలో ఉన్న ఛావా మూవీ విషయానికి వస్తే.. దీనికి 33 లక్షల వ్యూస్, 88 లక్షల గంటల వ్యూయింగ్ హవర్స్ నమోదయ్యాయి. కానీ కోర్ట్ లాంటి ఓ లోబడ్జెట్ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంతటి ప్రభంజనం సృష్టిస్తుండటం మాత్రం నిజంగా విశేషమే. ఇండియాలోనూ కోర్ట్ మూవీ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ కూడా ఛావా తర్వాతి స్థానంలోనే ఉండటం విశేషం.
కోర్ట్ మూవీ స్టోరీ ఇదీ..
కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ మూవీని రామ్ జగదీశ్ డైరెక్ట్ చేశాడు. ఇందులో ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవిలాంటి వాళ్లు నటించారు. నాని ఈ సినిమాను తన వాల్‌పోస్టర్ బ్యానర్లో నిర్మించడం విశేషం. ఓ సింపుల్ లవ్ స్టోరీకి పోక్సో చట్టం దుర్వినియోగం అనే కీలకమైన అంశాన్ని జోడించి తీసిన సినిమా ఇది.
పోక్సో చట్టంలోని లోతుపాతులను ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించారు. పోక్సో చట్టం గురించి తెలియని కోణాలను ఈ సినిమాలో టచ్ చేశాడు. కులం, పగ ప్రతీకారాల కోసం పోక్సో లాంటి చట్టాలను కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? చట్టంలోని లోసుగుల కారణంగా ఏ తప్పు చేయని అమాయకులు ఏ విధంగా బలవుతున్నారన్నదిఅర్థవంతంగా సినిమాలో చూపించాడు.
రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాల్లో ఉంటే హై మూవ్‌మెంట్స్, సర్‌ప్రైజ్‌లు కోర్టులో కనిపించదు. క్లైమాక్స్ ఏమిటన్నది కూడా ఈజీగానే చెప్పొచు. అయినా కోర్టు కథతో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని కలిగించాడు దర్శకుడు. కోర్టులో ప్రియదర్శి వాదనలు, అతడు చెప్పే డైలాగ్స్, కేసుకు సంబంధించి రివీల్ చేసే ట్విస్ట్‌లు బాగున్నాయి.
సంబంధిత కథనం