





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఆ నాలుగు హత్యలు నిజంగా అతడు చేసినవేనా?
ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. నిజానికి దీనికి వెబ్ సిరీస్ అనేకంటే ఓ మాకుమెంటరీ సిరీస్ అనొచ్చు. నాలుగు హత్యలను ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చేసే దర్యాప్తు కోణంలో ఈ సిరీస్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది సోనీలివ్ ఓటీటీ. బ్లాక్ వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ పేరుతో ఈ ఓటీటీలోకి ఓ సిరీస్ రాబోతోంది. ఇది ఓ సాధారణ యువకుడు నాలుగు హత్యలు చేశాడన్న ఆరోపణలు ఎదుర్కోవడం, దాని వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసే ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చుట్టూ తిరుగుతుంది.
బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్ సిరీస్
బ్లాక్ వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను గతంలోనే సోనీలివ్ ఓటీటీ అనౌన్స్ చేసింది. పది రోజుల కిందటే ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. అయితే తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
ఓ ఫిక్షనల్ క్రైమ్ డ్రామాకు డాక్యుమెంటరీలలో ఉపయోగించే ఇంటర్వ్యూలు, అసలు ఫుటేజీని ఉపయోగించడం ఈ మాకుమెంటరీ స్టైల్ సిరీస్ ప్రత్యేకత. బ్లాక్ వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ ద్వారా సోనీలివ్ అదే ప్రయత్నం చేస్తోంది. ఇందులో ఒరిజినల్ క్రైమ్ కు సంబంధించిన రా ఫుటేజీతోపాటు తాము రూపొందించిన ఫిక్షనల్ సిరీస్ విజువల్స్ ను ఈ ఓటీటీ ఉపయోగించింది.
అణగారిన వర్గానికి చెందిన ఓ సాధారణ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్ తోపాటు మరో ముగ్గురిని హత్య చేసినట్లుగా పోలీసులు చెబుతారు. కానీ అందులో నిజమేంటో ఆ యువకుడు వెల్లడిస్తాడు. ఈ నిజానిజాలను ఓ జర్నలిస్ట్ బయటకు తీసుకొస్తాడు. ఇలా ఓ ఫిక్షనల్ స్టోరీకి, నిజ జీవిత ఇంటర్వ్యూలు, ఫుటేజీని ఉపయోగించి ఈ సిరీస్ తీసుకొస్తున్నారు.
బ్లాక్ వైట్ అండ్ గ్రే ట్రైలర్ ఎలా ఉందంటే?
బ్లాక్ వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ వెబ్ సిరీస్ ట్రైలర్ గత వారమే రిలీజైంది. “అన్ని ప్రేమ కథలూ చరిత్ర సృష్టించలేవు. కొన్ని క్రైమ్ రిపోర్టులుగా మారతాయి. నాలుగు శవాలు.. లెక్కలేనన్ని అబద్ధాలు. బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్ మే 2 నుంచి కేవలం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ వచ్చేసింది” అనే క్యాప్షన్ తో సోనీ లివ్ ఓటీటీ ఈ ట్రైలర్ రిలీజ్ చేసింది.
బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్ అనే వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఓ ప్రేమ జంట చాటింగ్ చేసుకుంటున్న సీన్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత వీళ్లు సీక్రెట్ గా కలుసుకొని కారులో వెళ్తుంటారు. నేను నీతో సీరియస్ గా ప్రేమలో ఉన్నానని అబ్బాయి చెబుతాడు.. కానీ అమ్మాయి మాత్రం ప్రేమలాంటివేమీ వద్దంటుంది.
ఆ తర్వాత సడెన్ గా ఆ అమ్మాయి కారులోనే కన్నుమూస్తుంది. ఏం చేయాలో అర్థం కాక ఆ యువకుడు ఆ అమ్మాయి శవాన్ని ఓ అడవిలోకి తీసుకెళ్లి తగలబెట్టేస్తాడు. ఆ అమ్మాయి ఓ రాజకీయ నాయకుడి కూతురు కావడం గమనార్హం. దీంతో స్టోరీ కాస్తా పొటిలికల్ టర్న్ తీసుకుంటుంది.
అసలు ఆ అమ్మాయికి ఏమైంది? ఎలా చనిపోయింది? దీనికి మరో మూడు హత్యలకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్ అనే ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో మే 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం