నెట్‌ఫ్లిక్స్‌లోకి సూపర్‌నేచురల్ హారర్ వెబ్ సిరీస్ రెండో సీజన్.. రెండు పార్ట్‌లుగా స్ట్రీమింగ్.. భయపెడుతున్న టీజర్

Best Web Hosting Provider In India 2024

నెట్‌ఫ్లిక్స్‌లోకి సూపర్‌నేచురల్ హారర్ వెబ్ సిరీస్ రెండో సీజన్.. రెండు పార్ట్‌లుగా స్ట్రీమింగ్.. భయపెడుతున్న టీజర్

Hari Prasad S HT Telugu

నెట్‌ఫ్లిక్స్‌లోకి ఓ సూపర్ నేచురల్ హారర్ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తోంది. నవంబర్ 2022లో తొలి సీజన్ రాగా.. ఇప్పుడు సుమారు మూడేళ్ల తర్వాత రెండో సీజన్ రానుంది. బుధవారం (ఏప్రిల్ 23) రిలీజైన ట్రైలర్ భయపెడుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి సూపర్‌నేచురల్ హారర్ వెబ్ సిరీస్ రెండో సీజన్.. రెండు పార్ట్‌లుగా స్ట్రీమింగ్.. భయపెడుతున్న టీజర్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఓ హారర్ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ రానుంది. దీనికి సంబంధించిన టీజర్ ను బుధవారం (ఏప్రిల్ 23) ఆ ఓటీటీ రిలీజ్ చేసింది. ఈ వెబ్ సిరీస్ పేరు వెన్స్‌డే (Wednesday). సుమారు రెండున్నరేళ్ల కిందట వచ్చిన తొలి సీజన్ ప్రేక్షకులను వణికించగా.. ఇప్పుడు రెండో సీజన్ రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

వెన్స్‌డే వెబ్ సిరీస్ టీజర్

వెన్స్‌డే వెబ్ సిరీస్ రెండో సీజన్ టీజర్ భయపెడుతోంది. ఈ సిరీస్ లోని ప్రధాన పాత్ర వెన్స్‌డే ఆడమ్స్ ఈ కొత్త సీజన్లో మరింత ప్రమాదకరంగా మారి భయపెట్టడానికి వస్తున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ టీజర్ రిలీజ్ గురించి ఒక రోజు ముందే వెల్లడించిన నెట్‌ఫ్లిక్స్.. బుధవారం (ఏప్రిల్ 23) రాత్రి రిలీజ్ చేసింది.

“మీ కేలండర్ ను ఇప్పుడే క్లియర్ చేసి పెట్టుకోండి. వెన్స్‌డే సీజన్ 2 ఆగస్ట్ 6 నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది” అనే క్యాప్షన్ తో ఈ టీజర్ రిలీజ్ చేసింది. మరోసారి నెవెర్‌మోర్ లో గందరగోళ పరిస్థితులు నెలకొనబోతున్నాయని ఈ టీజర్ విషయం చెబుతూ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.

వెన్స్‌డే రెండో సీజన్ రెండు భాగాలు రాబోతుండటం విశేషం. తొలి భాగం ఆగస్ట్ 6 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక రెండో భాగం సెప్టెంబర్ 3న వస్తుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.

వెన్స్‌డే వెబ్ సిరీస్ గురించి..

వెన్స్‌డే ఓ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ కామెడీ వెబ్ సిరీస్. ఛార్లెస్ ఆడమ్స్ క్రియేట్ చేసిన వెన్స్‌డే ఆడమ్స్ అనే పాత్ర చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ఈ పాత్రలో జెన్నా ఒర్టెగా నటించింది. ఆమెకు కొన్ని అతీత శక్తులు ఉంటాయి. తన సోదరుడిని బాయ్స్ పోలో టీమ్ సభ్యులు ఏడిపించారని తెలుసుకొని పూల్ లోకి పిరానాలను వదులుతుంది.

అది తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం ఆమెను స్కూల్ నుంచి పంపించేస్తుంది. అక్కడి నుంచి ఆమె వెర్మాంట్ లోని జెరికోలో ఉన్న నెవెర్‌మోర్ అకాడెమీకి వెళ్తుంది. అక్కడ కూడా ఆమె ప్రవర్తన ఇతర విద్యార్థులకు వింతగా అనిపిస్తుంది. అయితే తనకున్న శక్తులతో అక్కడ జరిగే ఓ హత్య మిస్టరీని ఛేదిస్తుంది. తొలి సీజన్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆగస్టులో రాబోయే వెన్స్‌డే రెండో సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024