ఈ మలయాళం మూవీ ఓ డిఫరెంట్ థ్రిల్లర్.. యూట్యూబ్‌లో తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు.. జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్ జంటగా..

Best Web Hosting Provider In India 2024

ఈ మలయాళం మూవీ ఓ డిఫరెంట్ థ్రిల్లర్.. యూట్యూబ్‌లో తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు.. జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్ జంటగా..

Hari Prasad S HT Telugu

మలయాళం థ్రిల్లర్ సినిమాల్లో ఓ డిఫరెంట్ ఫీల్ కలిగించే సినిమా ఇది. ఏడాదిన్నర కిందట థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ తోపాటు యూట్యూబ్ లోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ మలయాళం మూవీ ఓ డిఫరెంట్ థ్రిల్లర్.. యూట్యూబ్‌లో తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు.. జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్ జంటగా..

మలయాళం థ్రిల్లర్స్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరేమో. ముఖ్యంగా ఓటీటీ వచ్చిన తర్వాత అక్కడి సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అయి ఇక్కడి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాంటి థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఓ డిఫరెంట్ ఫీల్ కలిగించే మూవీ పులిమడ (Pulimada). జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్ కలిసి నటించిన ఈ సినిమా యూట్యూబ్ లోనూ ఫ్రీగా అందుబాటులో ఉంది.

పులిమడ మూవీ స్టోరీ ఏంటంటే?

పులిమడ 2023లో వచ్చిన మలయాళం థ్రిల్లర్ మూవీ. ఏకే సజన్ డైరెక్ట్ చేసిని సినిమా ఇది. కేవలం గంటా 48 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాకు థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కథ ప్రధానంగా ఒక రాత్రిలోనే జరుగుతుంది. ఎంత ప్రయత్నించినా పెళ్లి కాకపోవడంతో మానసికంగా కుంగిపోతాడు ఓ పోలీస్ అధికారి. అతని జీవితంలోకి అనుకోకుండా వచ్చే ఓ అమ్మాయి.. తాగిన మత్తులో ఉన్న అతనితో ఎలా ఆడుకుంటుందన్నదే ఈ పులిమడ కథ.

ఓ అడవిలో విసిరేసినట్లుగా ఉండే ఓ ఇల్లు. ఆ ఇంట్లోని పోలీసు పెళ్లి పనులు.. అక్కడి వాళ్లను వణికించే పులి.. ఆ పులి వేటలో బిజీగా ఉండే పోలీసులు.. ఇలా కథ ఓవైపు నడుస్తూ ఉంటుంది. మరోవైపు పెళ్లి కోసం ఉత్సాహంగా సిద్ధమై చివరికి పెళ్లి రోజే అమ్మాయి లేచిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఆ పోలీసు ఆ రాత్రి విపరీతంగా తాగుతాడు.

ఆ సమయంలో ఎవరైనా అమ్మాయి కావాలంటూ రోడ్డుపైకి వెళ్లే అతనికి అనుకోకుండా ఓ అమ్మాయి రోడ్డుపై కనిపిస్తుంది. అయితే ఆ అమ్మాయే అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అతన్ని రెచ్చగొడుతూ అతని ఇంటికే వెళ్లే ఆ అమ్మాయి ఏం చేసింది అన్నది ఈ పులిమడ మూవీ స్టోరీ.

పులిమడ ఎలా ఉందంటే?

థ్రిల్లర్ జానర్ సినిమాల్లోనే ఓ డిఫరెంట్ ఫీల్ కలిగించే మూవీ ఇది. ఇందులో విన్సెంట్ అనే పాత్రలో జోజు జార్జ్, మాహిష్మతి అనే పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించారు. పులిమడ మూవీలో నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, ప్రేక్షకులను కట్టిపడేసే సీన్స్ హైలైట్ అని చెప్పొచ్చు.

ముఖ్యంగా విన్సెంట్ స్కారియాగా జోజు జార్జ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడు ఈ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. అటు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించిన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో మాహిష్మతిగా నటించింది. పులిమడలోని ఈ లీడ్ క్యారెక్టర్లు సినిమా అంతా ఎంతో ఆసక్తి రేపేలా ఉంటాయి.

ఇక సినిమాటోగ్రఫీ. ఆర్ట్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఈ పులిమడ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వేణు వ్యవహరించగా.. జీతూ సెబాస్టియన్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నాడు. స్క్రిప్ట్ లో అక్కడక్కడా లోపాలు కనిపించినా.. సాంకేతిక బృందం పనితీరు ఈ సినిమాను కచ్చితంగా చూసే విధంగా మలిచాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో కొన్ని సీన్స్ కట్టిపడేసేలా ఉంటాయి. ఈ పులిమడ మూవీ నెట్‌ఫ్లిక్స్ తోపాటు యూట్యూబ్ లోనూ తెలుగులో అందుబాటులో ఉంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024